07 -january

ఆమోదం పొందుట అనే వ్యసనం నుండి విముక్తి పొందండి

మనమందరం ప్రత్యేకమైన వ్యక్తులం మరియు మన జీవిత ప్రయాణం కూడా ప్రత్యేకమైనది. మన విశేషతలకు  మరియు మనం చేసే పనికి ఆమోదం పొందడం కచ్చితంగా మంచి అనుభూతిని కలిగిస్తుంది, ఇది మనం చేసే పని సరైనది అని చెబుతుంది. కానీ ఇతరులను ప్రసన్నం చేసే వ్యక్తిగా ఉండటం మరియు ఇతరుల ఆమోదం నిరంతరం కోరుకోవడం వల్ల మనం ఇతరుల ఇష్ట ప్రకారం బానిసత్వంలో జీవించేలా చేస్తుంది. చివరికి మన సామర్థ్యాన్ని వృధా చేసుకుంటాము మరియు మానసికంగా కృంగిపోతాము. మీ కోరికలు మరియు మీ సామర్థ్యం ప్రకారం జీవించడం ప్రారంభించండి. ఇతరుల అనవసరపు అభిప్రాయాల గురించి మీరు పట్టించుకోనప్పుడు జీవితం చాలా హాయిగా ఉంటుంది. మీకు మీరే గుర్తు చేసుకోండి – నేను తెలివైన వాడిని, నేను నా ఛాయాస్  కోసం ఇతర వ్యక్తుల ఆమోదంపై ఆధారపడను. ఇది నా జీవితం, నాకు సరైనది ఎంచుకోవడానికి నాకు స్వేచ్ఛ ఉంది, అంతే కానీ ఇతరుల ఆమోదం కోసం ఆలోచించను.

మీరు అభిమానించే వ్యక్తికి మీ ఎంపికలు, నిర్ణయాలు, లక్షణాలు లేదా అలవాట్లలో ఏవైనా నచ్చకపోతే మీరు రాజీ పడతారా? మీకు ఏది సరైనదో అది చేయడం కంటే ఇతరుల ఆమోదం పొందడమే ముఖ్యంగా భావిస్తారా ? ఏది ముఖ్యమో గుర్తించడం లేదా అంగీకరించడం సులభం కాదు, కానీ మన ప్రవర్తనలో కనిపించే కొన్ని విషయాలు ద్వారా ఆమోదం పొందడమే ముఖ్యంగా కనిపిస్తుంది అంటే అది వ్యసనంగా మారిపోయింది. మనలో ఎంతో మంది పడిపోయే అతిపెద్ద ఉచ్చు- మనకు దగ్గరగా ఉన్న వ్యక్తులకు అనుకూలంగా ఉండేందుకు ప్రయత్నించడం. మన విశేషతలు ఏమిటి? మనం ఏమి చేయాలి లేదా మనకు ఏమి ఉంది ? అనేది ఎల్లప్పుడూ మన నిర్ణయంగానే ఉండాలి. వేరొకరి ఆమోదం పొందేందుకు మనం మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. 

మనలో ఉన్న విలువలను జీవితంలోకి తీసుకు రావడం పై దృష్టి పెడదాం మరియు సరైనది అని భావించే పనినే  చేద్దాం. మనలోనే అన్ని సమాధానాలున్నాయి. మనం మన ఆంతరిక ప్రవృత్తిని సరిచేసుకొని, మనస్సాక్షిని అనుసరించాలి. మన ఉనికిని మరియు మన పనిని మనము ఆమోదించినప్పుడే , మనకు గౌరవమును ఇవ్వండి అని అడగడం మానేస్తాము. లేకపోతే మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఆపై, మనం లేదా ఇతరులు మనల్ని గౌరవించరు. మీరు ఎవరినీ కాపీ చేయనవసరం లేదు. అన్ని సమయాలలో మీరే మీరై ఉండండి. వ్యక్తులు మిమ్మల్ని ఆమోదించాల్సిన అవసరం లేదు, మీపై ప్రేమ లేదా ప్రశంసలు చూపే వారికి కృతజ్ఞతలు తెలియజేయండి, కానీ ఆమోదం కోసం ఎదురు చూడవద్దు. నిస్వార్థంగా ప్రేమించండి , షరతులు లేకుండా సహాయం చేయండి. మీకు ఎవరి నుండి ఏమీ అవసరం లేదు. ప్రశంసలు మరియు విమర్శలలో స్థిరంగా ఉండే కళను అలవరచుకోండి. మీ జీవితాన్ని అర్ధవంతం చేసే మీ ఉద్దేశ్యం, లక్ష్యాలు మరియు ప్రణాళికలపై మాత్రమే దృష్టి కేంద్రీకరించడం, ఇతరుల సమర్ధన కోరుకోవద్దని మీ మనసుకు నేర్పండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 4)

9th Jun – జీవన విలువలు

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 4) గాలి శుద్దీకరణ – గాలి మన చుట్టూ నిరంతరం ఉంటుంది మరియు మనం దానిని ఎల్లప్పుడూ  పీల్చుకుంటాము. భౌతిక

Read More »
మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 3)

8th Jun – జీవన విలువలు

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 3) నీటి శుద్దీకరణ – మనం త్రాగే నీటిని శుద్ధి చేయడం కోసం, మనం భౌతిక మార్గాలను మాత్రమే కాకుండా,

Read More »
మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 2)

7th Jun – జీవన విలువలు

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 2) ప్రకృతి నుండి మనం తీసుకునే ఆహారం, నీరు మరియు గాలి భౌతిక మరియు భౌతికేతర రెండు రకాలుగా ఎలా

Read More »