Hin

8th april soul sustenance telugu

బిజీ ప్రపంచంలో శాంతి అనుభూతి కోసం 5 మార్గాలు

  1. స్వయాన్ని శాంత స్వరూప ఆత్మగా అనుభవం చేసి రోజూ స్వయంతో మాట్లాడుకోండి – ఉదయాన్నే నిద్ర నుండి లేవగానే, స్వయాన్ని ఒక సుందరమైన ఆత్మిక శాంతి ప్రకాశంగా, భృకుటి మధ్యన ఉన్నట్లుగా, చక్కని శాంతి తరంగాలను మీ ఇంట్లో, మీ చుట్టూ,  వ్యాప్తి చేస్తున్నట్లుగా చూడండి.
  2. ఆధ్యాత్మిక పుస్తకాలను ఎక్కడకు వెళ్ళినా మీతో పెట్టుకోండి – ఆధ్యాత్మిక జ్ఞాన సాహిత్యాన్ని మీతోగానీ లేక మీ ఫోనులోగానీ, కంప్యూటరులో గానీ పెట్టుకోండి. ఎప్పుడైనా మనసు ఒత్తిడిలో ఉందని అనిపిస్తే లేక అతిగా ఆలోచనలు వస్తున్నట్లుగా అనిపిస్తే ఆధ్యాత్మిక సాహిత్యాన్ని చదవండి లేక వినండి. సుగుణాలతో నిండిన సాహిత్య జ్ఞానము మీ మనసును స్పర్శించి మనసును ప్రశాంతంగా చేస్తుంది, వ్యక్తులు లేక పరిస్థితుల ప్రభావం నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది.  
  3. మనసు ట్రాఫిక్ కంట్రోల్‌ను ప్రతి గంట ఒక నిమిషం పాటు పాటించండి – ప్రతి గంటకు ఒక నిమిషం శాంతిని అనుభూతి చేయండి. పనిలో ఉన్నాగానీ మధ్యమధ్యలోచేయండి. ఈ ఒక్క నిమిషంలో కొన్ని శాంతికి సంబంధించిన సానుకూల ఆలోచనలను ఆలోచించండి. ఇది మనసును నెమ్మదిపరిచి మిగతా 59 నిమిషాలు మీ మనసు చురుకుగా చేస్తుంది, ఏకాగ్రం చేయగలుగుతుంది. మనసులో తక్కువ ఆలోచనలే వస్తాయి, అది కూడా ముఖ్యమైన ఆలోచనలే వస్తాయి.
  4. అందరినీ శాంత స్వరూప ఆత్మగా చూడండి, వారికి శాంతి తరంగాలను అందించండి – ప్రతి రోజూ మీ కుటుంబ సభ్యులను మరియు స్నేహితులను కలిసినప్పుడు, తమ శరీరాల ద్వారా కర్మలు చేసే శాంతి స్వరూప ఆత్మలుగా వారిని చూడండి. ఈ అభ్యాసము వారికి శాంతి తరంగాలను అందించి శాంతి సాగరుడైన పరమాత్మతో కనెక్ట్ అయిన అనుభూతిని కలిగిస్తుంది. మీరు కూడా శాంతిని అనుభవం చేస్తారు.
  5. ఇంట్లో మరియు పని చేసే చోట ప్రశాంత వాతావరణాన్ని ఉంచండి – మీరు గడిపే గదిలో కొన్ని సామానులనే ఉంచండి. అన్నిటినీ చెల్లాచెదరుగా పెట్టుకోకండి. ప్రతి వస్తువు శాంతి తరంగాన్ని కలిగి ఉండేలా జాగ్రత్త పడండి. ఇటువంటి బాహ్య ప్రశాంతత ఆంతరిక శాంతికి దోహదపడుతుంది, అలాగే ఆంతరిక శాంతి బాహ్య ప్రశాంతతకు దోహదపడుతుంది. ఇందుకు మీరు ఇంట్లో మరియు ఆఫీసులో చేసే రెగ్యులర్ మెడిటేషన్ ఉపయోగపడుతుంది

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

7th october 2024 soul sustenance telugu

వైఫల్యాలను సులభంగా అంగీకరించడం

మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు విఫలమవుతాము అనేది జీవితంలో ముఖ్యమైన పాఠాలలో ఒకటి. మనం వైఫల్యాలు, లోపాలను మన ప్రయాణంలో భాగంగా పరిగణించి అంగీకరించాలి. మనలో చాలా మంది జీవితంలో వైఫల్యాలకు భయపడతాము .

Read More »
6th october 2024 soul sustenance telugu

నిర్లిప్తంగా ఉండి, గమనించి మరల్చుకోండి

మన జీవితాలు ఎప్పటికప్పుడు వివిధ రకాల పరిస్థితులతో నిండి ఉంటాయి. మనం తరచుగా పరిస్థితుల వల్ల ప్రతికూలంగా ప్రభావితమవ్వడంతో మన ఆంతరిక శక్తి తగ్గుతుంది. నిర్లిప్తంగా ఉండి, గమనించి మరల్చుకోవటం అనేది ఆధ్యాత్మికత యొక్క

Read More »
5th october 2024 soul sustenance telugu 1

ధనం  ఆశీర్వాదాలతో  సంపాదించడం

ధనం సంపాదించడం చాలా ముఖ్యం. ఆ ధనంతో మనం కొనుగోలు చేయగల అన్ని భౌతిక సౌకర్యాలను కొనుగోలు చేయడం కూడా ముఖ్యం. కానీ ధనం అంటే కేవలం కరెన్సీ మాత్రమే కాదు, అది ఒక

Read More »