మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 4)

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 4)

  1. గాలి శుద్దీకరణ – గాలి మన చుట్టూ నిరంతరం ఉంటుంది మరియు మనం దానిని ఎల్లప్పుడూ  పీల్చుకుంటాము. భౌతిక మార్గాల ద్వారా మనం పీల్చే గాలిని శుద్ధి చేయడమే కాకుండా, శాంతి, స్వచ్ఛత మరియు మంచితనం యొక్క తాజా మరియు పాజిటివ్ వైబ్రేషన్స్ ను  మన చుట్టూ ఉన్న గాలికి నిరంతరం ప్రసరింపజేయాలి. మనము దీన్ని ఎలా చేయాలి? మన ఆధ్యాత్మిక శక్తి నిరంతరం గాలితో సంబంధం కలిగి ఉండి గాలిని చార్జ్ చేస్తుంది. అందువలన మనం మన ఆత్మిక శక్తిని మరింత శక్తివంతం చేసుకొని మన ప్రభామండళాన్ని(ఆత్మిక ప్రకాశాన్ని)  పెంచుకోవాలి.  మనం గాలితో సంబంధంలోకి వచ్చినప్పుడు, అది మన శక్తిని గ్రహించి దూరంగా వెళ్లిపోతుంది. మనము తిరిగి దానిని కూడా పీల్చుకుంటాము. గాలి మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకునే చాలా ముఖ్యమైన తత్వము.

గాలిని శుద్ధి చేయడం కోసం మనం విజువలైజ్ చేయగల కొన్ని ఆలోచనలను చూద్దాం – నేను అనేక గుణాలు మరియు శక్తులు కలిగిన ఆత్మను … నేను నడుస్తూ, కూర్చొని వివిధ కర్మలను చేస్తున్నప్పుడు, నేను ఈ గుణాలను, శక్తులను గాలికి ప్రసరింపజేస్తాను … గాలి నన్నుచేరుకోగానే  పాజిటివ్ గా చార్జ్ అవుతుంది లేదా నేను నా నుదిటి మధ్యలో ఉన్న ఒక స్వచ్ఛమైన మెరిసే నక్షత్రాన్ని ….. నా నుదిటి నుండి స్వచ్ఛత యొక్క తెల్లటి కిరణాలు నా చుట్టూ ఉన్న గాలికి ప్రసరిస్తున్నాయి … నా ఆధ్యాత్మిక పరిశుభ్రతను మరియు స్వచ్ఛత గాలి పొంది నా శరీరంలోకి ప్రవేశించి శుభ్రపరుస్తుంది లేదా నేను పరమాత్ముని దేవదూతను, మాస్టర్ సృష్టికర్తను … నేను గాలిని తాకడం ద్వారా గాలిని స్వచ్ఛంగా చేస్తున్నాను … గాలి నాకు సేవ చేయడానికి వస్తుంది మరియు నేను దానిని ప్రేమ మరియు శ్రద్ధతో సేవిస్తాను. ఈ ఆధ్యాత్మిక ఆలోచనలు గాలిని మార్చడమే కాకుండా మనకు మరియు మన చుట్టూ ఉన్న గాలిని  పీల్చుతున్న ఇతరులకు కూడా ప్రయోజనం చేకూరుస్తాయి. మనం నడిచేటప్పుడు లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడు రోజులో కొన్ని సార్లు ఈ విధంగా ఆలోచించవచ్చు. మనం దీన్ని ఎంత ఎక్కువగా చేస్తే, అంతగా  గాలి స్వచ్ఛoగా మరియు మంచి క్వాలిటి వైబ్రేషన్స్ తో నిండుతుంది . ఆ గాలిని పీల్చుకోవడం వల్ల మనం సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉంటాము.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »
26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »