Hin

9th april soul sustenance telugu

మన విధిని మనం మార్చుకోగలమా లేదా?

కొన్ని వేల సంవత్సరాల నుండి ప్రజలు సర్వ సాధారణంగా అడిగే ప్రశ్న – మన విధి ముందుగానే ఫిక్స్ అయి ఉంటుందా లేక మన తలరాతను మనం మార్చుకోగలమా? ఏదైనా కష్టం మనకు వచ్చినప్పుడు ఇదంతా గత కర్మల ఫలితం అనుకుంటాం. ఈ గత జన్మలో చేసిన ప్రతికూల కర్మల ప్రభావం మన ప్రస్తుత జన్మపై పడకుండా మనం ఆపగలమా అని కూడా ఆలోచిస్తుంటాము. మరి, ఇందుకు మనం ఏమి చేయాలి, ఎక్కడ నుండి మొదలుపెట్టాలి? ముందుగా, ప్రతి మనిషి తన గత జన్మలలో సానుకూల మరియు ప్రతికూల కర్మలను చేసాడు అని మనం బాగా అర్థం చేసుకోవాలి. అందులో , కొందరు తక్కువ ప్రతికూల కర్మలు చేస్తే మరికొందరు అవి ఎక్కువగా చేసి ఉన్నారు. అందుకు పరిణామంగా, ఈ ప్రపంచంలో ప్రస్తుతం అందరూ ఏదో ఒక విధంగా నెగిటివ్ పరిస్థితులను ఎదుర్కుంటున్నారు. మన తలరాతను భగవంతుడే వ్రాసాడు, మన జీవితంలో ఏది జరుగుతున్నా అది మంచిగానీ, చెడుగానీ అంతా భగవంతుడే నిర్ణయిస్తాడు అని ఈ ప్రపంచంలో నమ్ముతారు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకారంగా, ఇది నిజం కాదు. భగవంతుడు మన జీవిత పరిస్థితులను నిర్ణయించడు.  మన జీవితంలో ఏదైనా మంచి జరిగినప్పుడు, అది ఎల్లప్పుడూ మన గతంలో చేసిన మంచి కర్మల ఫలితంగా ఉంటుంది, అలాగే భగవంతుని సహాయం కారణంగా, ఇది కొన్ని పరిస్థితులలో ఉంటుంది, కానీ అన్నింటిలో కాదు. మరోవైపు, మన జీవితంలో ఏదైనా ప్రతికూల సంఘటనలు జరిగినప్పుడు, అది మనం గతంలో చేసిన చెడు కర్మల ఫలితంగా మాత్రమే ఉంటుంది. మన ప్రతికూల కర్మలకు భగవంతుడు మనల్ని శిక్షించడు.

అంటే, మనమందరమూ మన గత కర్మల ఆధారంగానే ఒక విధిని తయారు చేసుకున్నాము. అయితే, మన తలరాతను ప్రస్తుతం మార్చుకునేందుకు భగవంతుడిచ్చిన మార్గదర్శనం ప్రకారం మరియు వారిచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం అనుసారంగా మూడు మార్గాలున్నాయి – 1. మెడిటేషన్‌లో పరమాత్మను స్మరించండి, వారి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వినండి. ఇది ఆత్మను శుద్ధి చేసి గత ప్రతికూల కర్మల భారాన్ని తీరుస్తుంది. 2. ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటే అది ఆత్మను ఏడు సుగుణాలతో నింపుతుంది – శాంతి, ఆనందము, ప్రేమ, పరమానందము, పవిత్రత, శక్తి మరియు జ్ఞానము. ఇవి ఇతరులలో కూడా సుగుణాలను పెంచుతుంది. 3. 5 వికారాల నుండి దూరంగా ఉండండి – కామము, క్రోధము, లోభము, మోహము మరియు అహంకారము మరియు ఇతర వికారాలను మీ ఆలోచనలు, మాటలు మరియు కర్మల నుండి తొలగించి పవిత్రమైన జీవనశైలిని అవలంబించండి. ఈ మూడు మనం చేసినప్పుడు ఆత్మ శుద్ధి జరిగి మంచితనము మరియు ఇవ్వడము అనే పాజిటివ్ సంస్కారాలను సృష్టిస్తుంది. ఆత్మలోపల జరిగే ఈ మార్పులు మరింత సానుకూల మరియు చక్కని జీవన పరిస్థితులను ఆకర్షిస్తాయి, అలాగే ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మారుస్తాయి. ఇవి భవిష్య జన్మలను కూడా పూర్తిగా సానుకూలతతో మరియు విజయాలతో నిండేలా చేస్తాయి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

23rd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు రెండూ ఈ సమాజంలో ఉన్నాయి. మన జీవితంలో అనేక కర్మలు చేస్తూ ఉంటాము,

Read More »
22nd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు అనేవి జీవితమనే నాణానికి ఉన్న రెండు వైపుల వంటివి.  మన కర్మలు ఎంత

Read More »
21st april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం అనేది అనేక మలుపులు మరియు మార్పులతో కూడిన ఒక అందమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో వచ్చే అనేక దృశ్యాలు మనలోని

Read More »