Soul sustenance telugu - 9th january

ఆధ్యాత్మిక శక్తి యొక్క త్రిభుజం

మన జీవితంలో మంచి మార్పులను తీసుకువచ్చేందుకు ఆధ్యాత్మిక జ్ఞానం పొందేందుకు మొదటి అడుగు వేసినప్పుడు మనం ఒక “ఆత్మ” అని తెలుసుకుంటాము . భౌతిక శరీరం ద్వారా ఆలోచించేది , అనుభూతి చెందేది , గ్రహించేది , మాట్లాడేది మరియు కర్మలు చేసేది ఆత్మ అని మనం తెలుసుకుంటాము . అలాగే, కర్మ సిద్ధాంతం గురించి కూడా తెలుసుకుంటాము. నేను ఆత్మ అనే స్మృతితో చేసే కర్మలు జ్ఞానంతో కూడినవిగా , గుణాలు మరియు శక్తులతో నిండినవిగా ఉంటాయి అని భగవంతుడు చెబుతాడు. అదే విధంగా నేను శరీరాన్ని అనే స్మృతితో లేక నెగెటివ్ భావాలతో చేసే కర్మలు నెగెటివ్ గా ఉంటాయి అని భగవంతుడు చెబుతాడు. మనం నెగెటివ్ కర్మలు చేయడం ఆపి పాజిటివ్ కర్మలు చేసినప్పుడే ఆత్మ జాగృతి మనలో పెరుగుతుంది.
దానితో పాటు మనలో ఏడు మూల సద్గుణాలైన – శాంతి, సుఖం ,ప్రేమ, ఆనందం, పవిత్రత , శక్తి మరియు జ్ఞానం పెంచడానికి భగవంతుడిని స్మరించినప్పుడే ఆత్మలో శక్తి పెరుగుతుంది . ఆత్మ ఎంత స్వచ్ఛంగా, పాజిటివ్ గా మరియు శక్తివంతంగా మారుతుందో, మనం అంత తేలికగా, స్థిరంగా మరియు సంతుష్టంగా ఉంటాము. మనలో స్వచ్ఛత మరియు శక్తి పెరుగుతున్న కొద్దీ భగవంతునిపై విశ్వాసం పెరుగుతుంది మరియు భగవంతునితో మరింత లోతైన సంబంధం ఏర్పడుతుంది. దీనివలన మనం మరింత ప్రేమ మరియు దృఢ నిశ్చయంతో భగవంతునితో కనెక్ట్ అవ్వడం ప్రారంభిస్తాము. అలాగే, మన జీవితంలోని అన్ని ప్రధాన రంగాలలో మరింత విజయాన్ని పొందుతాము, అంటే వ్యక్తిత్వ పరివర్తన కావచ్చు, ఆరోగ్యం, సంబంధాలు, విద్య, వృత్తి వ్యాపారాలలో, సంపద మొదలైనవి అనింటిలో విజయాన్ని పొందుతాము

మన ఆత్మిక శక్తి పెరిగేకొద్దీ, మన ఆధ్యాత్మిక ప్రయోజనాలను ఇతరులతో పంచుకోవాలనే కోరిక మనకు కలుగుతుంది. అలాగే మెడిటేషన్ ఎలా ఉపయోగపడుతుందో, మెడిటేషన్ అభ్యసిస్తూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అధ్యయనం చేయడం ద్వారా రోజంతా ఎంత ఆహ్లాదకరంగా మరియు సంతృప్తికరంగా ఉంటుందో ఇతరులకు చెప్పడం ప్రారంభిస్తాము. ఈ ప్రక్రియను ఒక త్రిభుజంతో పోల్చవచ్చు . భగవంతునితో మనకున్న సంబంధం త్రిభుజంలో ఒక వైపును సూచిస్తుంది, మన ఆధ్యాత్మిక పురోగతి మరియు అభ్యాసం ద్వారా ప్రయోజనం పొందే ఇతరులు త్రిభుజం యొక్క మరొక వైపును సూచిస్తారు. ఫలితంగా, ఇతరులు భగవంతునితో కనెక్ట్ అవుతారు, ఇది త్రిభుజం యొక్క మూడవ వైపును సూచిస్తుంది. త్రిభుజం యొక్క 3 మూలలను మూడు కోణాలు గా చూడవచ్చు. A మనము గాను, B భగవంతునిగా మరియు C ఇతరులుగా కూడా చూడవచ్చు. సైడ్ AB భగవంతునితో కనెక్ట్ కావడం ద్వారా మన స్వీయ-ప్రగతిని సూచిస్తుంది. సైడ్ AC ఇతరులకు మనం చేసే సేవను మరియు వారిని భగవంతునితో కనెక్ట్ చేసే మన ప్రయత్నం కూడా సూచిస్తుంది మరియు సైడ్ BC భగవంతుని కనెక్షన్ తో ఇతరులు పొందిన ప్రయోజనాన్ని సూచిస్తుంది. ఇది ఆధ్యాత్మిక శక్తి యొక్క త్రిభుజం. ఇది ఆధ్యాత్మికత యొక్క రెండు ప్రాథమిక ప్రక్రియలను సూచిస్తుంది – ఆధ్యాత్మిక సంపదను నింపడం మరియు పంచడం. ఈ త్రిభుజం మన మరియు ఇతరుల జీవితాలను అందంగా మరియు భగవంతుని గుణాలు మరియు శక్తులతో నింపుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 4)

9th Jun – జీవన విలువలు

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 4) గాలి శుద్దీకరణ – గాలి మన చుట్టూ నిరంతరం ఉంటుంది మరియు మనం దానిని ఎల్లప్పుడూ  పీల్చుకుంటాము. భౌతిక

Read More »
మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 3)

8th Jun – జీవన విలువలు

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 3) నీటి శుద్దీకరణ – మనం త్రాగే నీటిని శుద్ధి చేయడం కోసం, మనం భౌతిక మార్గాలను మాత్రమే కాకుండా,

Read More »
మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 2)

7th Jun – జీవన విలువలు

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 2) ప్రకృతి నుండి మనం తీసుకునే ఆహారం, నీరు మరియు గాలి భౌతిక మరియు భౌతికేతర రెండు రకాలుగా ఎలా

Read More »