7th feb soul sustenance telugu

ప్రతికూల పరిస్థితుల వలన 4 లాభాలు (భాగం 2)

    1. ప్రతికూల పరిస్థితులు మన కర్మ ఖాతాను సమాప్తం చేసి ఆత్మను పావనంగా చేస్తాయి – కష్టాలు మనకు రావడానికి ఒక ముఖ్యమైన కారణము – గతంలో అంటే ఈ జన్మలో కావచ్చు, గత జన్మలో కావచ్చు, మనం చేసిన చెడు కర్మ అన్న లోతైన విషయాన్ని అర్థం చేసుకోవడము. ఆత్మను పావనంగా చేసుకోవాలంటే, ఆత్మ లాభపడాలంటే చెడు కర్మల కారణంగా పేరుకున్న చెడు సంస్కారాలను తొలగించుకోవాలి అన్న లోతైన విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఈ చెడు సంస్కారాల నుండి వెలువడే చెడు వైబ్రేషన్లు మనకు మరియు ఇతరులకు చేరి తిరిగి అవి మనకే చేరుతాయి. అంటే నా చెడు నాకు చెడును, కష్టాన్ని తెచ్చిపెట్టింది కదా. ఏదైనా ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు ముందుగా మనం మన లోపలకు తొంగి చూసుకుని, అహాన్ని సమాప్తం చేసి స్వ పరివర్తన చేసుకుంటాము. ఆ సమయంలో అవసరమైన గుణాలను మనం నేర్చుకుంటాము కూడా. అలాగే భగవంతుడితో మన మనసును కనెక్ట్ చేసి వారిని స్మరిస్తాము. ఇవన్నీ చేయడం వలన మన కర్మ ఖాతా తీరి, సంస్కార పరివర్తన జరిగి ఒకానొక సమయానికి మనం మన ప్రతికూల ప్రభావం నుండి దూరమవుతాము.
    2. ప్రతికూల పరిస్థితులు విజయానికి క్రొత్త బాటను వేస్తాయి – చివరిది, అతి ముఖ్యమైన విషయము, ఏదైనా ప్రతికూల పరిస్థితిని దాటడము కష్టసాధ్యము అని అనిపించినప్పుడు, ఎలాగైనా దాటాలి అన్నప్పుడు, మనలో పాతుకుపోయిన ఆలోచనా ధోరణిలు, జీవనశైలి, పని చేసే తీరు అన్నిటినీ మనం మార్చేస్తాము. ఈ పరివర్తన చాలాసార్లు మనల్ని కొత్త మార్గంలోకి తీసుకువెళ్తుంది. ఈ నూతన మార్గాన్ని అవలంబించినప్పుడు మనం సవాళ్ళను అధిగమిస్తాము. ఈ కొత్త మార్గం నాకొచ్చిన కష్టం వలనే నేను చూడగలిగాను అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రతికూల పరిస్థితి లేకపోతే మనం ఈ కొత్త మార్గాన్ని చూసేవారిమి కాదు, ఎందుకంటే మార్పు తేవాలి అన్న ఆలోచన లేదు కనుక. ఈ లాభంలో ఉన్న ముఖ్యమైన కోణం ఏమిటంటే, ఈ కొత్త మార్గం మనతో పాటు జీవితాంతం ఉంటుంది, మన ప్రతి అడుగులో ఈ మార్గం మనం సహకరిస్తుంది, వివిధ రంగాలలో విజయాలను తెచ్చిపెడ్తుంది.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »
26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »