Hin

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 2)

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 2)

ప్రకృతి నుండి మనం తీసుకునే ఆహారం, నీరు మరియు గాలి భౌతిక మరియు భౌతికేతర రెండు రకాలుగా ఎలా అశుద్ధంగా ఉన్నాయో నిన్నటి సందేశంలో వివరించాము. కాబట్టి, ఈ మూడింటిని మన శరీరంలోకి రాకముందే మనం శుద్ధి చేసుకోవాలి. భౌతిక చర్యలు మరియు జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా, ఈ మూడింటికి స్వచ్ఛత మరియు శక్తి యొక్క వైబ్రేషన్స్ ప్రసరింపజేసి  ఆ తర్వాత వాటిని మన శరీరంలోకి తీసుకోవడం  ఆధ్యాత్మిక పద్ధతి. మూడింటిని  మనం శుద్ధి ఎలా చేయాలో అర్థం చేసుకుందాం –

  1. ఆహార శుద్ధి – ఆహారాన్ని శుద్ధి చేయడానికి, ఆహారాన్ని వండడానికి ముందు కూరగాయలు, ధాన్యాలు మరియు పండ్లు మార్కెట్ నుండి వచ్చినప్పుడు, కొన్ని నిమిషాలు మెడిటేషన్  చేయడం ద్వారా,  మీరు భగవంతుని నుండి పొందే వైబ్రేషన్స్ ను వాటికి ప్రసారం చేయడం ద్వారా స్వచ్ఛమైన వైబ్రేషన్స్ అందించగలము . నేను స్వచ్ఛమైన ఆత్మను … నేను నా భృకుటి  మధ్యలో చిన్న మెరిసే నక్షత్రాన్ని ..  …. నేను ఆహారాన్ని  స్వచ్ఛత అనే  తెల్లని కిరణాలతో నింపుతున్నాను మరియు వాటిని దివ్యగుణాల  వైబ్రేషన్స్ తో నింపుతున్నాను …. లేదా నేను మాస్టర్ శక్తి సాగరుడిని  … ఆ పరమాత్ముని బిడ్డను… పరమాత్ముడు శక్తి సాగరుడు..  నేను నా కళ్ళ నుండి ఆహారానికి పాజిటివ్ మరియు శక్తివంతమైన వైబ్రేషన్స్  ప్రసరింపజేస్తున్నాను … నా శక్తి ద్వారా ఆహారం స్వచ్ఛంగా మరియు సాత్వికంగా మారుతోంది లేదా నేను దైవీ గుణాలు కలిగిన దేవదూతను … నేను దివ్యతతో.. నా దైవిక స్పర్శతో  ఆహార పదార్థాలను శుద్ధి చేస్తున్నాను… నేను ప్రకృతిని గౌరవిస్తాను … దాని శక్తి రూపాంతరం చెంది  స్వచ్ఛమైన వైబ్రేషన్స్ తో నిండితుంది. అలాగే, భగవంతుని స్మరణలో కూరగాయలు మరియు ధాన్యాలు వంటి ఆహార పదార్థాలను వండడం తదుపరి దశ. ఆహారాన్ని వండేటప్పుడు, భగవంతుని తోడుని  అనుభూతి చేసుకుంటూ, వారి  ప్రేమ మరియు సమీపతను  అనుభూతి చేసుకోండి. భగవంతునితో మీ అందమైన సంబంధం యొక్క ఈ శక్తిని వండిన ఆహారానికి ప్రసారం చేయండి. ఆహారం వండిన తర్వాత, వండిన ఆహారాన్ని అలాగే తాజా పండ్లను భగవంతుని స్మరణతో భగవంతునికి సమర్పించండి. ఇలా చేస్తున్నప్పుడు భగవంతుని ప్రేమతో నిండిన కొన్ని పాటలను ప్లే చేయండి. చివరగా, ప్రశాంతమైన మానసిక స్థితిలో ఆహారాన్ని తినండి మరియు మీరు ఆహారం లేదా పండ్లను తినే ముందు, మేము పైన పేర్కొన్న కొన్ని పాజిటివ్  ఆలోచనలను విజువలైజ్ చేయండి,  ఎక్కువ మాట్లాడకుండా ఈ ఉన్నత మానసిక స్థితిలో ఆహారాన్ని తినండి. తినేటప్పుడు శాంతి మరియు ప్రేమతో కూడిన వాతావరణాన్ని తయారు చేయండి. భగవంతుని సంరక్షణ మరియు మద్దతు యొక్క శక్తితో ఆహారాన్ని ఆస్వాదించండి, ఇలా  మొత్తం కుటుంబం కలిసి ఆనందించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి. 

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

14th feb 2025 soul sustenance telugu

విశ్వసించండి. ఇక మీరు విజయం సాధిస్తారు

మీరు మీ పెద్ద లేదా చిన్న లక్ష్యాల గురించి చాలా ఉత్సాహంగా ఉంటూ వాటిని చేరుకోవడానికి చాలా కష్టపడ్డారా… కానీ ఎక్కడో ఒక చోట విజయం సందేహాస్పదంగా అనిపించిందా? అది ఫలితాన్ని ఎలా ప్రభావితం

Read More »
13th feb 2025 soul sustenance telugu

స్వీయ నియంత్రణ కళలో ప్రావీణ్యం పొందటం

మనమందరం బాగా జీవించడానికి మన జీవితాలపై నియంత్రణ కలిగి ఉండాలని కోరుకుంటాము. మన మనస్సు, బుద్ధి మరియు స్వభావాన్ని నియంత్రించడం మన శక్తి. అది మన భౌతిక ఇంద్రియాలను కూడా ఆటోమేటిక్ గా నియంత్రిస్తుంది.

Read More »
12th feb 2025 soul sustenance telugu

నిద్రపోయే ముందు పనులకు సంబంధించిన కమ్యూనికేషన్ మరియు టెక్నాలజీ నుండి దూరమవ్వండి 

రాత్రి వరకు పనులకు సంబంధించిన కమ్యూనికేషన్ లో చిక్కుకోవడం వల్ల మనం నిద్రపోతున్నప్పుడు కూడా మనస్సు పనుల గురించి ఆలోచిస్తూ, మన నిద్రకు భంగం కలిగిస్తుంది. మన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం అదుపు తప్పడం

Read More »