మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 3)

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 3)

  1. నీటి శుద్దీకరణ – మనం త్రాగే నీటిని శుద్ధి చేయడం కోసం, మనం భౌతిక మార్గాలను మాత్రమే కాకుండా, నీటితో మంచి  ఆధ్యాత్మిక సంబంధాన్ని ఏర్పరుచుకొని దాని వైబ్రేషన్స్ ని మారుస్తాము. నీరు మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. నీరు మన పాజిటివ్  ఆలోచనలు మరియు భావాలతో రూపాంతరం చెందుతుంది. నీటికి పాజిటివ్ ఆలోచనలు ఇవ్వడం వల్ల భౌతికంగా మారి దానిని మరింత ఆరోగ్యవంతంగా చేయడమే కాక దాని వైబ్రేషన్స్ ను  మార్చి మరింత పాజిటివ్ గా చేస్తుంది. అలాంటి నీటిని మనం మన శరీరంలోకి ఇవ్వాలి . నీటిని మార్చడానికి మనం చేయగల కొన్ని ఆలోచనలు ఏమిటంటే–నేను ఆనందస్వరూపమైన మరియు ప్రేమస్వరూపమైన ఆత్మను … నేను భగవంతుని నుండి ఆనందం మరియు ప్రేమ యొక్క శీతల తెల్లని కిరణాలను స్వీకరిస్తున్నాను … నేను త్రాగే నీటికి ఈ పాజిటివ్ శక్తిని నింపుతున్నాను  లేదా నేను శాంతి స్వరూపమైన ఆత్మను  … భృకుటి మధ్యలో శాంతి యొక్క కిరణాలతో కూర్చొని ఉన్నాను  … నేను త్రాగే నీటికి ఈ శాంతి శక్తితో   నింపుతున్నాను లేదా నేను పరమాత్ముని బిడ్డను … వారు ప్రకృతిని గౌరవించినట్లే నేను కూడా గౌరవిస్తాను … నీరు నాకు సేవ చేస్తుందనే భావనతో నేను  నీరు త్రాగుతాను … నా పాజిటివ్ భావనలతో నేను నీటికి సేవ చేస్తాను.

ప్రతిసారీ మనం నీరు త్రాగేటప్పుడు లేదా నీటితో తయారు చేయబడిన ఏదైనా పదార్ధం త్రాగడానికి ముందు 10-15 సెకన్ల పాటు విజువలైజ్ చేయండి. అలాగే త్రాగే నీటిని ఇంట్లో లేదా మరెక్కడైనా నిల్వ చేసేటప్పుడు మనం ఈ ఆలోచనలను కొన్ని సెకన్ల పాటు విజువలైజ్ చేయండి. మీ కళ్ళను నీటిపై కేంద్రీకరిస్తూ మీరు ఇలాంటి సంకల్పాలు చేస్తూ విజువలైజ్ చేయండి . నిల్వ చేసిన నీటికి మన కళ్ళు ద్వారా పాజిటివ్  శక్తిని మరియు వైబ్రేషన్స్ ని ప్రసరింపజేస్తే దానిని త్రాగే ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూరుతుంది. ఇది మీ కుటుంబ సభ్యులందరి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.  ప్రతి ఒక్కరి చేతనంలో , మాటలలో  మరియు చర్యలలో మంచితనాన్ని తెస్తుంది.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

21th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 3)

శ్రీ గణేష్ యొక్క పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. ఇతరుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేష్ చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం

Read More »
20th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 2)

నిన్న మనం  శ్రీ గణేష్ జన్మ యొక్క నిజమైన అర్ధాన్ని తెలుసుకున్నాము. శంకరుడు బిడ్డ తలను నరికి, అతని శరీరంపై ఏనుగు తలను ఉంచారు, ఇది పరమపిత తండ్రి మన అహంకారమనే తలను అంతం

Read More »
19th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 1)

మనం శ్రీ గణేషుని యొక్క ఆగమనం మరియు జననాన్ని గొప్ప విశ్వాసంతో మరియు ఉత్సాహంతో జరుపుకుంటాము. మన జీవితంలోని విఘ్నాలను తొలగించమని వారిని  ప్రార్థిస్తాము. మనలో చాలా మందికి వారి పుట్టుక మరియు భౌతిక

Read More »