Hin

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 1)

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 1)

ప్రస్తుతం మానవుడు పర్యావరణంలో వ్యాపిస్తున్న కామం, క్రోధం, దురాశ, మోహం మరియు అహం వంటి వికారాల వైబ్రేషన్స్ ను , నిరంతరం స్వీకరిస్తున్న ప్రపంచంలో  జీవిస్తున్నాడు. అలాగే, ప్రపంచంలో ఎక్కువ అనారోగ్యాలు పెరగడం,  మరియు అనారోగ్యాల తీవ్రతతో పాటు ఆ అనారోగ్యాలు మానవ జీవితాలను అంతం చేసే సామర్థ్యం కూడా పెరుగుతోంది. ఈ రెండు విషయాల మధ్య సంబంధం ఏమిటి? మానవ శరీరాలు మనం తీసుకునే ఆహారం, త్రాగే నీరు మరియు పీల్చే గాలి ఆధారంగా పనిచేస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా, కూరగాయలు, పండ్లు మరియు ధాన్యాలు చాలా కలుషితమవుతున్నాయి, అలాగే మనం త్రాగే నీటి నాణ్యత, పీల్చే గాలి నాణ్యతలో కూడా తగ్గుదల ఎక్కువగా ఉంది. పారిశ్రామికీకరణ మరియు రోడ్లపై వాహనాల సంఖ్య పెరగడం వంటి వివిధ కారణాల వల్ల కాలుష్యం మరియు రసాయన వాయువులు గాలిలోకి విడుదలవుతున్నాయి. ఇవన్నీ శరీరంలో వివిధ రకాల తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తున్నాయి.

ప్రపంచంలోని కోట్లాది ఆత్మలు పర్యావరణానికి మరియు ప్రకృతికి నిరంతరం ప్రసరించే వికారాల వైబ్రేషన్స్ ద్వారా కాలుష్యం మరియు ఇతర మలినాలతో పాటు ఆహారము , నీరు , గాలి మరింత కలుషితం అవుతు న్నాయి . వికారాలు అనేవి భౌతికేతర అశుద్ధత ,  ఇవి  కూరగాయలు, పండ్లు మరియు ధాన్యాలు పండించడంతో పాటు మనం వాటిని వండినప్పుడు మరియు తినేటప్పుడు మాత్రమే కాక నీరు మరియు గాలిపై ప్రభావం చూపుతాయి. ఫలితంగా వివిధ రకాల శారీరక, మానసిక అనారోగ్యాలు కలిగిస్తాయి. అలాగే, ఈ వికారాల నెగెటివ్ ఎనర్జీ  వాస్తవానికి అనేక మానవ మరియు జంతుజాలం యొక్క దేహ  భ్రాంతి  యొక్క వైబ్రేషన్స్. అలాగే నెగెటివ్ కర్మల వైబ్రేషన్స్ కేవలం వాటిని ప్రసరించిన ఆత్మల జీవితంలో నెగెటివ్ పరిస్థితులను తీసుకురావడమే కాకుండా, ఇతరులకు  కూడా ఈ వైబ్రేషన్స్  తీసుకునే ఆహారం, నీరు మరియు గాలి ద్వారా చేరి వారి శరీరంలో ఉన్న ఆధ్యాత్మిక శక్తికి రూపమైన సూక్ష్మ శరీరం యొక్క క్వాలిటిని  తగ్గిస్తాయి. సూక్ష్మ శరీరంలోని ఈ మార్పులు మన భౌతిక శరీరాన్ని ప్రభావితం చేస్తాయి మరియు అనారోగ్యాలను తెచ్చి ఆత్మ యొక్క శ్రేయస్సుకు హాని కలిగిస్తాయి.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

15th dec 2024 soul sustenance telugu

వ్యక్తులను నిజాయితీగా, ఉదారంగా మెచ్చుకోవడం

మన చుట్టూ ఉన్న వ్యక్తులు వారు ఎవరో, వారు ఏమి చేస్తున్నారో అనే దానికి ఇప్పటికే పొందిన దానికంటే కొంచెం ఎక్కువ ప్రశంసలు కోరుకుంటారు. గుర్తింపు అనేది వ్యక్తి యొక్క స్ఫూర్తిని మరియు సమర్థతను

Read More »
14th dec 2024 soul sustenance telugu

ప్రపంచ పరివర్తనలో మహిళల పాత్ర

ప్రపంచంలో ప్రత్యేకమైనవారిగా చేసే అనేక మంచి సుగుణాలు మరియు శక్తులతో మహిళలు ఆశీర్వదించబడ్డారు. భగవంతుడు వారి ప్రత్యేకతలను చాలా ప్రేమిస్తారు. స్వచ్ఛత, శాంతి, ప్రేమ మరియు ఆనందాల కొత్త ప్రపంచాన్ని సృష్టించడంలో వారిని ముందుంచుతారు.

Read More »
13th dec 2024 soul sustenance telugu

గెలుపు, ఓటములపై మీ ఆత్మగౌరవం ఆధారపడుతుందా (పార్ట్ 2)

మిమ్మల్ని మీరు ఆత్మిక దృష్టితో చూడటం ప్రారంభించండి, అప్పుడు మీరు సదా విజయవంతమయ్యారని మీకు అనిపిస్తుంది – ఆధ్యాత్మిక జ్ఞానం మనల్ని మనం ఆత్మిక దృష్టితో లేదా జ్ఞాన నేత్రాలతో చూసుకోవాలని బోధిస్తుంది. మన

Read More »