Hin

28th july 2024 soul sustenance telugu

July 28, 2024

ఆధ్యాత్మిక బీజరూపుడైన భగవంతునితో అనుసంధానం

ప్రపంచవ్యాప్తంగా ఆత్మలందరూ గుర్తు చేసుకునే భగవంతుడిని లేదా పరమాత్మను ఒక బీజంగా, అత్యున్నత బిందువుగా, ఆధ్యాత్మిక ధ్రువ నక్షత్రంగా, ఆధ్యాత్మికత మనకు పరిచయం చేస్తుంది. కానీ కాలక్రమేణా, నా మనస్సును, బుద్ధిని వారితో అనుసంధానించే అనుభవంతో, వారు ఒక బీజం, ఒక బిందువు, కానీ వారు ఒక నిర్జీవమైన బీజం కాదని, తమ స్వంత ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో జీవం ఉన్న వారని మనం గ్రహించాము. ఆధ్యాత్మిక సత్యం, అందం, స్వచ్ఛత, ఔదార్యం, ప్రేమ, శాంతి, వినయం, ఆనందం, శక్తి, మధురత, ఇచ్చేటువంటి గుణం వంటి మొదలైన వాటికి ఎవరూ సరిపోలని వ్యక్తిత్వం వారిది. ఇది ఎలా సాధ్యం? మనము సాధారణంగా ఒక విత్తనాన్ని నిష్క్రియాత్మకమైనదిగా లేదా నిద్రాణమైనదిగా భావిస్తాము, దానిలో ఉన్న అపారమైన సంభావ్యత ఉన్నప్పటికీ, దాని కారణంగా అది పూర్తి వృక్షానికి దారితీస్తుంది, పండ్లు, ఇతర ఉత్పత్తులను కలిగి ఉంటుంది. భగవంతుడు మానవ ప్రపంచ వృక్షానికి బీజం. నా చుట్టూ ఉన్న గుణాలను నేను చూసినప్పుడు, వారు దేవతలు, ప్రవక్తలు, సాధువులు మరియు ధర్మ స్థాపకులుగా ఉన్న ఏ మానవ ఆత్మలైనా కావచ్చు లేదా జంతువులు కావచ్చు లేదా ప్రకృతి కావచ్చు కానీ చివరికి ఇది భగవంతుని నుండి వస్తుందని నాకు తెలుసు. కాని భగవంతుడు సర్వవ్యాపి కాదు, అంటే వారు మానవులందరిలో లేదా ప్రకృతిలో లేదా దైవిక ఆత్మలలో ఉండరు. కానీ వారిలో మంచిగా ఉన్నవన్నీ భగవంతునిలో ఉన్న గుణాల నుండి లేదా ప్రాథమికంగా భగవంతుని వ్యక్తిత్వం నుండి వస్తాయి. (పైన వివరించినట్లుగా). ఎందుకంటే వృక్షం అనేది బీజం యొక్క సృష్టి, కాబట్టి వృక్షంలో సానుకూలంగా ఉన్నవన్నీ మూలమైన విత్తనం నుండి బహుశా గతంలో ఎప్పుడైనా సరే వచ్చి ఉంటాయి. కానీ, కనిపించే మంచితనం ఉన్నప్పటికీ; ఈ రోజు, భౌతిక విజయం యొక్క తప్పుడు ముసుగు వెనుక చూస్తే, అశాంతి, దుఃఖం తగ్గినట్లు అనిపించవు, ఇంకా బహుశా పెరిగాయి. మంచితనం చిన్న చిన్న రూపాలలో మాత్రమే ఉంటుంది. అలాంటప్పుడు మనకు ఏది అవసరం?

నన్ను నేను ఆధ్యాత్మికంగా ఉద్ధరించుకోవాలంటే, సృష్టిలో భాగమైన నేను, వృక్షంలో భాగమైన నేను, సృష్టికర్త, బీజరూపుడైన భగవంతుని లోపల ఉన్న సానుకూల శక్తిని పొందాలి. ఈ శక్తి సూక్ష్మమైనది, ఇది భౌతికమైనది కాదు, కానీ ఇది కాంతి వలె ప్రకాశిస్తుంది కూడా, మరియు ధ్యానంలో నేను ఆ ప్రకాశాన్ని గ్రహించగలను. దానిని గ్రహించి, దాని ఆధ్యాత్మిక స్వీకృతి నన్ను నయం చేయగలదని మరియు నన్ను సంపూర్ణంగా చేయగలదని అనుభవం చేసుకోవాలి. ప్రస్తుతం, ఈ అవసరాన్ని గుర్తించి, పరమాత్మ తన వ్యక్తిత్వం యొక్క కాంతిని స్వచ్ఛమైన ఆలోచన మరియు వైబ్రేషన్ల ద్వారా మానవ ప్రపంచ వృక్షంలోకి మునుపెన్నడూ లేనంత ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ, మనల్ని ఆహ్వానిస్తున్నాడు: ఓ ప్రియమైన బిడ్డ, వచ్చి, ధ్యానం ద్వారా లేదా నాతో ఆధ్యాత్మిక సంబంధం ద్వారా నాలో అంతర్లీనంగా ఉన్న గుణాలను గ్రహించి, వాటిని మీ స్వంతం చేసుకుంటూ సత్యత యొక్క వారసత్వాన్ని, మీ జన్మహక్కును మీ కోసం తిరిగి పొందండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

9th feb 2025 soul sustenance telugu

ఇతరులకు నిరంతరం ఇస్తూ ఉండండి (పార్ట్ 2)

సానుకూల శక్తిని ఎప్పటికీ కోల్పోవద్దు వ్యక్తులు మన జీవితాల్లోకి వేర్వేరు, కొన్నిసార్లు వ్యతిరేక సంస్కారాలతో కూడా వస్తారు. తరచుగా, మన ప్రియమైనవారిలో అలాంటి వ్యక్తులు కనిపిస్తారు – భర్త లేదా భార్య, తల్లిదండ్రులు, పిల్లలు

Read More »
8th feb 2025 soul sustenance telugu

ఇతరులకు నిరంతరం ఇస్తూ ఉండండి (పార్ట్ 1) 

ఎమోషనల్ ఓదార్పు మరియు శక్తిని ఇవ్వడం   మన జీవితమంతా మనకు తెలిసిన వ్యక్తులకు మరియు మనకు తెలియని వ్యక్తులకు కూడా సేవ చేస్తాము. ఎందుకంటే ఇవ్వడం, సేవ చేయడం మన సహజ లక్షణాలు.

Read More »
7th feb 2025 soul sustenance telugu

అంతర్గత శాంతి మరియు ఆనందం కోసం ఇంట్లో ఒక పవిత్ర స్థలాన్ని ఏర్పాటు చేసుకోవటం

ధ్యానం కోసం ఇంట్లో ప్రత్యేకమైన, ఉన్నతమైన తరంగాల గది లేదా చోటును ఏర్పర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మనము అంతర్గత శాంతి, ఆనందం కోసం ఉన్నత ఆధ్యాత్మిక శక్తి గల ప్రదేశాలకు వెళ్తాము. మనం మానసికంగా

Read More »