భగవంతుడు సర్వవ్యాపి ఎందుకు కాడు అనేది తెలుసుకోవడం (పార్ట్ 1)

భగవంతుడు సర్వవ్యాపి ఎందుకు కాడు అనేది తెలుసుకోవడం (పార్ట్ 1)

ఈ ప్రపంచంలో చాలా మంది విశ్వసించే మరియు భగవంతుని పట్ల సర్వ సాధారణ భావన ఏమిటంటే, భగవంతుడు ప్రతి ఒక్కరిలో, ప్రతి జీవిలో మరియు ప్రతిచోటా ఉన్నాడు. భగవంతుడు సర్వవ్యాపి అనగా అన్ని చోట్లా ఉన్నాడు అనే భావన. ఈ సందేశంలో, ఇది నిజం కాదనడానికి 5 కారణాలను మనం  పరిశీలిద్దాము –

  1. భగవంతుడు సర్వాత్మలకు ఆత్మిక తండ్రి మరియు ప్రతి బిడ్డ లేదా మానవునిలో ఉండడు – మనలో ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక శక్తి లేదా ఆత్మ అని మరియు ప్రపంచంలో పెద్ద సంఖ్యలో మానవ ఆత్మలు ఉన్నాయని, వివిధ భౌతిక శరీరాల ద్వారా వారి పాత్రలను పోషిస్తున్నారని భగవంతుడు ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం నుండి మనం అర్థం చేసుకున్నాము. భగవంతుడు మనలాంటి ఆత్మిక శక్తి మరియు ఆత్మ అని అయితే మనకంటే గొప్ప శక్తులు కలిగిన పరమాత్మ అని కూడా మనకు తెలుసు, కాబట్టి, మనమందరం సోదర ఆత్మలు మరియు అందుకే మనం సాధారణంగా మనం వివిధ మతాలకు, దేశాలకు చెందినవారము అయినప్పటికీ కానీ మనమందరం సోదరులమే. మనమందరం ఆత్మలు కాబట్టి, మనందరికీ మన స్వంత గుర్తింపు ఉంది. మనమందరం భగవంతుని ఉనికిని మరియు మన హృదయాలలో ఆయన ప్రేమను అనుభవిస్తాము ఎందుకంటే మనతో పాటు మొత్తం ప్రపంచం వారిని  చాలా గుర్తు చేసుకుంటుంది. కానీ భగవంతుడు మనలో మరియు ప్రతి మనిషిలో ఉన్నాడని దీని అర్థం కాదు. భగవంతుడు మన ఆత్మిక తండ్రి, వారు ఈ భౌతిక విశ్వం మరియు పంచ తత్వాలకు అతీతంగా,  ప్రపంచానికి సుదూరంగా ఉన్న ఆత్మల ప్రపంచంలో నివసిస్తారు. వారు భౌతిక ప్రపంచంలో నివసించరు కానీ వారు భౌతిక ప్రపంచానికి తన వైబ్రేషన్స్ ను  ప్రసరింపజేస్తారు మరియు మానవ ఆత్మలకు వివిధ ప్రాప్తులను ఇస్తారు.
  2. భగవంతుడు మనలో ఉన్నట్లయితే, మనమందరం అన్ని విధాలుగా ఒకేలా ఉండేవాళ్లం – ప్రతి మానవ ఆత్మకు తనదైన మనస్సు, బుద్ధి మరియు సంస్కారాలు ఉన్నాయని ఆధ్యాత్మిక జ్ఞానం నుండి మనకు తెలుసు. అలాగే, భగవంతుడికి తన స్వంత మనస్సు, బుద్ధి మరియు సంస్కారాలు ఉన్నాయి. భగవంతుడు మనందరి లోపల ఉంటే మన మనస్సు, బుద్ధి, సంస్కారాలు వేరుగా ఉండేవి కావు. కానీ మనమందరం మన మనస్సులలో భిన్నంగా ఆలోచిస్తాము, మన బుద్ధి ద్వారా భిన్నంగా అంచనా వేస్తాము, భిన్నంగా విజువలైజ్ చేస్తాము మరియు మనదైన విభిన్న సంస్కారాలను కలిగి ఉంటాము. అంటే భగవంతుడు  ప్రత్యేకమైన వారు. వారు మనందరి ద్వారా ఆలోచించడం, మాట్లాడటం మరియు చర్యలు చేయడం లేదు. వారు కేవలం మనం ఎలా ఆలోచించాలో, మాట్లాడాలో మరియు చర్యలను ఎలా చేయాలో మాత్రమే మనకు మార్గనిర్దేశం ఇస్తారు. మనమందరం మన మనస్సు, బుద్ధి మరియు సంస్కారాల క్వాలిటీను బట్టి వారి సూచనలను భిన్నంగా అనుసరిస్తాము.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

21th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 3)

శ్రీ గణేష్ యొక్క పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. ఇతరుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేష్ చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం

Read More »
20th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 2)

నిన్న మనం  శ్రీ గణేష్ జన్మ యొక్క నిజమైన అర్ధాన్ని తెలుసుకున్నాము. శంకరుడు బిడ్డ తలను నరికి, అతని శరీరంపై ఏనుగు తలను ఉంచారు, ఇది పరమపిత తండ్రి మన అహంకారమనే తలను అంతం

Read More »
19th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 1)

మనం శ్రీ గణేషుని యొక్క ఆగమనం మరియు జననాన్ని గొప్ప విశ్వాసంతో మరియు ఉత్సాహంతో జరుపుకుంటాము. మన జీవితంలోని విఘ్నాలను తొలగించమని వారిని  ప్రార్థిస్తాము. మనలో చాలా మందికి వారి పుట్టుక మరియు భౌతిక

Read More »