08-january

లా ఆఫ్ అట్రాక్షన్ -- మన ఆలోచించిందే మనకు లభిస్తుంది

కుటుంబం లేదా స్నేహితుల నుండి ప్రేమ మరియు ఆప్యాయత పొందేందుకు చాలా ప్రయత్నిస్తున్నప్పటికీ, ప్రేమ మరియు ఆప్యాయత మనకు లభించకపోవచ్చు లేదా ఇటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉండొచ్చు. వారు ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధ వహిస్తారు, కానీ తరచుగా వారిని ఎవరూ పట్టించుకోరు. కొన్నిసార్లు ఇలా వెలివేయడం వలన వారు కోపం, ద్వేషం, తిరస్కరణ, అపహాస్యం లేదా అసమ్మతి వంటి వ్యతిరేక భావాలుకు లోనవుతారు . కారణం మనకు స్వయం పట్ల  ప్రేమ లేకపోవటం లేదా ఆత్మగౌరవం తక్కువగా ఉండడం. అటువంటి ఇటువంటి సమయంలో మన ఆలోచనలతో నెగిటివ్ వైబ్రేషన్స్ ప్రసరింపజేయడం ద్వారా, ఇతర వ్యక్తుల నుండి ప్రేమ పొందకపోవడాన్ని, అగౌరవాన్ని మనము ఆహ్వానిస్తాము లేదా ఆకర్షిస్తాము. ఎందుకంటే మనం ఇచ్చిందే మనం పొందుతాము . ప్రేమ, శాంతి, సంతోషం ఏదైనా  మనం మనకు ఇవ్వలేకపోతే, మరెవరూ దానిని మనకు ఇవ్వలేరు. ఎందుకంటే అవి మనలో ఉన్నావే, మన నుండి ఇతరులకు చేరుకుంటాయి . ఎవరైనా విజయం కోసం చాలా కష్టపడి పదేపదే ఓటమిని పొందినప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇది మనలో సూక్ష్మ శక్తిల క్వాలిటీ పై ఆధార పడుతుంది. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత, భయం లేదా సందేహం వంటి నెగిటివిటీ యొక్క నామరూపాలు కూడా లేని విధంగా మనం దాని వైపు ప్రయాణించాలి . మన ఓటమికి ముఖ్య కారణం సఫలతకు కావలసిన లక్షణాలు లేకపోవడం కాదు, మనం ఒడిపోతామేమో అనే భయం ఉండటం. మనం ఒక అంశంలో ఓడిపోయినప్పటికీ, లక్ష్యం వైపు పాజిటివ్ గా ముందుకు వెళ్ళేలా  మనస్సును తీర్చిదిద్దాలి. మన వైబ్రేషన్స్ పాజిటివ్ గా ఉన్నప్పుడు, మరిన్ని అవకాశాలు తెరుచుకుంటాయి. 

మనందరిలో ఎనిమిది ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయి. మెడిటేషన్ మరియు క్రమం తప్పకుండా చేసే ఆధ్యాత్మిక అభ్యాసంతో, మనం స్వయాన్ని అంగీకరించే శక్తిని పెంచుకోవాలి. మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారనేది ముఖ్యం కాదు. మన గురించి మనం ఏమనుకుంటున్నామన్నది ముఖ్యం . మన ఆత్మ గౌరవాన్ని విజయాలు లేదా ఇతరుల ఆమోదం ఆధారంగా కాకుండా మన మూల గుణాల ఆధారంతో పెంచుకుందాం. అదేవిధంగా మనం ఎదుర్కొనే శక్తిని పెంచుకోవటం ద్వారా మన ఆంతరిక శక్తులు భయాన్ని మరియు స్వయం పట్ల ఉన్న సందేహాలను అధిగమించేలా చేస్తుంది . ఈ ఎదుర్కొనే శక్తి మన మనసును ధైర్యం వైపుకు నిడిపిస్తుంది . అందువల్ల మనం జీవితంలోని ఏ అంశంలోనైనా విజయం సాధిస్తాము. లా ఆఫ్ అట్రాక్షన్ ఇటువంటి అంశాలలో అమలులోకి వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అనే సూత్రం అంటే మనం కోరుకున్నది పొందడం కాదు, వాస్తవానికి మనం ఆలోచన ఆధారంగా పొందడం. మనం అనగా మన ఆలోచనలు మరియు మాటలు, ఇవే విశ్వంలో వ్యాపిస్తాయి మరియు వీటినే తిరిగి పొందుతాము. మనలో మన సంస్కారాలు మరియు కర్మల ఖాతాలు కూడా ఉన్నాయి , కాబట్టి మనం పొందేది వాటిపై కూడా ఆధారపడి ఉంటుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

కృతజ్ఞతా డైరీ రాయడం

5th Jun – జీవన విలువలు

కృతజ్ఞతా డైరీ రాయడం మనందరం మన జీవితంలో చాలా విజయాలతో ఆశీర్వదించబడ్డాము. ఈ విజయాలను కలిగి ఉన్నందుకు మనం సంతోషంగా ఉన్నాము. విశ్వం మరియు మన చుట్టూ ఉన్న వ్యక్తులతో వారు మనల్ని ఆశీర్వదించినందుకు

Read More »
నిర్భయంగా మారడానికి 5 మార్గాలు

4th Jun – జీవన విలువలు

నిర్భయంగా మారడానికి 5 మార్గాలు ఆత్మగౌరవం యొక్క శక్తివంతమైన స్థితిలో ఉండండి – మన భయాలన్నింటినీ అధిగమించడానికి మొదటి మరియు అతి ముఖ్యమైన మార్గం మన ఆత్మిక ప్రాముఖ్యతను లోతుగా గ్రహించడం. జ్ఞానం, గుణాలు,

Read More »
మార్పులు మరియు కొత్త పరిస్థితులకు సిద్ధంగా ఉండండి

3rd Jun – జీవన విలువలు

మార్పులు మరియు కొత్త పరిస్థితులకు సిద్ధంగా ఉండండి జీవితంలో, మనం నియంత్రించగలిగేవి కొన్ని ఉంటాయి మరియు నియంత్రించలేనివి కొన్ని ఉంటాయి. అయినప్పటికీ, మన జీవితం ఎలా సాగాలి అనే దాని గురించి మనము అంచనాలను

Read More »