Hin

23rd october 2024 soul sustenance telugu

October 23, 2024

ఆధ్యాత్మిక ప్రకంపనలతో భోజనం తయారుచేసి స్వీకరించడం(పార్ట్ 3)

మాంసాహారం, మద్యం, పొగాకు, ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి వంటి కొన్ని తామసిక ఆహారాల యొక్క బలహీనమైన సూక్ష్మ శక్తి ఆత్మ శుద్దీకరణకు అడ్డంకిగా అవుతుంది. ఇది మన జీవిత లక్షాన్ని, శరీరాన్ని శక్తిహీనంగా చేస్తాయి. కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ ఆహారాలు మనస్సును ఆందోళనగా మరియు ఆవేశంగా చేస్తాయి. కామము, దురాశ, మొహం, అహం, అసూయ మరియు ద్వేషం వంటి ఇతర ప్రతికూల ఎమోషన్స్ ప్రభావంలోకి కూడా మనస్సును తీసుకువస్తాయి. ధ్యానం ద్వారా ఈ ఆహారాలను శుద్ధి చేసి తినమని మీరు చెప్పవచ్చు. ఈ ఆహారాలు శరీరంపై కొన్ని సానుకూల ప్రభావాలను చూపుతాయని వైద్య శాస్త్రం తెలిపినప్పటికీ, ఈ ఆహారాలకు స్వచ్ఛమైన ఆధ్యాత్మిక శక్తిని ఇవ్వడం వల్ల వాటి అసలైన తామసిక స్వభావాన్ని మార్చదు, శక్తి స్థాయిలో మనస్సు మరియు శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపకుండా నిరోధించదు. 

అలాగే, మీ భోజన పదార్థాల గురించి ఎంపిక చేసుకొని సరైన వంటకాలను ఉపయోగించడంతో పాటు, వంట చేసేటప్పుడు మరియు భోజనం స్వీకరించేటప్పుడు ఉన్నతమైన ఆధ్యాత్మిక స్మృతిలో ఉండటం చాలా ముఖ్యం. సానుకూలమైన మరియు శాంతియుతమైన ఆలోచనలను సృష్టించడం ద్వారా లేదా కొన్ని శాంతియుతమైన ఆధ్యాత్మిక పాటలను మ్రోగించడం  ద్వారా లేదా వంట చేసేటప్పుడు మరియు ఆహారం తినేటప్పుడు ఉపశమనకరమైన మెడిటేషన్ మ్యూజిక్ మ్రోగించడం ద్వారా కూడా ఇది చేయవచ్చు. ఇది ప్రతి ఒక్కరికీ భగవంతునితో ఉన్న అనుబంధాన్ని మరియు వారి కుటుంబ సభ్యుల పట్ల స్వచ్ఛమైన ఆధ్యాత్మిక ప్రేమను గుర్తు చేయిస్తుంది. టీవీ చూస్తున్నప్పుడు, వార్తాపత్రిక చదువుతున్నప్పుడు లేదా మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు ఆహారం తీసుకోకూడదు. అలాగే, ఏదైనా ఆహార పదార్థం లేదా నీటిని తినే ముందు, ఆధ్యాత్మిక సంకల్పం యొక్క శక్తివంతమైన ఆలోచనను సృష్టించడంలో కొన్ని సెకన్ల సమయం గడపి మీ దృష్టిని ఆ వస్తువుపై కేంద్రీకరించండి. ఈ విధంగా, ఆహారం లేదా ద్రవం మీ కళ్ళ ద్వారా సానుకూల ఆధ్యాత్మిక శక్తితో ఛార్జ్ చేయబడుతుంది. భౌతిక మరియు ఆధ్యాత్మిక స్థాయిలో దాని ప్రతికూల స్వభావం నాశనం చేయబడుతుంది. మీరు ఆహారమే  మీ స్వభావం అవుతుందని గుర్తుంచుకోండి. మీ ఆలోచనలు మీరు తినే శక్తితో నిండిన ఆహారం యొక్క ప్రత్యక్ష ప్రతిబింబం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »