Hin

4th May 2025 Soul Sustenance Telugu

May 4, 2025

ఆధునిక ప్రపంచంలో మనం భావోద్వేగపరంగా స్వేచ్ఛగా ఉన్నామా? (పార్ట్ 2)

సదా మీతో సానుకూల ఆలోచనల డైరీను ఉంచండి

ప్రతిరోజు మన రోజును ప్రారంభించే సమయంలో, మనతో పాటు ఒక సానుకూల ఆలోచనల డైరీని తీసుకెళ్లాలి. మన జీవితంలో వివిధ సమయాలలో మనం రాసుకున్న జ్ఞానభరితమైన ఆలోచనలు, చింతనలు అందులో ఉండాలి. మనకు నచ్చిన జ్ఞానంతో మనం ఎంత ఎక్కువగా మమేకమైతే, అంత నెగటివ్ చర్యల వైపు ఆకర్షితమవ్వడం తగ్గుతుంది. అలాంటి చర్యలు మళ్ళీ మళ్ళీ మనలో దుఃఖం, పశ్చాత్తాపాన్ని నింపి, మన మనస్సు మీద భారాన్ని పెంచుతాయి. అది మనస్సు పై ఆధిపత్యం చెలాయించి మనలను ప్రతికూలంగా మార్చి మన దృఢత్వాన్ని, ఉత్సాహాన్ని కోల్పోయేలా చేస్తుంది. మరియు,  మనసు అయోమయంలో ఉన్నప్పుడు ఒక జ్ఞానబిందువును చదవడం, జీవితంలో ఏదైనా సమస్యకు తలుపు తెరచే కీలక మార్గం కావచ్చు. ఇది ఎప్పుడూ సంతృప్తితో ఉండే, ఇంకేమైనా కావాలని కోరని ఒక స్వేచ్ఛిత మనస్సు స్థితి. అలాంటి మనస్సుకు మంచి భావోద్వేగాలు మాత్రమే ఉంటాయి. సాధారణంగా మన జీవితంలో వచ్చే వివిధ సమస్యల వలన, స్వీయ గౌరవం లోపించినప్పుడు వచ్చే తక్కువతనపు భావనలు లేదా అధిక స్వీయ గర్వం వల్ల వచ్చే అహంభావం నుండి కూడా అటువంటి మనస్సు విముక్తి పొందుతుంది.

 

ప్రతి దృశ్యాన్ని దూరం నుంచి ప్రేక్షకుడిగా చూడండి

 

జీవితం అనేది ఆత్మలు మరియు భౌతిక ప్రకృతి పరస్పర క్రియలతో కూడినది. ప్రతి దృశ్యాన్ని ప్రేక్షకుడిగా చూస్తూ దానిలో చిక్కుకుపోకుండా ఉండటమే ఆధ్యాత్మిక జీవితంలో అత్యంత ముఖ్యమైన పాఠం. ఇది ఒక క్రీడను దూరం నుంచి చూడటం వంటిది. ఆటలో తమ సొంత ప్రదర్శన గురించి భారంగా లేకుండా, ఇతరులు మనకంటే మెరుగ్గా ఆడుతున్నారని ఒత్తిడిపడకుండా ఆనందించడంలా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నాము, జీవితం అనేక దృశ్యాలను చూపిస్తుంది. అవి కొన్ని మధురమైనవి, కొన్ని తక్కువ మధురమైనవి. దృశ్యాలకు ఆకర్షితం కాకుండా వాటిని వాటంతట అవే  దాటిపోయేలా చూసుకుంటూ ముందుకు సాగపోవడమే మన లక్ష్యం. జీవితాన్ని అలా చూడటం వల్ల భావోద్వేగ స్వేచ్ఛ సులభంగా లభిస్తుంది, ఎందుకంటే జీవిత దృశ్యాల రిమోట్ కంట్రోల్ పోవాలనే ఆలోచన చేయటం మనం సాధన చేస్తాము. నిజానికి, మనం అటువంటి రిమోట్ కంట్రోల్ ను పెట్టుకోలేము. జీవిత దృశ్యాలను నియంత్రిస్తూ అవి పూర్తిగా ఎలా ఉండాలో మనం నిర్ణయించలేము. కేవలం మన ఆధ్యాత్మిక వైబ్రేషన్లు మరియు అంతర్గత శక్తి ద్వారానే వాటిపై సాధ్యమైనంత ప్రభావం చూపించగలము.

రికార్డు

22nd May 2025 Soul Sustenance Telugu

భోజనం చేసే ముందు భగవంతునికి ఆహారాన్ని అర్పించడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అలవర్చుకోవల్సిన ఒక అందమైన అలవాటు, భగవంతుని ధ్యానంలో ప్రతి భోజనాన్ని వండడం. అలాగే, ఒక రోజులో

Read More »
21st May 2025 Soul Sustenance Telugu

మీ వాస్తవిక సత్య గుణానికి తిరిగి వెళ్లడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సత్యం మన వాస్తవిక గుణం, కానీ ఎప్పటికప్పుడు మన సౌలభ్యం కోసం లేదా స్వల్పకాలిక లాభాల కోసం అబద్ధాలు చెబుతాము. ఆసక్తికరమైన

Read More »
20th May 2025 Soul Sustenance Telugu

మీ పిల్లలతో తగినంత సమయం గడపకపోవడంపై అపరాధ భావాన్ని అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిబద్ధతలను గౌరవించేటప్పుడు, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత నాణ్యమైన సమయాన్ని ఇవ్వకపోవడం

Read More »