నిద్రపోయే ముందు మీ మనసులోని సమస్యలను పరిష్కరించుకోండి

నిద్రపోయే ముందు మీ మనసులోని సమస్యలను పరిష్కరించుకోండి

రాత్రిపూట పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకోవాలని మనందరికీ ఉంటుంది. మనం ప్రశాంతంగా నిద్రించడానికి మన మనస్సు స్విచ్ ఆఫ్ అవ్వాలని ఆశిస్తాము. కానీ మనం సమస్యలు, లక్ష్యాలు, చేయవలసిన పనులు లేదా ఇతర ఆలోచనలు ఆలోచిస్తూ పడుకుంటాము. తద్వారా మనస్సు నెమ్మదించకుండా యాక్టివ్ అవుతుంది. ఇది రాత్రిపూట అనేక ఆలోచనలను కలిగించి, నిద్రకు భంగం కలిగిస్తుంది, శారీరకంగా మరియు మానసికంగా మనపై ప్రభావం చూపుతుంది.

రాత్రి నిద్రపోయే ముందు మీరు మనస్సులోని సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో ఇప్పుడు చూద్దాం –

సంకల్పం :

నేను సంతోషకరమైన జీవిని. నేను తేలికగా, స్వచ్ఛంగా ఉన్నాను. నా మనస్సు రోజంతా ప్రశాంతంగా ఉంటుంది… నేను నా మనస్సు మరియు శరీరాన్ని బాగా చూసుకుంటాను… నేను నా పనిని మరియు సరైన విశ్రాంతిని  బ్యాలెన్స్ చేసుకుంటాను. నా సరైన నిద్ర అలవాట్లు నా మనస్సు, మెదడు మరియు శరీరం అత్యధిక సామర్థ్యంతో పనిచేయడానికి వీలు కల్పిస్తాయి. నేను నిర్ణీత సమయానికి నిద్రపోతాను… నిద్రపోయే 30 నిమిషాల ముందు … నేను టెలివిజన్ స్విచ్ ఆఫ్ చేస్తాను… గాడ్జెట్‌ల నుండి దూరంగా ఉంటాను. నేను పడుకునే ముందు విశ్రాంతి తీసుకోవడానికి నా మనస్సును మరియు శరీరాన్ని సిద్ధం చేసుకుంటాను… నేను నా ఆలోచనలను గమనిస్తాను… మనసులో ఏదైనా సమస్య ఉంటే… నా మనస్సు కలవరపడితే… ఆ రోజు గురించి ఏదైనా ఆలోచనలతో బాధపడుతూ ఉంటే… మనసు అశాంతికి లోనైతే… నేను వెంటనే నా మనసుకు చెప్పుకుంటాను… దానికి సమాధానం చెబుతాను… లేదా దీని గురించి రేపు ఆలోచిద్దామని నా మనసును ఆదేశిస్తాను … నా మనసు నా మాట విని మౌనంగా ఉంటుంది… ఆ విషయం గురించి ఆలోచించడం మానేసి … ప్రశాంతంగా ఉంటుంది. 10 నిమిషాల పాటు నేను స్వచ్ఛమైన సమాచారాన్ని చదువుతాను లేదా వింటాను… మనసుకు చివరి సమాచారంగా…  ఆ రోజు కోసం చేసిన సంకల్పాన్ని రిపీట్ చేసుకుంటాను… నా శరీరం మరియు మనస్సు రాత్రిపూట బాగా విశ్రాంతి తీసుకుంటున్నాయని నేను నిర్ధారిస్తాను… అవి ఛార్జ్ అవుతాయి…కొత్తగా బలాన్ని పొందుతాయి. 

మీ మనస్సును నెమ్మదించి మీకు అవసరమైన నిద్రను పొందడానికి ప్రతిరోజూ ఈ సంకల్పాన్ని రిపీట్  చేయండి. మీరు తేలికైన, స్వచ్ఛమైన మనస్సుతో నిద్రిస్తే, మీకు మీరు నిద్రించడానికి తగినంత సమయం ఇచ్చుకుంటారు మరియు మరుసటి రోజు ఉదయం ఫ్రెష్ గా మేలుకుంటారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »
25th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 1)

మన బాహ్య రూపాన్ని లేదా పరిశుభ్రతను చెక్ చేయడానికి, మనం ప్రతిరోజూ అద్దంలోకి చూస్తాము. కానీ మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థాయిలో, మీ అంతర్గత ముఖం లేదా ఆధ్యాత్మిక స్వయంలో ఏదైనా తప్పు

Read More »
24th-sept-2023-soul-sustenance-telugu

నెగిటివ్ పరిస్థితుల్లో పాజిటివ్ గా ఉండటానికి 5 మార్గాలు

మన జీవితంలో ఏదైనా పరిస్థితి నెగిటివ్ ఫలితాన్ని కలిగి ఉండవచ్చు. కానీ చాలా సార్లు  మనము నెగిటివ్ ఫలితం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము ఇంకా అది జరగడానికి ముందే భయపడతాము. వివేకంతో నిండిన బుద్ధి

Read More »