దృఢ సంకల్పాలు - విజయానికి 5 చిట్కాలు

దృఢ సంకల్పాలు - విజయానికి 5 చిట్కాలు

దృఢ సంకల్పాలు (affirmations) రోజువారీ జీవితంలో విజయం కోసం మనం చేసే పాజిటివ్ మరియు శక్తివంతమైన ఆలోచనలు. అవి మన భౌతిక శరీరానికి, మన చుట్టూ ఉన్న వ్యక్తులకు మరియు మన చుట్టూ ఉన్న పర్యావరణానికి మంచి మరియు పాజిటివ్ ఆధ్యాత్మిక శక్తిని ప్రసరింపజేస్తాయి. ఈ శక్తి మన శారీరక శ్రేయస్సు, సంబంధాలు, ఆర్థిక శ్రేయస్సు అలాగే వ్యక్తిగత మరియు వృత్తిపరమైన పాత్రలలో పాజిటివ్ పరిస్థితులను సృష్టిస్తుంది, ఇది మన భాగ్యాన్ని పాజిటివ్ గా మారుస్తుంది. అటువంటి మంచి భాగ్యం మన జీవితాల్లో శాంతి మరియు ఆనందానికి ముఖ్యం. కాబట్టి దృఢ సంకల్పాలు జీవితంలో ఏదైనా ఆశించిన ఫలితాన్ని తీసుకురావడానికి మరియు నెగెటివ్  పరిస్థితులను కూడా పాజిటివ్ గా మార్చడానికి చాలా ముఖ్యమైన సాధనం. దృఢ సంకల్పాల ద్వారా విజయం కోసం 5 చిట్కాలను చూద్దాం –

  1. మీ రోజును 15 నిమిషాల మెడిటేషన్ తో ప్రారంభించండి మరియు ఆ తర్వాత ఉదయం 15 నిమిషాల పాటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చదవండి. మీరు చదివిన జ్ఞానం నుండి ఆ రోజు కోసం ఒక దృఢ సంకల్పాన్ని చేసుకొని రోజంతా సాధన చేయండి. ఉదయం చేసే మెడిటేషన్ మీకు దృఢ సంకల్పాన్ని సాధన చేయడానికి ఆంతరిక శక్తిని ఇస్తుంది.
  2. మీరు సంకల్పించుకున్న దృఢ సంకల్పాన్ని మీరు నిద్రలేచిన వెంటనే, ఏదైనా తినడానికి మరియు త్రాగడానికి ముందు మరియు నిద్రపోయే ముందు మీ మనస్సులో పాజిటివ్ ఆలోచన రూపంలో తీసుకురండి. అంటే రోజుకు 10-15 సార్లు తీసుకురండి.
  3. మీ దృఢ సంకల్పాన్ని కేవలం మీ మనస్సులో రిపీట్ చేసుకోవడమే కాకుండా మీ అనుభవంలోకి వచ్చే విధంగా చూసుకోండి.  అనుభవంతో కూడిన దృఢ సంకల్పం విశ్వానికి మరింత పాజిటివ్  మరియు శక్తివంతమైన వైబ్రేషన్ ను రేడియేట్ చేసి  మరింత పాజిటివ్ ఫలితంతో తిరిగి వస్తుంది. అందువలన అది మీ విజయాన్ని పెంచుతుంది. 
  4. మీ దృఢ సంకల్పాలు పాజిటివ్ మరియు విజయానికి సంబంధించిన పదాలుగా ఉండాలి.  ఉదా. ‘నేను శాంతంగా అవుతాను’ లేదా  ‘నేను అశాంతి గా ఉన్నాను’ బదులుగా ‘నేను శాంతి స్వరూపాన్ని’   లాంటి పదాలను ఉపయోగించండి. మీ జీవితంలో ఉన్న పరిస్థితుల ఆధారంగా మీరు ఏ సమయానికి ఏ దృఢ సంకల్పం చేయాలో దానిని కూడా చేయవచ్చు.
  5. రోజంతా ఒకే దృఢ సంకల్పాన్ని  ప్రాక్టీస్ చేయండి. కొన్ని సందర్భాల్లో పరిస్థితి ప్రకారం పాజిటివ్ ఫలితాల కోసం మీరు కొన్ని రోజుల పాటు ఒకే దృఢ సంకల్పాన్ని సాధన చేయవచ్చు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

1st oct 2023 soul sustenance telugu new

ఇవి ప్రపంచ నాటకం యొక్క చివరి క్షణాలు

ప్రపంచ నాటకం అనేది భూమిపై ఆత్మలందరూ ఆడే ఒక నాటకం, ఇందులో నాలుగు దశలు ఉన్నాయి – సత్యయుగం లేదా స్వర్ణయుగం, త్రేతాయుగం లేదా వెండి యుగం, ద్వాపరయుగం లేదా రాగి యుగం మరియు

Read More »
30th-sept-2023-soul-sustenance-telugu

శుభాశీసులే ముఖ్యం

శుభోదయం! ఈ ఉదయం, మీరు మీ కుటుంబం, స్నేహితులు మరియు సహోద్యోగులకు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్ లేదా గుడ్ లక్ లతో శుభాకాంక్షలు తెలిపారా? మీరు ప్రతిరోజూ ఇతరులను విష్ చేస్తారా? మీరు

Read More »
29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »