Hin

3rd May 2025 Soul Sustenance Telugu

May 3, 2025

ఆధునిక ప్రపంచంలో మనం భావోద్వేగపరంగా స్వేచ్ఛగా ఉన్నామా? (పార్ట్ 1)

మనము ఈ ఆధునిక జీవితాన్ని అనేక లక్ష్యాలు మరియు విజయాల లక్ష్యంతో గడుపుతున్నాము – వాటిని సాధించి, చేరుకోవాలనే తపనతో జీవిస్తున్నాము. అదే సమయంలో, మన ప్రస్తుత జీవితం వివిధ రకాల గడువులు మరియు ఒత్తిళ్లతో నిండి ఉంది. దీని మధ్యలో, మనం భావోద్వేగపరంగా స్థిరంగా మరియు సంతోషంగా ఉండాలనుకుంటున్నాము, ఎందుకంటే అది ఆత్మ ఇష్టపడే అనుభవం. ఆత్మను ఎప్పటికప్పుడు గత నెగెటివ్ కర్మలు లాగుతూ, మన జీవితాల్లో వివిధరకాల కష్టాలను కలిగిస్తుంటాయి. భావోద్వేగాల్లో చిక్కుకోకుండా మనస్సు స్వేచ్ఛగా ఉండేలా జీవితాన్ని ఎలా జీవించగలం?  ఈ సందేశంలో 3 ఆధ్యాత్మిక పద్ధతులను చూద్దాం –

 

రోజంతా ఆత్మజ్ఞానంతో ఉండేందుకు ఒక ప్రణాళికను రూపొందించండి 

ఆత్మజ్ఞానం మన మనస్థితిని ఎలా ప్రభావితం చేస్తుంది? ఇది శాంతి, ప్రేమ, ఆనందం, శక్తి వంటి మన అసలైన ఆధ్యాత్మిక సుగుణాల ఆధారంగా మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే, ఇది మనల్ని ఎంతగా సంతృప్తి పరుస్తుందంటే, ఈ గుణాలను ఇతరులతో పంచుకోవాలనే భావనను కలిగిస్తుంది. మనకు ఏవైనా అశాంతి, ద్వేషం, దుఃఖం లేదా మరేదైనా నెగెటివ్ అంశాలు ఎవరి నుండి అయినా అనగా  మన శరీరం, వస్తువు, సాంకేతిక పరికరం, సంపద లేదా జీవితంలో ఏదైనా దృశ్యమునుండి వచ్చినా, మనం అంతర్గతంగా ప్రభావితం కాకుండా, భయం లేకుండా శాంతిగా ముందుకు సాగుతాము. ఇది మన చుట్టూ ప్రతి క్షణం జరుగుతున్న మార్పుల మధ్య – ఎప్పటికప్పుడు ఉత్థానపతనాలతో కూడిన – మనలను ప్రతి క్షణం స్థిరంగా ఉంచుతుంది. అందుచేత, రోజంతా నిర్దిష్ట విరామాల వద్ద ప్రతిసారి 2–3 నిమిషాలు ధ్యానంలో కూర్చోవడం, అలాగే ప్రతి ఒక్కరినీ ఆత్మిక దృష్టితో చూడటం – అంటే నేను మరియు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జీవులమే, సమానంగా ఉన్నప్పటికీ ప్రతిఒక్కరూ తమదైన ప్రత్యేకత కలిగినవారనే భావనతో సంబంధాన్ని ఏర్పర్చుకోవాలి. అప్పుడు మనలో ఆత్మజ్ఞానం సహజంగా పెరిగి, ఆధ్యాత్మిక శక్తితో నిండిపోతాం. ఇది మనల్ని ఎప్పుడూ సానుకూలంగా, శక్తివంతంగా ఉంచుతుంది.


(సశేషం)

రికార్డు

22nd May 2025 Soul Sustenance Telugu

భోజనం చేసే ముందు భగవంతునికి ఆహారాన్ని అర్పించడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అలవర్చుకోవల్సిన ఒక అందమైన అలవాటు, భగవంతుని ధ్యానంలో ప్రతి భోజనాన్ని వండడం. అలాగే, ఒక రోజులో

Read More »
21st May 2025 Soul Sustenance Telugu

మీ వాస్తవిక సత్య గుణానికి తిరిగి వెళ్లడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సత్యం మన వాస్తవిక గుణం, కానీ ఎప్పటికప్పుడు మన సౌలభ్యం కోసం లేదా స్వల్పకాలిక లాభాల కోసం అబద్ధాలు చెబుతాము. ఆసక్తికరమైన

Read More »
20th May 2025 Soul Sustenance Telugu

మీ పిల్లలతో తగినంత సమయం గడపకపోవడంపై అపరాధ భావాన్ని అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిబద్ధతలను గౌరవించేటప్పుడు, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత నాణ్యమైన సమయాన్ని ఇవ్వకపోవడం

Read More »