ఆశీర్వాదాల పాజిటివ్ ఎనర్జీ (పార్ట్ 2)

ఆశీర్వాదాల పాజిటివ్ ఎనర్జీ
(పార్ట్ 2)

ఆశీర్వాదాలు ఇచ్చే విధానం

ఆశీర్వాదాలు మనం రచించే స్వచ్ఛమైన, శక్తివంతమైన ఆలోచనలు మరియు పదాలు. మనం మార్చుకోవాలనుకునే ఏ సంస్కారానికైనా, మన శరీర ఆరోగ్యం కోసం, మన సంబంధాలు మరియు పని కోసం మనకు మనమే ఆశీర్వాదాలను ఇచ్చుకోగలము. ఆశీర్వాదం అంటే ప్రస్తుతం వాస్తవం కానప్పటికీ, వాస్తవంగా ఎలా ఉండాలనుకుంటున్నామో దాని గురించి ఆలోచన లేదా పదాలను రచించడం. ఇది ఒక శక్తిని ప్రసరింపజేసే పాజిటివ్ సంకల్పం, దాని వైబ్రేషన్ వాస్తవికతను సృష్టిస్తుంది.

  1. కోపం యొక్క సంస్కారాన్ని మార్చడానికి ఆశీర్వాదం – నేను శాంతి స్వరూప ఆత్మను. నేను ప్రతి ఒక్కరినీ వారు ఎలా ఉన్నారో అలాగే అంగీకరిస్తాను. నేను, నా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తాను కానీ గౌరవంగా. ప్రేమ, క్రమశిక్షణలతో పని చేయిస్తాను. శాంతి మరియు సహనం నా స్వభావం.
  2. ఆలస్యంగా వచ్చే సంస్కారాన్ని మార్చడానికి ఆశీర్వాదం – నేను శక్తివంతమైన ఆత్మను. నేను అనుకున్నవన్నీ నేను సాకారం చేసుకుంటాను. నేను సమయపాలన యొక్క సంస్కారాన్ని కలిగి ఉన్నాను. నేను ఎల్లప్పుడూ సమయానికి ముందే చేరుకుంటాను.
  3. మంచి ఆరోగ్యం కోసం ఆశీర్వాదం – నేను స్వచ్ఛమైన ఆత్మను. నా శరీరంలోని ప్రతి కణం ప్రేమ మరియు ఆనందంతో నిండి ఉంటుంది. నేను గత బాధలన్నింటినీ విడిచి పెట్టాను. నా శరీరం మరియు మనస్సు పర్ఫెక్ట్ గా, ఆరోగ్యంగా ఉన్నాయి.
  4. సంబంధాన్ని బాగు పరచటానికి ఆశీర్వాదం – నేను ప్రేమ స్వరూప ఆత్మను. నేను నా సంబంధాలన్నింటినీ ఏర్పర్చుకుంటాను. ఒక నిర్దిష్ట వ్యక్తితో నా సంబంధం పర్ఫెక్ట్ గా ఉంది. గత నెగెటివ్ భావోద్వేగాలన్నీ సమాప్తమయ్యాయి. మేము ఇప్పుడు ఒకరికొకరు ప్రేమ మరియు అంగీకారాన్ని మాత్రమే ఇచ్చి పుచ్చు కుంటున్నాము.

ఇలాగే, మన వృత్తికి లేదా జీవితంలో ఏదైనా ఇతర పరిస్థితులకు మనం ఆశీర్వాదాలను ఇవ్వవచ్చు. ప్రతి ఉదయం ఆశీర్వాదాన్ని కనీసం 5 సార్లు విజువలైజ్ చేయండి. నిద్రపోయే ముందు చివరి ఆలోచనలుగా ఇవే ఉండాలి. ప్రతి గంట తర్వాత, ఒక నిమిషం ఆగి, ఆశీర్వదించుకోండి. మీరు నెగెటివ్ పరిస్థితులను చూస్తునప్పటికీ, ఆశీర్వాదాలకు వ్యతిరేకమైన ఆలోచనలను ఆలోచించకుండా జాగ్రత్త వహించండి.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd oct 2023 soul sustenance telugu

   మీ శరీరాన్ని గౌరవించే కళ

మన భౌతిక వస్త్రము అయిన మన శరీరం తరచుగా మన లేదా ఇతరుల అంచనాలకు, విమర్శ లేదా తిరస్కరణకు గురవుతుంది. మన శరీరం జీవితాంతం మనకు ఎన్నో రకాలుగా పని చేసినందుకు అది కృతజ్ఞతలు

Read More »
2nd oct 2023 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు నేను ఎలా భావిస్తున్నాను అనేది జీవితంలో పురోగతికి చాలా ముఖ్యం. అలాగే,

Read More »
1st oct 2023 soul sustenance telugu new

ఇవి ప్రపంచ నాటకం యొక్క చివరి క్షణాలు

ప్రపంచ నాటకం అనేది భూమిపై ఆత్మలందరూ ఆడే ఒక నాటకం, ఇందులో నాలుగు దశలు ఉన్నాయి – సత్యయుగం లేదా స్వర్ణయుగం, త్రేతాయుగం లేదా వెండి యుగం, ద్వాపరయుగం లేదా రాగి యుగం మరియు

Read More »