పాత్ర-ప్రేరిత ఒత్తిడిని నివారించండి - ఇది ఒక పాత్ర మాత్రమే

పాత్ర-ప్రేరిత ఒత్తిడిని నివారించండి - ఇది ఒక పాత్ర మాత్రమే

జీవితంలో అనేక పాత్రలు పోషించాల్సి ఉన్నందున, మనము ఒత్తిడిని సహజం అని  అంగీకరించాము. పాత్ర అభిమానం మనల్ని  పదవి, విజయాలు మరియు వయస్సు ఆధారంగా ప్రదర్శించేలా చేస్తుంది. మనము కొన్నిసార్లు మన  పాత్రలు,సంబంధాలు మరియు పడవులనే  లేబుల్స్ తో అతిగా గుర్తిస్తూ ఉంటాము. ఇది అంచనాలు, పోటీ తత్వం మరియు ఇతరులను నియంత్రించే తత్వం నేర్పించి  ఒత్తిడికి గురిచేస్తుంది.

  1. రోజంతా మీ చేతనాన్ని చెక్ చేసుకోండి. మీరు మీ జీవితంలో ప్రతి సన్నివేశాన్ని నేను జీవిత భాగస్వామిని, నేను తల్లిని లేదా తండ్రిని, సీనియర్ లేదా జూనియర్ ని…… అనే పాత్ర యొక్క అహంకారంతో చేస్తున్నారా? మీ పాత్రలతో మిమల్ని మీరు గుర్తించడం ద్వారా  మీరు మీ మనస్సులో పాత్ర యొక్క చిత్రం వలె ప్రవర్తిస్తారు.
  2. డిశ్చార్జ్ అయిన ఫోన్ ఏ పనిని చేయలేదు. మనం 30 నిమిషాలు ఛార్జ్ చేస్తే, దానిని అనేక ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. అదే విధంగా, రోజులో అనేక పాత్రలను పోషించడానికి, ఉదయం 30 నిమిషాలు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చదవడం లేదా వినడం మరియు ధ్యానం చేయడం ద్వారా మిమ్మల్ని మీరు ఛార్జ్ చేసుకోండి.
  3. పరిస్థితులు సరిగా లేనప్పటికీ ఆత్మిక గుణాలను ప్రసరింపజేయాలని గుర్తుంచుకోండి. ప్రతి పనిలో ఇతరులతో వ్యవహరించేటప్పుడు వారి పాత్రలకు కనెక్ట్ అయ్యే బదులుగా వారిని నడిపించే ఆధ్యాత్మిక శక్తి అయిన ఆత్మకు కనెక్ట్ అవ్వండి. ఇది వారి పట్ల నిజమైన గౌరవం ఏర్పరుస్తుంది మరియు వారి పాత్రల పట్ల మర్యాద యొక్క పునాదిని వేస్తుంది.
  4.  మీరు ఒక నటుడు – ఆత్మ, ఈ ప్రపంచ నాటకం వేదికపై ప్రతి సన్నివేశాన్ని మీ శరీరం మరియు పాత్ర ద్వారా ప్రదర్శిస్తుంది. నటుడైన మీ అసలైన వ్యక్తిత్వం శాంతి, ఆనందం, ప్రేమ మరియు స్వచ్ఛత అని నిర్ధారించుకోండి. అప్పుడు మీ ప్రతి పాత్ర అప్రయత్నంగా ఎలా మారుతుందో చూడండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

శాంతి అనుభూతికి 5 దృఢసంకల్పాలు

30th May – జీవన విలువలు

శాంతి అనుభూతికి 5 దృఢసంకల్పాలు నేను, నా నుదుటి మధ్యలో కూర్చున్న ఆధ్యాత్మిక నక్షత్రం… నేను శాంతి యొక్క సుందర  గుణాన్ని అనుభూతి చేస్తూ నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ మరియు ప్రతిదానికీ

Read More »
వర్క్-లైఫ్ (work -life)ని బ్యాలన్స్ గా ఉంచుకోవటం

29th May – జీవన విలువలు

వర్క్-లైఫ్ ని బ్యాలన్స్ గా ఉంచుకోవటం మన వర్క్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అనే విషయం అంగీకరించే విషయమే. కానీ కొన్నిసార్లు మనము వర్క్  కు   మిగతా వాటికన్నా ఎక్కువ

Read More »
మనసు యొక్క ట్రాఫిక్ కంట్రోల్

28th May – జీవన విలువలు

మనసు యొక్క ట్రాఫిక్ కంట్రోల్ ఆలోచనలు మన భాగ్యాన్ని సృష్టిస్తాయి. కాబట్టి మనం ఒక్క తప్పుడు ఆలోచన కూడా చేయకూడదు. సరైన ఆలోచనా సరళితో మనస్సును ప్రోగ్రామ్ చేయడానికి, మనం ప్రతి గంట తర్వాత

Read More »