Hin

25th dec 2024 soul sustenance telugu

December 25, 2024

ఆధ్యాత్మిక స్మృతిలో క్రిస్మస్ జరుపుకోవడం

క్రిస్మస్ (డిసెంబర్ 25) ఆనందం మరియు ఉత్సాహంతో కూడిన కాలం, ఇది ప్రేమ మరియు క్షమాపణలను ప్రసరింపజేసే సమయం కూడా. ఇతరులను క్షమించడం మనకు ఎందుకని చాలా కష్టం అవుతుంది? కొన్నిసార్లు, అది జరిగిన సంవత్సరాల తరువాత కూడా, వారు క్షమాపణ చెప్పిన తరువాత కూడా, మనం వారిని ఎందుకు క్షమించలేకపోతున్నాము? మన బాధకు మనం వారిని బాధ్యులుగా చేసి, మనల్ని మనం నయం చేసుకోనందున బాధ పెట్టుకుంటూనే ఉంటాము. మన మనస్సులో ఆ క్షణాన్ని మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటూ, మనల్ని మనం భావోద్వేగపరంగా బాధించుకుంటూ, వారి తప్పులకు మనల్ని మనం శిక్షించుకుంటాము. ఎవరినైనా క్షమించడం అంటే ఆ వ్యక్తిని లేదా ఆ వ్యక్తితో మరియు మనతో సంబందించిన ఆ పరిస్థితిని మన మనస్సులో ప్రతికూలంగా జీవించడానికి అనుమతించకూడదు. వారు చేసిన దానికంటే ఎక్కువ కాలం మనం మనకు హాని చేసుకున్నామని మనము అర్థం చేసుకున్నాము. కొత్త సంవత్సరంలోకి మన గాయాలను మోయకూడదు. వారు మనకు హాని చేసారు, కానీ మనమే బాధను సృష్టించుకున్నాం మరియు మనల్ని మనం నయం చేసుకోగలం. నన్ను నేను క్షమించుకొని, వారిని క్షమిస్తే, కర్మ ఖాతా ముగుస్తుంది. 

క్రిస్మస్ చెట్టు మానవత్వాన్ని సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు జీవనం, పోషణ మరియు తాజాదనాన్ని సూచిస్తుంది. గతంలో మనమందరం శాంతి, ప్రేమ, సత్యం అనే ఒకే మతంలో ఐక్యంగా ఉన్నామని ఆ చెట్టు యొక్క కాండము మనకు గుర్తు చేస్తుంది. మనము తరువాత శాఖలుగా వేర్వేరు మతాలుగా విభాగించబడ్డాము. అలానే ప్రతి మతం కొమ్మలు మరిన్ని శాఖలుగా విడిపోయాయి. ఆకులు ది ట్రీ ఆఫ్ హ్యుమానిటీ(మానవత్వం అనే చెట్టు) యొక్క ఆత్మలకు సరిపోలే విధంగా ఉంటాయి. పైన ఉన్న షైనింగ్ స్టార్ భగవంతుడిని లేదా సర్వోన్నతమైన పరమాత్మను సూచిస్తుంది. క్రిస్మస్ చెట్టును అలంకరించడం ఆత్మను కరుణ, ప్రేమ మరియు సత్యంతో అలంకరించుకోవడానికి మనకు స్ఫూర్తినిస్తుంది. చెట్టు మీద ఉన్న దీపాలు ఆత్మను ఆధ్యాత్మిక జ్ఞానంతో ప్రకాశింపజేయమని గుర్తు చేస్తాయి. మసి కప్పబడిన చిమ్నీ గుండా వచ్చే శాంటా క్లాజ్, ఈ చీకటి కాలంలో మానసికంగా కలుషితమైన ప్రపంచంలోకి మనం ప్రతిరోజూ వారిని అడిగే బహుమతులను ఇవ్వడానికి వచ్చే సర్వోన్నతుడైన గాడ్ ఫాదర్ (పరమపిత)ను  సూచిస్తుంది. స్వచ్ఛత, ఐక్యత, ప్రేమ మరియు శాంతి ఆ బహుమతులు. ఏంజెల్స్ ను ఆహ్వానించడం నుండి ఏంజెల్ గా మారడం వైపు మళ్లుదాం. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, యజమాని, స్నేహితుడు లేదా దారిలో అపరిచితుడి పాత్రను పోషిస్తున్న ఏంజెల్ గా మారడం. మనం ప్రేమ, ఆనందాన్ని కోరుకోవడం నుండి ప్రతి ఒక్కరికీ బేషరతుగా ఇవ్వడానికి మారినప్పుడు, మనం ఆత్మలను మరియు ప్రపంచాన్ని నయం చేసి, శక్తివంతం చేస్తాము. ప్రపంచం వెతుకుతున్న ఏంజెల్ అవ్వండి.

రికార్డు

14th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మానవాత్మలం అనగా మొదట ఆత్మలం, ఇది మన ఆధ్యాత్మిక గుర్తింపు. మనం మన భౌతిక శరీరం ద్వారా మన పాత్రను

Read More »
13th july 2025 soul sustenance telugu

ప్రతికూలంగా నియంత్రించడం మానేయండి మరియు సానుకూలంగా ప్రభావితం చేయడం ప్రారంభించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సంబంధాల ద్వారా ప్రభావితం చేయడం యొక్క శక్తి అతిశయమైనది, కానీ మనం నియంత్రణ మరియు బలవంతం చేయడానికి ప్రయత్నించినప్పుడు అది తప్పకుండా 

Read More »
12th july 2025 soul sustenance telugu

ఏదైనా కార్యాన్ని ప్రారంభించే ముందు మౌన శక్తి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన పనులను ప్లాన్ చేసేటప్పుడు, వ్యక్తులు, సమయం, నైపుణ్యాలు లేదా అవసరమైన డబ్బు వంటి బాహ్య వనరులను మనం ఏర్పాటు చేసుకుంటాము.

Read More »