భగవంతుడు సర్వవ్యాపి ఎందుకు కాడు అనేది తెలుసుకోవడం (పార్ట్ 2)

భగవంతుడు సర్వవ్యాపి ఎందుకు కాడు అనేది తెలుసుకోవడం (పార్ట్ 2)

  1. భగవంతుడు సర్వాంతర్యామిగా ఉన్నట్లయితే, ప్రపంచమంతా పూర్తి ఆనందం ఉంటుంది కానీ ప్రపంచం అలా లేదు – భగవంతుడు మంచితనం మరియు దైవత్వం యొక్క సాగరం. వారు ఆ మంచితనాన్ని మరియు దైవత్వాన్ని నిరంతరం ప్రసరిస్తారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరి హృదయాలలో భగవంతుడు ఉండి ఉంటే,  ప్రపంచంలోని ప్రతిచోటా భగవంతుడు భౌతిక ప్రకృతిలో నివసించినట్లయితే, మానవులందరూ మంచి పనులు మాత్రమే చేసేవారు మరియు ప్రపంచంలో పాపాలు, దుర్గుణాలు మరియు చెడు అలవాట్లు ఉండవు. ప్రతి ఒక్కరూ సామరస్యంగా జీవిస్తారు మరియు అందరిలో పూర్తి సద్భావన ఉంటుంది ఎందుకంటే వారందరూ భగవంతుని వలె ఉంటారు. భగవంతుడు ప్రతి కణంలో ఉంటే  ప్రకృతి వైపరీత్యాలు మరియు విపత్తుల నుండి పూర్తిగా విముక్తిగా ఉండేది అయితే అలా జరగడం లేదు. అంటే భగవంతుడు సర్వాంతర్యామి కారు.
  2. భగవంతుడు మన హృదయాలలో ఉండి ఉంటే మనం వారిని  కోసం వెతకము మరియు శాంతి, ప్రేమ, ఆనందం మరియు శక్తి కోసం వారిని పిలవము  – వేల సంవత్సరాల నుండి మనం భగవంతున్ని   పిలిచాము. వారి కోసం, వారిచ్చే శాంతి, ప్రేమ, ఆనందం మరియు శక్తి కోసం వెతుకుతున్నాము. అలాగే, మనం వారిని పిలిచినప్పుడల్లా, మనం తరచుగా ఆకాశం వైపు చూస్తూ ఉంటాము. భగవంతుడు మనందరి లోపల ఉండి ఉంటే, మనం అలా చేయము. మనలో ఉన్న భగవంతుని జ్ఞానం, గుణాలు మరియు శక్తులను మనం అనుభూతి చెందుతాము మరియు అంతరంగంలో వారితో మాట్లాడతాము. మనం అలా వారితో మాట్లాడేటప్పుడు, మనం వారి సామీప్యాన్ని అనుభూతి చెందుతాము, కానీ వారు  ప్రపంచంలోని ప్రతి మనిషిలో, ప్రతి జంతువు, పక్షి మరియు కీటకాలతో పాటు ప్రపంచంలోని ప్రతిచోటా ఉన్నారని అర్థం కాదు.
  3. భగవంతుడు అత్యున్నతమైన దాత. వారు ప్రతి మానవునిలో ఉన్నట్లయితే, వారు ఇకపై అలా ఉండరు – భగవంతుడు అన్ని గుణాలు మరియు శక్తుల యొక్క అత్యున్నత సాగరం మరియు వారు మానవాళికి మరియు మొత్తం విశ్వానికి ఈ గుణాలను మరియు శక్తులను నిరంతరం ఇచ్చేవారు. వారు  ప్రతి మనిషిలో ఉంటే, వారు చర్య, ప్రతిచర్య మరియు కర్మ, కర్మ యొక్క ఫలాల ప్రక్రియలో కూడా వస్తారు. అలాగే, వారు ఇకపై దాతగా ఉండరు. మానవుల వలె ఆశించే మరియు కోరుకునే వ్యక్తి అవుతారు. అలాగే, భగవంతుడు ప్రతి మానవునిలో ఉన్నట్లయితే, వారు ప్రకృతి యొక్క ప్రభావంలోకి వస్తారు, నిజానికి వారు ఎన్నడూ ప్రకృతి యొక్క ప్రభావంలోకి రానివారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »
25th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 1)

మన బాహ్య రూపాన్ని లేదా పరిశుభ్రతను చెక్ చేయడానికి, మనం ప్రతిరోజూ అద్దంలోకి చూస్తాము. కానీ మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థాయిలో, మీ అంతర్గత ముఖం లేదా ఆధ్యాత్మిక స్వయంలో ఏదైనా తప్పు

Read More »
24th-sept-2023-soul-sustenance-telugu

నెగిటివ్ పరిస్థితుల్లో పాజిటివ్ గా ఉండటానికి 5 మార్గాలు

మన జీవితంలో ఏదైనా పరిస్థితి నెగిటివ్ ఫలితాన్ని కలిగి ఉండవచ్చు. కానీ చాలా సార్లు  మనము నెగిటివ్ ఫలితం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము ఇంకా అది జరగడానికి ముందే భయపడతాము. వివేకంతో నిండిన బుద్ధి

Read More »