ప్రశంసలో స్థిరంగా ఉండండి

ప్రశంసలో స్థిరంగా ఉండండి

మనం చేసిన దాని గురించి ఇతరులు మనల్ని మెచ్చుకున్నప్పుడు, వారు మన గురించి చెప్పేది నిజంగా మన గురించి కాదు. మనలో మంచితనాన్ని చూడగలిగే మంచి గుణం వారికి ఉంది అని మనం అర్ధం చేసుకోవాలి. అది మన గురించి వారి అభిప్రాయం, వారి దృక్పథం మరియు అది ఎప్పుడైనా మారవచ్చు. వారు చూపించిన దానికి మనం వారికి కృతజ్ఞతలు తెలుపుదాం, కానీ ఆ ప్రశంసలకు బానిస కాకూడదు. మీ సోషల్ మీడియా పోస్ట్‌కి చాలా తక్కువ లైక్‌లు వచ్చి ఉండొచ్చు. మీరు ప్రాజెక్ట్‌పై చేసిన ప్రయత్నాలను మీ బాస్ (boss) గుర్తించకపోవచ్చు. మీ కుటుంబం, వారి పట్ల మీకున్న శ్రద్ధ మరియు ప్రేమను చాలా అరుదుగా గుర్తించింది. ఈ కారణాలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయా? మీరు ఖచ్చితంగా ప్రశంసలు అవసరమని భావిస్తున్నారా? ప్రశంసలను అందుకోవడం ఒక విషయం, దానిని కోరకోవడం పూర్తిగా మరొక విషయం. ప్రశంస వ్యక్తిగతమైనది. ఒకరు మనల్ని మెచ్చుకోవచ్చు, మరొకరు మనల్ని దించవచ్చు. ప్రశంసలకు అలవాటు పడడం మన జీవిత నిర్ణయాలపై ప్రభావం చూపుతుంది – ఇతరులను ఆకట్టుకోవడానికే మనము నిరంతరం పనులు చేస్తాము. ఎవరైనా మనల్ని మెచ్చుకుంటే, మనలోని మంచితనాన్ని చూడటం ఆ వ్యక్తి యొక్క అందమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టి ప్రశంసలు మనకన్నా వారి గురించి ఎక్కువగా చెప్తాయి. ఈ అవగాహన మనము స్థిరంగా మరియు వినయంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది మన అహాన్ని అదుపులో ఉంచుతుంది. ప్రశంసలకు అలవాటు పడవద్దు. దానికి బదులుగా, భగవంతునికి కృతజ్ఞతలు చెప్పి వారికి ఆ  ప్రశంసలను అప్పగించండి. మిమ్మల్ని మెచ్చుకున్న వ్యక్తికి కూడా వినయంగా ధన్యవాదాలు తెలపండి.

మీరు నిరాడంబరమైన జీవి అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మరియు దాని స్వరూపులుగా ఉండండి. అందరికీ ప్రేమ మరియు శ్రద్ధను ప్రసరింపజేయండి. మీ పాత్రలు మరియు బాధ్యతలను నిజాయితీగా నిర్వహించండి. మీ లక్షణాలు మరియు మీ ప్రతిభతో ఇతరులు సంతోషంగా ఉన్నప్పుడు, వారు మిమ్మల్ని అభినందిస్తారు. కానీ గుర్తింపు కోసం కాకుండా నిస్వార్థంగా మీరు చేసే పనిని చేయడం వల్ల మీరు ప్రభావితం కారు, మీరు మీ లానే ఉంటారు. మీరు ప్రశంసించబడిన ప్రతిసారీ, మీరు భగవంతుని సాధనమని మీ మనస్సుకు వెంటనే గుర్తు చేయండి. మీరు దీన్ని చేయడానికి భగవంతుని ద్వారా ఎంపిక చేయబడ్డారు, ఆ వ్యక్తులు దానిని పొందేందుకు ఉద్దేశించబడ్డారు మరియు మీరు ఆ సన్నివేశంలో భాగమయ్యే అదృష్టం కలిగి ఉన్నారు. మీరు భగవంతునికి కృతజ్ఞతలు తెలపండి, స్తుతిని భగవంతునికి అప్పగించండి, అవకాశం ఇచ్చినందుకు అందరికీ  కృతజ్ఞతలు తెలుపుతూ వారి ప్రశంసలు, వారి మంచితనానికి ప్రతిబింబమని మీరు ఒప్పుకోండి.  ఇది ఇతరులలో మంచిని గమనించే వారి స్వభావాన్ని చూపుతుంది. ప్రశంసలో స్థిరంగా ఉండండి, ఆశించవద్దు, మీ కోసమేనని అంగీకరించవద్దు, అది మిమ్మల్ని ప్రభావితం చేయదు. వినయాన్ని మీ సహజ జీవన విధానంగా చేసుకోండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

శాంతి అనుభూతికి 5 దృఢసంకల్పాలు

30th May – జీవన విలువలు

శాంతి అనుభూతికి 5 దృఢసంకల్పాలు నేను, నా నుదుటి మధ్యలో కూర్చున్న ఆధ్యాత్మిక నక్షత్రం… నేను శాంతి యొక్క సుందర  గుణాన్ని అనుభూతి చేస్తూ నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ మరియు ప్రతిదానికీ

Read More »
వర్క్-లైఫ్ (work -life)ని బ్యాలన్స్ గా ఉంచుకోవటం

29th May – జీవన విలువలు

వర్క్-లైఫ్ ని బ్యాలన్స్ గా ఉంచుకోవటం మన వర్క్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అనే విషయం అంగీకరించే విషయమే. కానీ కొన్నిసార్లు మనము వర్క్  కు   మిగతా వాటికన్నా ఎక్కువ

Read More »
మనసు యొక్క ట్రాఫిక్ కంట్రోల్

28th May – జీవన విలువలు

మనసు యొక్క ట్రాఫిక్ కంట్రోల్ ఆలోచనలు మన భాగ్యాన్ని సృష్టిస్తాయి. కాబట్టి మనం ఒక్క తప్పుడు ఆలోచన కూడా చేయకూడదు. సరైన ఆలోచనా సరళితో మనస్సును ప్రోగ్రామ్ చేయడానికి, మనం ప్రతి గంట తర్వాత

Read More »