Hin

21st october 2024 soul sustenance telugu

October 21, 2024

ఆధ్యాత్మిక ప్రకంపనలతో భోజనం తయారుచేసి స్వీకరించడం(పార్ట్ 1)

అమ్మా, ఈ రాత్రి భోజనానికి ఏం చేస్తావు? దయచేసి ఏదైనా రుచికరమైన వంటకం చేయండి! అని పిల్లలు తరచుగా తమ తల్లులకు తమ భోజనం కోసం మెనూని చెప్తారు. తల్లులు తమ వంట పనిని పూర్తి చేయడానికి ఆతురుతలో ఉంటారు. వారి పిల్లలు మరియు ఇతర కుటుంబ సభ్యుల అభిరుచులను తీర్చడానికి కూడా ఆసక్తిగా ఉంటారు. కూరగాయలు, ఉప్పు, మసాలా దినుసులు, నూనె, పప్పుధాన్యాలు, గోధుమ పిండి మరియు బియ్యం వంటి వారి భోజనంలోని అతిచిన్న వివరాలపై తరచుగా తమ శక్తిని వెచ్చిస్తారు. ఆ తరువాత వారు రోజు చివరిలో విశ్రాంతి తీసుకుంటారు. వారు పొరపాటుకు అవకాశం ఇవ్వకుండా సరైన విధంగా ఆహారాన్ని తయారు చేసేలా చూసుకుంటారు. ప్రతి ఒక్కరి అభిరుచులను సంతృప్తి పరచడం మరియు కుటుంబం నుండి ఆశీర్వాదాలను కూడా పొందడమే లక్ష్యంగా ఉంటుంది.   ఈ కుటుంబ నేపధ్యంలో ఈ సానుకూల భావన ఉన్నప్పటికీ, ప్రతికూల సూక్ష్మ శక్తులు కొన్నిసార్లు ఆహారాన్ని ఆధ్యాత్మికంగా శక్తివంతం చేయక పోయినా అవి తినడానికి చాలా రుచికరంగా ఉండవచ్చు.

 

ప్రేమతో నిండిన ఆహారం, స్వచ్ఛమైన శక్తితో నిండిన ఆహారం ఆరోగ్యకరమైనది, అనారోగ్యాలను నయం చేయడమే కాకుండా ఆధ్యాత్మికంగా, భావోద్వేగపరంగా మరియు మానసికంగా కూడా ఉపశమనం కలిగిస్తుంది. భౌతిక శరీరం మరియు భౌతికం కాని మనస్సు మధ్య ఉన్న సూక్ష్మ సంబంధం కారణంగా ఇవి రెండూ ఒకదానికొకటి ప్రభావితం చేస్తాయి. పనిమనిషి వండిన ఆహారం కంటే తల్లి వండిన ఆహారం ఎలా రుచిగా ఉంటుందో మీరు వింటూ ఉంటారు. ఎందుకు?  ప్రయోజనం(పర్పస్)  యొక్క స్వచ్ఛత కారణంగా. భోజనం వండేటప్పుడు తల్లి తన కుటుంబం ప్రేమలో మునిగిపోతుంది కానీ పనిమనిషి పని చేసి సంపాదించడానికి వంట చేస్తుంది, ఇది ఆమెకు  కొన్నిసార్లు కష్టంగా అనిపించవచ్చు. తల్లి అధిక ప్రయోజనంతో వంట చేస్తుంది, ఇది ఆహార నాణ్యతను మరియు దాని ప్రతి ముద్దలో అదృశ్య శక్తిని ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఆహారాన్ని స్వచ్ఛమైన ప్రేమతో, ఎటువంటి ఆధారపడని, మోహము లేదా భయం లేని మరియు సానుకూలతతో నిండిన ప్రేమతో వండాలి.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

18th july 2025 soul sustenance telugu

స్వీయ సందేహం మరియు అభద్రతలను అధిగమించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆనందాన్ని క్షీణింపజేసి, మనకు నిరాశ కలిగించే ఒక భావోద్వేగం – అభద్రత. మన గురించి, మన సంబంధాలు, ఆరోగ్యం, ఆర్థికం

Read More »
17th july 2025 soul sustenance telugu

ఇదే సరైన సమయం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మీరనుకున్న మార్పును తీసుకురావడానికి లేదా అసంపూర్ణంగా ఉన్న పనిని పూర్తి చేయడానికి ఏది సరైన సమయం? నేను నూతన సంవత్సరంలో ప్రారంభిస్తాను…

Read More »
16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »