ఆశీర్వాదాల పాజిటివ్ ఎనర్జీ (పార్ట్ 1)

ఆశీర్వాదాల పాజిటివ్ ఎనర్జీ
(పార్ట్ 1)

ఆశీర్వాదాలు … అప్పుడప్పుడా లేక ఎల్లప్పుడూనా?

మన సంబంధాలలో పరస్పరం ప్రేమ మరియు గౌరవం ఇచ్చిపుచ్చుకుంటాము అందుకనే అవి  ప్రత్యేకమైనవి. ఈ స్వచ్ఛమైన వైబ్రేషన్స్ ఇచ్చిపుచ్చుకోవడంతో మనల్ని శక్తి మరియు ఉత్సాహంతో నింపుతాయి. అలాంటి వారు మనకు వరం లాంటివారు. ఎందుకంటే వారి శక్తి మనకు ఒక ఆశీర్వాదమై జీవితంలోని ప్రతి సన్నివేశంలో సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉండే శక్తిని ఇస్తుంది. ఈ శక్తి మనల్ని అలసిపోకుండా పని చేయడానికి మరియు సవాళ్లను సులభంగా ఎదుర్కోవడానికి అనుమతిస్తుంది. ఆశీర్వాదాలంటే ప్రత్యేక సందర్భాలలో చేసిన సంకల్పాలు మరియు అన్న మాటలు కాదు, కానీ ప్రతి స్వచ్ఛమైన ఆలోచన మరియు మాట ఒక ఆశీర్వాదమే. సాధువులు, తల్లిదండ్రులు, గురువులు, కుటుంబం మరియు స్నేహితుల ఆశీర్వాదం మన జీవితంలో అద్భుతాలను చేయడం మనం చూసాము. కొత్తగా పుట్టిన బిడ్డకు ఇచ్చిన ఆశీర్వాదాలు, పరీక్షకు ముందు ఇచ్చిన ఆశీర్వాదాలు, అనారోగ్యం ఉన్న వ్యక్తికి ఆశీర్వాదాలు, కొత్త వృత్తి లేదా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఆశీర్వాదాలు లేదా ఏదైనా ప్రత్యేక సందర్భంలో ఆశీర్వాదం యొక్క శక్తిని మనమంతా చూసాము.

ఆశీర్వాదం మన ఆలోచనలలో సృష్టించే మరియు మాటలలో కూడా వ్యక్తీకరించే శక్తివంతమైన  స్వచ్ఛమైన విబ్రేషన్. ఆశీర్వాదం అంటే మనం ఇతరుల కోసం ఆనందం, ఆరోగ్యం, సామరస్యం మరియు విజయం వంటి ఆలోచనలను రచించడం. మన వైబ్రేషన్స్  వారి మానసిక స్థితిని ప్రభావితం చేసి వారి ఆలోచనలు స్వచ్ఛంగా మరియు శక్తివంతంగా మారినప్పుడు, వారి భాగ్యం ఒక అద్భుతం లాంటిది.

మన ప్రతి ఆలోచన మరియు మాట ఆశీర్వాదం కాగలదా? అని ఈ రోజు మనం ప్రయోగం చేద్దాం …

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »