8th march soul sustenance - telugu

భగవంతుని గుణాలతో స్వయాన్ని మరియు ఇతరులను రంగరింప చేసుకోండి

హోలీ యొక్క ఆధ్యాత్మిక సందేశం – మార్చి 8

హోలీ అనేది భారతదేశంలోని అందమైన పండుగ, ఇది అన్ని వయసుల మరియు నేపథ్యాల ప్రజలను ఒకచోట చేర్చి, ప్రతి ఒక్కరూ పండుగను స్వచ్ఛమైన హృదయంతో మరియు ఎంతో ఉత్సాహంతో జరుపుకునేటప్పుడు వారిని ప్రేమ మరియు ఐక్యత యొక్క అందమైన బంధంతో ఏకం చేస్తుంది. హోలీ సందర్బంగా అందరికీ చాలా ఆనందదాయకంగా పండుగ వాతావరణంతో ఎంతో తేలికగా అనిపించినపుడు , హోలీ వేడుకల సమయంలో మనం చేసే వివిధ విధుల లోతైన సారాంశం ఏమిటో కూడా మనలో కొందరు ఆలోచిస్తారు.

హోలీ అనేది భగవంతుడు తన 7 అందమైన ఆత్మిక గుణాలతో ఆత్మకు రంగులు వేసినదానికి ప్రతీక. ఆ గుణాలు – శాంతి, ఆనందం, ప్రేమ, సుఖం, స్వచ్ఛత, శక్తి మరియు జ్ఞానం. వారు ఈ గుణాలన్నీటి సాగరుడు. మనం ఈ రంగులను ఇతరులపై జల్లినపుడు , ఇది మనలో మరియు మనం రంగులను పంచుకునే వారిలో సంతోషాన్ని , మంచితనాన్ని నింపుతుంది. ఇది భగవంతుడితో మరియు పరస్పరంలో మన ఆత్మిక బంధాన్ని పెంచుతుంది. ప్రతి గుణానికి సంబంధించిన ప్రతి రంగు చాలా లోతైనది, భగవంతుడు ఆత్మకు గుణాల రంగులు వేస్తారు. అది స్వయం మరియు ఇతరుల జీవితాన్ని మారుస్తుంది. అలాగే, మనం భగవంతునికి దగ్గరైనప్పుడు, పవిత్రమైన లేదా వికార రహిత జీవనాన్ని అలవర్చుకుంటాము. ఇతరులను కూడా భగవంతునికి కనెక్ట్ చేయడం ద్వారా పవిత్రమైన లేదా వికార రహితంగా మార్చడానికి సహాయం చేస్తాము. దానికి చిహ్నంగా, హోలీ రోజున అందరూ తెల్లని బట్టలు ధరిస్తారు, ఇది దైవత్వం మరియు పవిత్రతను సూచిస్తుంది. హోలీ అంటే గతం గతః – హిందీలో హో-లీ. హోలీ రోజున ప్రతి ఒక్కరూ తమ గత భేదాలను మరచిపోయి ఐక్యంగా ఉంటారు మరియు అందరి పట్ల వారి వైబ్రేషన్స్ సామరస్యం మరియు శుభ భావనలతో నిండి ఉంటాయి. హిందీలో హో-లీ అంటే నేను పూర్తిగా భగవంతుడికి సమర్పణ అయిపోతాను మరియు వారి ప్రకారం నా మనస్సులో ఎటువంటి ప్రశ్నలు మరియు సందేహాలు లేకుండా, నా జీవిత ప్రయాణాన్ని మలచుకుంటాను, నా ఆలోచనలు, మాటలు, కర్మలు మరియు సంబంధాలన్నింటిలో నేను పర్ఫెక్ట్ గా అవుతాను. హోలీ వేడుకలు ముగిసిన తర్వాత, ప్రతి ఒక్కరూ రంగులను శుభ్రం చేస్తారు, కానీ పండుగ యొక్క తీపి జ్ఞాపకాలను తమతో తీసుకువెళతారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వినడం మరియు ధ్యానం చేయడం, జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం మరియు దాని సహాయంతో వాటిని తన సహజ సంస్కారాలుగా చేసుకోవటం ద్వారా భగవంతుడి నుండి అన్ని గుణాల రంగులను ఆత్మ గ్రహించడాన్ని ఇది సూచిస్తుంది. ఆత్మ దేనిని గ్రహించినా, అవి దాని సహజ సంస్కారాలుగా అవుతాయి. అది ఏది పంచుకున్నా, అది పంచుకునేటప్పుడు ఆ సంస్కారాలలో ధారణ చేస్తుంది మరియు ఇతరుల నుండి తాను పంచుకున్న లక్షణాల యొక్క పాజిటివ్ శక్తిని తిరిగి పొందుతుంది. అన్ని గుణాలతో కూడిన ఈ సంస్కారాలు అనేక జన్మల పాటు కొనసాగి భగవంతునితో ఆధ్యాత్మిక మరియు పవిత్రమైన జీవితం యొక్క ప్రయోజనాలను అనుభూతి చెందుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »
26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »
25th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 1)

మన బాహ్య రూపాన్ని లేదా పరిశుభ్రతను చెక్ చేయడానికి, మనం ప్రతిరోజూ అద్దంలోకి చూస్తాము. కానీ మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థాయిలో, మీ అంతర్గత ముఖం లేదా ఆధ్యాత్మిక స్వయంలో ఏదైనా తప్పు

Read More »