Hin

7th april soul sustenance telugu

ఉపవాస సమయంలో కలిగే ఆధ్యాత్మిక లాభాలను అనుభూతి చెందడము

రంజాన్ సందర్భంగా (మార్చి 23 – ఏప్రిల్ 21 వరకు) ఆధ్యాత్మిక సందేశము

మనం ప్రస్తుతం రంజాన్ నెలలో ఉన్నాము, ఈ సమయంలో ఇస్లాం మత సోదరసోదరీలు ఉదయం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు 30 రోజులు ఉపవాసంలో ఉంటారు. ఈద్-ఉల్-ఫితర్‌ను రంజాన్ పూర్తయిన మరుసటి రోజున జరుపుకుంటారు. ప్రపంచంలో ఉన్న ఇంచుమించు అన్ని మతాలు, మార్గాలు ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఉపవాసం ఉండమని చెప్తుంటాయి. ఈరోజుల్లో చాలామంది, మేము మొబైళ్ళు, ఇంటర్నెట్, ఖరీదైన కార్లు, వాచీలు, మంచి బట్టలు, ఆహారము, ఏసి, టీ, కాఫీ, ధూమపానం, మద్యపానం లేకుండా ఉండలేము అంటున్నారు. ఈ సమయంలో, ఈ ఉపవాస రోజులు మనలోని మానసిక శక్తిని, ఆత్మ శక్తిని, దృఢత్వాన్ని మనకు పరిచయం చేస్తాయి, వీటిని మనం సరిగ్గా ఉపయోగించడం లేదు. ఉపవాసం ఒక క్రమశిక్షణతో కూడిన దినచర్యను మరియు అంతర్గత స్వీయ-నియంత్రణను సృష్టిస్తుంది, ఇది మనల్ని ఉన్నత స్థితి మరియు ఆధ్యాత్మిక అవగాహన యొక్క మార్గంలోకి తీసుకువెళుతుంది. ఒకసారి మనం శక్తివంతమైన మరియు దృఢమైన ఆలోచనను చేసినట్లయితే, ఏదీ అసాధ్యం కాదు అన్న విషయాన్ని ఉపవాస క్రమశిక్షణ మనకు బోధిస్తుంది. భౌతిక స్థాయిలో ఉపవాసం చేసినప్పుడు దానిని మనం మానసిక మరియు భావోద్వేగ స్థాయిలో కూడా చేయవచ్చు. ఇది కేవలం మనం ఆంతరికంగా తీసుకునే ఒక నిర్ణయమే. ఉపవాస పూర్తి సమయము మరియు ఆ తర్వాత కూడా, క్రోధానికి బదులుగా మేము శాంతి మరియు ప్రేమ, సహకారాన్ని ఎంచుకుంటాము. ద్వేషము మరియు అహంకారానికి బదులుగా వినయము మరియు మంచితనాన్ని ఎంచుకుంటాము, ప్రతి పరిస్థితిలో మరియు ప్రతి వ్యక్తితో అని ఉండాలి.

ప్రతి మతంలో, ఉపవాసం ఉంటున్న సమయంలో, ఉపవాసం కేవలం కొద్ది నిమిషాలు లేక గంటలు లేక కొద్ది రోజులు, కొద్ది వారాలే కాదు, ఎందుకంటే, మార్పులను గూఢ స్థాయిలో గుర్తించి, అభినందించి, కొనసాగించడానికి సమయం పడుతుంది. ఉపవాసం ఉంటున్న సమయంలో, మన ఆంతరిక భావాలపై శ్రద్ధ పెట్టడం అవసరము – మనమెందుకు ఉపవాసం చేస్తున్నాము? మన మతం చెప్తుంది కాబట్టి చేస్తున్నామా లేక అందరూ చేస్తున్నారు కాబట్టి మనమూ చేస్తున్నామా లేక ప్రతి సంవత్సరం చేస్తున్నాము కాబట్టి చేస్తున్నామా లేక భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికా లేక ఇలా చేయకపోతే భగవంతుడు శిక్షిస్తాడు అన్న భయంతో చేస్తున్నామా! ఈ పైన తెలిపిన కారణాలు లేక ఇటువంటి మరేదైనా కారణం అయితే ఒక్క క్షణం ఆగండి, మీ ఆలోచనను ఉన్నత లక్ష్యంవైపుకు మరల్చండి. మనం ఇలా ఉపవాసం ఉండటం వలన భగవంతుడితో కనెక్ట్ అయ్యేందుకు మనకు శక్తి వస్తుంది, మనలోని బలహీనతలను, వికారాల మలినాన్ని స్వచ్ఛంగా  చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఎవరి మీదనైనా మనలో ప్రతికూల భావనలు ఉంటే వారిని క్షమించే సమయం ఇది. ప్రతి మతం చెప్పే సందేశం – క్షమించడం. కనుక మన నిజమైన మతాన్ని పాటిస్తూ క్షమించడాన్ని అలవర్చుకొని   మన సమాజంలో తద్వారా ప్రపంచంలో ప్రేమ, ఐకమత్యాన్ని కలిగిద్దాము. కేవలం మన శరీరాన్ని మాత్రమే శుభ్రపరుచుకోకుండా మన మనసును కూడా శుభ్రపరుచుకుందాము. మతము మనకు ఉపవాసము అనే ఆచారాన్ని ఇచ్చింది, దీని ద్వారా ఆత్మ శుద్ధికి సమయాన్ని కేటాయిద్దాము.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

25th june2024 soul sustenance telugu

విజయం కోసం పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని తయారుచేసుకోవడం (పార్ట్ 1)

జీవితంలో వివిధ రకాల పరిస్థితులు ఎదురుకోవడం, వివిధ రకాల వ్యక్తులను కలవడం, మీకు ఎన్నో సవాళ్లను తీసుకొస్తుంది, మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. అలాగే, మన వ్యక్తిత్వం  స్థాయిలో మన శక్తులు

Read More »
24th june2024 soul sustenance telugu

పోటీ పడకుండా సహకరించుకుందాం

నిజమైన సహకారం అంటే సర్వులకు ఎల్లవేళలా తన వారనే భావన మరియు సాధికారత ఉద్దేశ్యంతో షరతులు లేని సహాయాన్ని అందించడం. ఇది వినయం, ప్రేమ, కరుణ మరియు తాదాత్మ్యం వంటి మన నిజ గుణాలను

Read More »
23rd june2024 soul sustenance telugu

నిద్రను ప్రశాంతంగా మరియు ఆనందంగా మార్చడానికి 5 చిట్కాలు

నిద్ర మనిషి ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి. మన శారీరక, ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ ఆరోగ్యాన్ని అపారంగా ప్రభావితం చేస్తుంది. నిద్రను ప్రశాంతంగా మరియు ఆనందంగా మార్చడానికి 5 చిట్కాలను చూద్దాం –

Read More »