Hin

31st mar 2024 soul sustenance telugu

March 31, 2024

ఆధ్యాత్మిక పురోగతి కోసం రోజువారీ చార్ట్ ఎలా ఉంచాలి?

మన ఆధ్యాత్మిక పురోగతి మరియు అభివృద్ధికి రోజు చివరిలో స్వయాన్ని చెక్ చేసుకోవటం చాలా ముఖ్యం. ఈ విషయంలో 2-3 వ్యక్తిత్వ పాయింట్ల తో రోజువారీ చార్ట్‌ను ఉంచడం మరియు ప్రతి రాత్రి దాన్ని పూరించడం ఉపయోగకరమైన అభ్యాసం. మీరు అవును లేదా కాదు అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవచ్చు లేదా 50% లేదా 90% వంటి శాతాల వారీగా చెక్ చేసుకోవచ్చు. రోజువారీ చార్ట్‌ను ఉంచడానికి మీరు ఎంచుకోగల కొన్ని సాధారణ పాయింట్‌లను మేము క్రింద పేర్కొన్నాము.

రోజంతటిలో, ఈ రోజు; నా మాటలు మరియు చేతలలో మాత్రమే కాదు, నా ఆలోచనలలో కూడా:

  1. నేను ప్రతి ఒక్కరి విశేషతలను చూసానా మరియు స్పష్టమైన బలహీనతలు కనిపించినప్పటికీ, ప్రతి ఒక్కరి పట్ల మంచి భావాలు మరియు శుభాకాంక్షలను కలిగి ఉన్నానా?
  2. చికాకు, విసుగు, పగ, ప్రతీకారం మొదలైన అన్ని రకాల కోపం నుండి నేను దూరంగా ఉన్నానా?
  3. నేను ఇతరులకు దుఃఖాన్ని, బాధను ఇవ్వనని మరియు వారి నుండి తీసుకోననే మాటపై ఖచ్చితంగా ఉన్నానా?
  4. నేను ప్రతికూల మరియు వ్వ్యర్థం నుండి దూరంగా ఉన్నానా?
  5. నేను అహంకారం లేకుండా ఉన్నానా లేదా వినయంగా ఉన్నానా?
  6. నేను, కీర్తి, ప్రశంసలు మరియు అవమానాలచే ప్రభావితం కాకుండా ఉన్నానా?
  7. నేను స్థిరంగా ఉన్నానా మరియు జీవితంలో మార్పులకు ప్రభావితం కాకుండా ఉన్నానా?
  8. నేను తీర్పులు, విమర్శలు, అసూయ, పోల్చటం, ద్వేషం మొదలైన వాటికి దూరంగా ఉన్నానా?
  9. నేను కలిసిన ప్రతి ఒక్కరికీ సేవ చేయాలనే స్పృహ కలిగి ఉన్నానా?
  10. నేను 8 ప్రధాన శక్తులను ఆచరణలోకి తెఛ్చి శక్తివంతంగా అనుభవం చేసుకున్నానా?
  11. నేను ఆత్మగౌరవంతో ఉండి అందరికీ గౌరవం ఇచ్చానా?
  12. నేను చేతలలో మరియు పరస్పర చర్యలలో ఆత్మిక స్పృహతో ఉండడాన్ని అభ్యసించానా?
  13. నా మనస్సులో ఆలోచనల రాకపోకలను పరిశీలించుకొని, మెడిటేషన్ తో వాటిని నియంత్రించడానికి నేను ప్రతి గంటకు ఒక నిమిషం విరామం తీసుకున్నానా?

 

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »