మీ ఆఫీసు వాతావరణాన్ని ఆధ్యాత్మికంగా మార్చడానికి 5 మార్గాలు

మీ ఆఫీసు వాతావరణాన్ని ఆధ్యాత్మికంగా మార్చడానికి 5 మార్గాలు

  1. ప్రతిరోజు జ్ఞానం యొక్క పాజిటివ్ ఆధ్యాత్మిక ఆలోచనలను చదవడం మరియు పంచుకోవడం – మీ ఆఫీసులో ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా అందరినీ పాజిటివ్  మరియు స్వచ్ఛమైన ఆలోచనతో ట్యూన్ చేయటం చాలా మంచి అభ్యాసం, ఇది ప్రతి ఉదయం ఇంటర్నెట్ మరియు ఇతర సాంకేతికత  మాధ్యమాల ద్వారా లేదా ఆఫీసులోని అందరూ చదవగలిగేలా నోటీసు బోర్డులపై ప్రదర్శించబడం వలన  అందరితో పంచుకోబడుతుంది. ప్రతిరోజూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చదవడం ద్వారా ఒకే ఆలోచనా విధానాలు ఆఫీసు లో ఆధ్యాత్మిక సామరస్యాన్ని తయారీచేస్తాయి మరియు ఆఫీసు వాతావరణాన్ని మంచితనంతో నిండిన వైబ్రేషన్స్ తో నింపుతాయి.
  2. ఆత్మిక ఛార్జింగ్ కోసం ఆఫీసులో రూమ్ ను తయారు చేయడం – ఆఫీసులో ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంలో మెడిటేషన్ రూమ్ కోసం ఒక చిన్న స్థలం ఉండాలి , అక్కడ ఆఫీసు వారు ఎవరైనా వెళ్లి కొన్ని నిమిషాలు కూర్చుని లోతైన అనుభవాన్ని పొందవచ్చు. ధ్యానం మరియు ఆధ్యాత్మిక శక్తితో తమను తాము ఛార్జ్ చేసుకోండి. అలాగే, ఆఫీసులోని వ్యక్తులు తమ వర్క్ డెస్క్‌లపై కూర్చున్నప్పుడు ఆలోచనల మైండ్ ట్రాఫిక్ కంట్రోల్ ను ప్రతి గంటకు ఒక నిమిషం పాటు సాధన చేయవచ్చు.
  3. స్వచ్ఛమైన మరియు పాజిటివ్ శక్తితో కూడిన పాజిటివ్ సంభాషణలను కలిగి ఉండటం – ప్రతి ఒక్కరూ ఇతరుల గురించి ఆలోచించేది  మరియు మాట్లాడేది  కార్యాలయంలోని వైబ్రేషన్స్ను  ప్రభావితం చేస్తుంది. ఆఫీసులో విభిన్న వ్యక్తిత్వాలు, విభిన్న పని చేసే విధానాలతో ఉన్నందున చాలా మంది వ్యక్తులు ఆఫీసులోని ఇతరులపై నెగెటివ్ గా  మరియు అనవసరంగా మాట్లాడుకుంటూ ఉంటారు. దీన్ని నివారించడం మరియు నో గాసిప్‌ను ఆఫీసు యొక్క విజయవంతమైన మంత్రంగా మార్చడం వలన ఆఫీసు మరియు దాని ఆధ్యాత్మిక శక్తిని పునరుజ్జీవింపజేస్తుంది. 
  4. ఆఫీస్‌లో ప్రేమ, వినయం మరియు సహకారం యొక్క శక్తి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం – ఆఫీసులోని సానుకూల వాతావరణాన్ని తగ్గించి, ఒత్తిడిని కలిగించే ముఖ్యమైన అంశాలలో ఒకటి అసూయ, ద్వేషం, పోలిక మరియు అధిక పోటీతత్వం. మనం ఎల్లప్పుడూ ఇతరుల కంటే ముందుండి మరియు ఇతరుల కంటే మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించినప్పుడు, మనం ఒకరికొకరు సానుకూల వైబ్రేషన్స్ ఇవ్వడం మానేస్తాము. మనం ఒకరినొకరు ప్రేమిస్తూ, వినయంగా ఉంటూ, ఇతరులను మనకంటే ముందు ఉంచినప్పుడు, మనం పాజిటివ్  వాతావరణాన్ని తయారుచేస్తాము.
  5. శాంతిని సృష్టించే పాజిటివ్ విధానాలను అవలంభించండి – ప్రపంచవ్యాప్తంగా అనేక ఆఫీసులో అనుసరిస్తున్న ఒక అందమైన పద్ధతి, ఆఫీసులో మృదువైన మరియు ఆహ్లాదపరిచే మెడిటేషన్ మ్యూజిక్ ను ప్లే చేయడం. అలాగే, ఆఫీసులోని ప్రతి ఒక్కరికీ శాంతి అనుభూతిని కలిగించే విధంగా ఆఫీసును  తయారు చేయడం. గోడలు, ఫర్నిచర్ కోసం తేలికపాటి ఆధ్యాత్మిక రంగులు మరియు డిజైన్‌లను ఎంచుకోవడం ముఖ్యమైన భౌతిక చర్యలు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »