ఆశీర్వాదాల పాజిటివ్ ఎనర్జీ (పార్ట్ 3)

ఆశీర్వాదాల పాజిటివ్ ఎనర్జీ
(పార్ట్ 3)

వ్యక్తులను మరియు పరిస్థితులను ఆశీర్వదించడం

కుటుంబం, స్నేహితులు లేదా సహోద్యోగుల తప్పుడు అలవాట్లను చూసినపుడు మనం పలుమార్లు  కలవరపడతాము. ఆందోళన లేదా భయంతో మనం వారి అలవాట్ల గురించి ఆలోచిస్తూ, వాటి గురించి ఇతరులతో మాట్లాడుతాము. మన జీవితంలో సమస్యలు మరియు పరిస్థితులలో కూడా అదే జరుగుతుంది. ఆందోళన మరియు అతిగా ఆలోచించడం మన జీవన విధానంలో సహజమని అనిపిస్తుంది. ప్రస్తుత వాస్తవికత గురించి పదేపదే ఆలోచించడం మరియు మాట్లాడటం అలవాట్లను బలపరచి సమస్యలను పెంచుతుంది. వారిని ప్రభావితం చేసే, మార్చే శక్తి మనకు ఉంది; మన సమస్యల గమనాన్ని మార్చే శక్తి మనకు ఉంది – అదే ఆశీర్వాదాల శక్తి.

 మీకు కావలసిన వాస్తవికతను విజువలైజ్ చేసుకొని, ఆపై అది ఇప్పటికే జరిగింది అనే ఒక ఆలోచనను చేయండి. ఆ ఆలోచనను వ్యక్తులకు లేదా పరిస్థితికి రేడియేట్ చేయండి. మీరు అనుకున్నది జరగాలి అని మాత్రమే ఆలోచించండి మరియు మాట్లాడండి, ఇది ఇప్పటికే జరిగిందని నమ్మండి. ఇవి వారి అలవాట్లకు లేదా సమస్యకు ఆశీర్వాదాలు. మనకు తెలియనప్పుడు మనం నెగెటివ్ గా ఆలోచించాము, ఇప్పుడు మనకు తెలిసినప్పుడు మనం పాజిటివ్ గా ఆలోచిద్దాము. ఆలోచనలు మరియు పదాల మార్పు వైబ్రేషన్ ని మార్చి వాస్తవికతగా సాకారం అవుతుంది.

ఉదా. మీ పిల్లవాడు సరిగా తినకపోయినా లేదా చదువుకోకపోయినా లేదా పెద్దల మాట వినకపోయినా,  మనం సాధారణంగా  – నా బిడ్డ తినడు, కనుక అనారోగ్యం బారిన పడకూడదని ఆశిస్తూ ఉంటాము. అతని భవిష్యత్తు ఎలా ఉంటుంది? తన పనితీరును బట్టి అతను ఎప్పటికీ విజయం సాధించలేడు. అతను ప్రవర్తించే విధానం చూడండి, అతను ఎప్పటికీ మారడు అని ఆలోచిస్తాము. అలా ఆలోచిస్తే మనం వాస్తవికతను నిశ్చితంగా చేయడంతో పెద్దదిగా చేస్తాము. వాస్తవికతను మార్చడానికి, మన ఆలోచనలను మార్చుకోవాలి. దీవెనలు అంటే – నా బిడ్డ నిజాయితీ పరుడు మరియు విధేయుడు. అతను అందరినీ ప్రేమిస్తాడు మరియు గౌరవిస్తాడు. అతను నిజాయితీగా కష్టపడి పని చేస్తున్నాడు, అతనికి విజయం ఎల్లప్పుడూ ఖచ్చితంగా ఉంటుంది. అతను సమతుల్య ఆహారం తీసుకుంటాడు మరియు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటాడు. 

ప్రతిరోజూ ఈ సంకల్పాలను రేడియేట్ చేసి, మీ ఆశీర్వాదాల శక్తి ని అనుభవం చేయండి.  

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »
25th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 1)

మన బాహ్య రూపాన్ని లేదా పరిశుభ్రతను చెక్ చేయడానికి, మనం ప్రతిరోజూ అద్దంలోకి చూస్తాము. కానీ మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థాయిలో, మీ అంతర్గత ముఖం లేదా ఆధ్యాత్మిక స్వయంలో ఏదైనా తప్పు

Read More »
24th-sept-2023-soul-sustenance-telugu

నెగిటివ్ పరిస్థితుల్లో పాజిటివ్ గా ఉండటానికి 5 మార్గాలు

మన జీవితంలో ఏదైనా పరిస్థితి నెగిటివ్ ఫలితాన్ని కలిగి ఉండవచ్చు. కానీ చాలా సార్లు  మనము నెగిటివ్ ఫలితం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము ఇంకా అది జరగడానికి ముందే భయపడతాము. వివేకంతో నిండిన బుద్ధి

Read More »