Hin

06th january - soul sustenance

ఇతరులను విమర్శించడం మరియు తప్పులు వెతికే వైఖరి నుండి విముక్తి పొందడం

మన జీవన సంబంధాలలో భాగంగా విభిన్న వ్యక్తిత్వాలు గల వ్యక్తులతో వ్యవహరిచవలసి ఉంటుంది. వారి అనేక మాటలు మరియు కర్మలతో వ్యవహరిచవలసి ఉంటుంది. వారి మాటలు మరియు కర్మలు కొన్ని నెగెటివ్ గా ఉండవచ్చు , వాటిలో కొన్ని పాజిటివ్ గా ఉండవచ్చు. కొన్ని మనకు నచ్చేలా ఉండవచ్చు, మరికొన్ని మనం ఆశించిన విధంగా ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితులలో, ఇతరులను విమర్శించడం లేదా ఖండించడం చాలా సులభం. కొన్నిసార్లు మనం ఇతరులను ఇష్టపడకపోవడం మరియు వారి గురించి నెగెటివ్ గా ఆలోచించడం మరియు మాట్లాడటం కూడా ప్రారంభిస్తాము. మన వ్యక్తిత్వంలోని ఈ నెగెటివ్ కోణాన్ని మార్చగలిగేలా మనం అలవర్చుకోవాల్సిన కొన్ని లక్షణాలు ఏమిటి?

1. ఆత్మిక ప్రేమ – మనమందరం ఆధ్యాత్మిక జీవులం లేదా ఆత్మలం, ఒకే పరమాత్ముని పిల్లలం. భగవంతున్ని ప్రేమ సాగరుడు అని అంటాము. మనకు భగవంతునితో సమానమైన ప్రేమ స్వరూపం ఉంది. మన సంబంధాలలో సత్యమైన ప్రేమ స్వభావాన్ని తీసుకువచ్చినప్పుడు, ఆత్మిక ప్రేమతో అందరినీ చూడటం ప్రారంభించినప్పుడు వారి బలహీనతలు మన అంతరాత్మకు తాకవు అందువలన వారిని సులభంగా క్షమించగలము.

2. శుభ భావన మరియు శుభ కామనలు – వ్యక్తుల విశేషతలను చూసినప్పుడు ప్రసరించే పాజిటివ్ వైబ్రేషన్స్ ను “శుభ భావనలు” అని అంటారు . ఇతరుల మంచితనం చూస్తూ, ఇతరుల జీవితంలోని అడుగడుగునా మంచిని కోరుకునేటప్పుడు ఉండే పాజిటివ్ ఆలోచనలను “శుభ కామనలు” అంటారు. ఈ రెండూ మనం ఇతరులను మరింత అర్థం చేసుకునేలా చేస్తాయి మరియు వారిని చూసేటప్పుడు మనం వినయంగా మారుతాము తద్వారా నెగెటివ్ ఆలోచనల నుండి విముక్తి పొందుతాము.

3. కృతజ్ఞతాభావం – మన కుటుంబ సభ్యులు ,స్నేహితులు లేదా ఆఫీసులో వారు ఏదో ఒక సమయంలో మనకు మరియు ఇతరులకు మంచి చేసే ఉంటారు . వారు చేసిన మంచిని గుర్తుంచుకోవడం మరియు కృతజ్ఞతతో ఉండటం వలన వారిని నిరంతరం పాజిటివ్ గా చూడగలుగుతాము.

4. సహనం – ఇతరుల నెగెటివిటీ వలన మనం సులభంగా కలవరపడటానికి ఒక ప్రధాన కారణం – మనకు సహనం లేకపోవడం. భగవంతుడు ఇచ్చే ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా సహనం పెరుగుతుంది . భగవంతుడు కరుణాసాగారుడు. వారితో మెడిటేషన్ లో బుద్ధిని జోడించడం ద్వారా సహనం పెరుగుతుంది. వారు మనల్ని విశాల హృదయులుగా చేస్తారు. ఇది మనం ఇతరులతో సులభంగా సర్దుకుపోవడానికి మరియు వారిని విమర్శించకుండా లేదా ఖండించకుండా ఉండేందుకు మనకు సహకరిస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

25th june2024 soul sustenance telugu

విజయం కోసం పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని తయారుచేసుకోవడం (పార్ట్ 1)

జీవితంలో వివిధ రకాల పరిస్థితులు ఎదురుకోవడం, వివిధ రకాల వ్యక్తులను కలవడం, మీకు ఎన్నో సవాళ్లను తీసుకొస్తుంది, మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. అలాగే, మన వ్యక్తిత్వం  స్థాయిలో మన శక్తులు

Read More »
24th june2024 soul sustenance telugu

పోటీ పడకుండా సహకరించుకుందాం

నిజమైన సహకారం అంటే సర్వులకు ఎల్లవేళలా తన వారనే భావన మరియు సాధికారత ఉద్దేశ్యంతో షరతులు లేని సహాయాన్ని అందించడం. ఇది వినయం, ప్రేమ, కరుణ మరియు తాదాత్మ్యం వంటి మన నిజ గుణాలను

Read More »
23rd june2024 soul sustenance telugu

నిద్రను ప్రశాంతంగా మరియు ఆనందంగా మార్చడానికి 5 చిట్కాలు

నిద్ర మనిషి ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి. మన శారీరక, ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ ఆరోగ్యాన్ని అపారంగా ప్రభావితం చేస్తుంది. నిద్రను ప్రశాంతంగా మరియు ఆనందంగా మార్చడానికి 5 చిట్కాలను చూద్దాం –

Read More »