6th march soul sustenance telugu

మానసిక స్వేచ్ఛ పొందడానికి 5 మెట్లు

ప్రతి రోజు చివరిలో, మనము చేయవలసిన పనుల లిస్ట్ నుండి చేసిన పనులను టిక్ చేస్తాము. ఇప్పటి నుండి మనం ఎలా ఉండాలో అనే లిస్టును కూడా చెక్ చేద్దాం. రోజువారీ సెల్ఫ్- చెకింగ్ ఒక ఆరోగ్యకరమైన అభ్యాసమే కాక మన జీవితంలోని ప్రతి రంగంలో విజయానికి మూలం. ఏదో ఒక సమయంలో, మన ఆంతరిక వ్యక్తిత్వం గురించి, మనం ఎవరు, మనం ఎవరు కావచ్చు మరియు మనం ఎలా మెరుగుపడగలం అనే దాని గురించి ఇతర వ్యక్తుల నుండి అభిప్రాయాన్ని అందుకుంటాము. ఇతరుల దృష్టిలో మనల్ని మనం తెలుసుకునే బదులు, మనం రోజూ మనల్ని మనం స్వయంగా విశ్లేషించుకొని మన ఆంతరిక వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

  1. విభిన్న పాత్రలు పోషిస్తున్నప్పుడు, మీరు ఎలా ఉన్నారనే దానిపై కంటే మీరు ఎల్లప్పుడూ మీరు ఏమి చేస్తున్నారో అనే దానిపైనే దృష్టి పెడతారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నారనే దానితో సంబంధం లేకుండా, మిమ్మల్ని మీరు అంటే మీ వ్యక్తిత్వాన్ని స్పష్టంగా చూసుకోవాలి – మీ అలవాట్లు, ప్రవర్తనలు, విలువలు, శక్తులు మరియు మీరు మెరుగుపరచుకోవాల్సిన వివిధ రంగాలను విశ్లేషించుకోవడం చాలా ముఖ్యం.

 

  1. మీ గురించి ఇతరుల అభిప్రాయం లేదా ఫీడ్‌బ్యాక్ సాధారణంగా వారి దృక్పథం, మానసిక స్థితి లేదా వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. అందువల్ల, మీరు నిజంగా ఎవరో మరియు మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలో అర్థం చేసుకోవడానికి సెల్ఫ్-చెకింగ్ అత్యంత నమ్మదగిన పద్ధతి.

 

  1. ఏదైనా 2 నుండి 3 వ్యక్తిత్వ లక్షణాలతో మీరు ఎలా ఉండాలో లిస్టును తయారు చేసుకొండి. ఉదా. నేను అందరి ప్రత్యేకతలను చూసి వారి బలహీనతలను పట్టించుకోలేదా? నేను అన్ని రకాల కోపం మరియు అహంకారాల నుండి విముక్తి పొందానా? నేను భయం మరియు ఆందోళన నుండి విముక్తి పొందానా? నేను నాతో, ఇతరులతో మరియు నా జీవితంలోని ప్రతి సన్నివేశంతో సంతృప్తిగా ఉన్నానా? ఎలాంటి అసూయ, పోల్చుకోవటం లేకుండా అందరినీ నాకన్నా ముందు ఉంచానా? లేదా మీలో లోపించిన లేదా మీరు మెరుగుపరచుకోవాలనుకునే ఏదైనా ఇతర వ్యక్తిత్వ లక్షణాలు. ప్రతి రాత్రి ఆ లిస్టును నింపండి. 10 మార్కులు, శాతాలు లేదా అవును లేదా కాదుతో మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి. మీ లిస్టులోని వ్యక్తిత్వ లక్షణాలను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి లేదా వాటిని కొంత సమయం పాటు అలాగే ఉంచి ఆపై మీ వ్యక్తిగత ఎంపిక మరియు స్వంత ఆంతరిక అవసరాలను బట్టి మార్చుకోండి.

 

  1. ప్రతి రాత్రి మీరు నిద్రపోయే ముందు సెల్ఫ్-చెకింగ్ కేవలం రెండు నిమిషాలు మాత్రమే పడుతుంది. ప్రతిరోజూ మీ పురోగతిని గమనించడానికి చిన్న డైరీని పెట్టుకోండి. ఇది మీ వ్యక్తిత్వం యొక్క విభిన్న అంశాలను మార్చి మెరుగుపరచడానికి ఎంతో ఉపయోగ పడుతుంది. ఇది మీ స్వపరివర్తన లక్ష్యాల వైపు క్రమంగా వెళ్లడానికి మీకు సహాయపడుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

24th march soul sustenance telugu

24th March – జీవన విలువలు

కర్మ సిద్ధాంతం ఎలా పని చేస్తుంది? మనమందరం ఆధ్యాత్మిక శక్తులం  లేదా ఆత్మలం . ప్రపంచ నాటకంలో వివిధ రకాల కర్మలను చేస్తాము. మనమందరం ప్రపంచ నాటకంలో శరీర బ్రాంతిలో కొన్ని మంచి కర్మలు

Read More »
23rd march soul sustenance telugu

23rd March – జీవన విలువలు

మరింత వినడం ప్రారంభించండి … తక్కువగా తీర్పు చెప్పండి మనమందరం గొప్ప వక్తలు కావచ్చు, కానీ మనం మంచి శ్రోతలమా? పరిపూర్ణమైన సంభాషణ అంటే కేవలం మనం బాగా మాట్లాడగలగడం మరియు మన మాటలను

Read More »
22nd march soul sustenance telugu

22nd March – జీవన విలువలు

విజయం కోసం ఆత్మ శక్తిని మరియు పాత్ర శక్తిని సమతుల్యం చేయుట (భాగము 3) నిన్నటి సందేశాన్ని కొనసాగిద్దాము. ఆత్మ శక్తికి దోహదపడే మిగిలిన అంశాలు: శుభ భావన, శుభ కామన, ఇతరులపై సంపూర్ణ

Read More »