తినే ప్రతి క్షణం ఆనందించండి మరియు ప్రేమించండి

తినే ప్రతి క్షణం ఆనందించండి మరియు ప్రేమించండి

మనందరిమూ మూడు పూటలా భోజనం చేస్తాము. తినే ఆహారం మనం కూర్చోవడానికి, కదలడానికి, మాట్లాడటానికి, నవ్వడానికి మరియు పనులను పూర్తి చేయడానికి మనల్ని పోషిస్తాయి. ఆహారం మనకు సేవ చేసిన విధానానికి , మనం తినేదాన్ని ప్రేమించడం మరియు గౌరవించడం ముఖ్యం. మన ప్లేట్‌లోని ఆహారాన్ని మనం అప్పుడప్పుడూ గొణుగుకుంటూ లేదా ఎంచుతూ తింటాము.  మనం ఆహారాన్ని తెలియకుండానే తిరస్కరిస్తాము – ఇలా ప్రతి రోజూ ఉదయం దీన్ని తినడం నాకు విసుగు తెప్పిస్తుంది, ఈ వంటకం చాలా చప్పగా ఉంది, మా అమ్మ బాగా వాండాలని కోరుకుంటున్నాను. కొన్ని సార్లు –  నేను బరువు పెరుగుతాను, నా షుగర్ లెవల్స్ పెరిగితే ఏమి చేయాలి, ఇది తాజాగా రుచి లేదు , నేను జబ్బు పడనని ఆశిస్తున్నాను అని ఆందోళన చెందుతాము. మనం తినాలని నిర్ణయించుకున్న తర్వాత, ఆహారాన్ని ఆస్వాదిద్దాం, దాని ప్రభావాల గురించి ఆలోచించకూడదు. తినడానికి ముందు మరియు తినేటప్పుడు కృతజ్ఞత మరియు ప్రేమ యొక్క ఆలోచనలను సృష్టిద్దాం. క్వాలిటీ  లేదా పరిమాణం ఎల్లప్పుడూ కరెక్ట్ గా ఉండకపోయినా  పర్వాలేదు.  మనము వేలాది రుచికరమైన భోజనాలను ఆస్వాదించాము మరియు ఆనందిస్తూనే ఉంటాము. కొన్ని లోపాలు ఆహారం పట్ల మన గౌరవాన్ని మార్చకూడదు.

మనం రోజూ తినే ఆహారం మన శరీరానికి పోషకాహారం. మనం ఆరోగ్యకరమైనదాన్ని ఎంచుకుంటాము. మనం ఏది రుచిగా ఉంటుందో దానిని ఎంచుకోవచ్చు, కానీ మనం ఇది తింటేనే  మనం సంతోషంగా ఉంటాము అని అంటే , మన ఆనందం మన ఆహారంపై ఆధారపడి ఉంటుంది. మీ భోజనం చేస్తున్నప్పుడు కూర్చోని మీ ఆహారానికి సంతోషకరమైన శక్తిని ప్రసరిస్తూ మిమ్మల్ని మీరు సంతోషంగా విజువలైజ్ చూసుకోండి. మనకు రుచిగా లేని వాటిని తిన్నప్పుడు మనం తరచుగా చికాకు కలిగించే శక్తిని సృష్టిస్తాము. ఆహారం రుచికరంగా ఉండకపోవచ్చు… కానీ సంతోషం లేదా చికాకు మన ఎంపిక. మీ ఆహారం మీ మనస్సుపై ప్రభావం చూపకుండా ఉండేందుకు ఈరోజు ప్రాక్టీస్ చేయండి. మీరు తినేవాటిని విమర్శించడం వల్ల ఆహారంపై నెగెటివ్ శక్తి ప్రసరిస్తుంది, అది మీ మనస్సును ప్రభావితం చేస్తుంది. ఈరోజు ప్రతి భోజనానికి ముందు, ఆగి , నేను భోజనం చేస్తున్నప్పుడు నేను సంతోషంగా మరియు ప్రశాంతంగా ఉన్నాను. నేను నా ఆనందంతో ఆహారాన్ని శక్తివంతం చేస్తాను అని సంకల్పం చేయండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

21th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 3)

శ్రీ గణేష్ యొక్క పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. ఇతరుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేష్ చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం

Read More »
20th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 2)

నిన్న మనం  శ్రీ గణేష్ జన్మ యొక్క నిజమైన అర్ధాన్ని తెలుసుకున్నాము. శంకరుడు బిడ్డ తలను నరికి, అతని శరీరంపై ఏనుగు తలను ఉంచారు, ఇది పరమపిత తండ్రి మన అహంకారమనే తలను అంతం

Read More »
19th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 1)

మనం శ్రీ గణేషుని యొక్క ఆగమనం మరియు జననాన్ని గొప్ప విశ్వాసంతో మరియు ఉత్సాహంతో జరుపుకుంటాము. మన జీవితంలోని విఘ్నాలను తొలగించమని వారిని  ప్రార్థిస్తాము. మనలో చాలా మందికి వారి పుట్టుక మరియు భౌతిక

Read More »