Hin

17th nov 2023 soul sustenance telugu

November 17, 2023

ఆధ్యాత్మిక బలంతో ప్రతికూల పరిస్థితులను దాటడం (పార్ట్ 1)

మన జీవితంలోని ఒక ముఖ్యమైన మరియు ప్రముఖ పాత్ర పోషించే క్షేత్రము మనం వద్దన్నా మరో దిశ వైపుకు వెళ్తూ ఉంటుంది – మన మానసిక ఆరోగ్యాన్ని చూసుకునే విధానము, అది మన ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తుంది తద్వారా మనం చేసే కర్మలు. ఉదా: ఈరోజు మనం మంచి మూడ్‌లో ఉన్నామనుకోండి, ఆటోమేటికుగా మన కర్మలపై మన మంచి మూడ్ యొక్క ప్రభావం పడుతుంది, ఆ ప్రభావం మన చేతల్లో కూడా కనిపిస్తుంది. అలాగే, ఒకవేళ ఏదైనా కష్టం అకస్మాత్తుగా మనకు ఎదురైతే మన మనసు ప్రతికూల దిశ వైపుకు వెళ్తుంది, అప్పుడు ఆటోమేటికుగా మన కర్మలు కూడా ప్రతికూలంగానే ఉంటాయి.

ఈ ప్రక్రియ జరగకుండా మనం ఆపగలమా? కష్టాలు, ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంలోకి మనస్సు రాకుండా నిరోధించడానికి అనుసరించాల్సిన ఏకైక ఉత్తమ పద్ధతి ఏది? ఈ పూర్తి ప్రక్రియ మొదట్లోనే మనస్సు స్థాయిలోనే ఆగిపోయేలా మన మనస్సు కోసం మనం ఉపయోగించగల ఏదైనా పద్ధతి ఉందా? ఉదాహరణకు, ఈరోజు మీకు ఆరోగ్యం సరిగా లేదనుకోండి. ఇది ఒక రకమైన ప్రతికూల పరిస్థితి. మరో రోజు, ఆఫీసులో మీ బాస్ మీతో సరిగా వ్యవహరించలేదనుకోండి, ఆరోజు మీ ఆఫీసు వాతావరణంతో మీరు సౌకర్యంగా ఉండరు. ఇది మరో రకమైన ప్రతికూల పరిస్థితి. జీవితంలో ఇలాంటి ఒడిదుడుకులు సర్వసాధారణం పైగా అవి అడుగడుగునా ఉంటూనే ఉంటాయి, కానీ అవి మనం ప్రవర్తించే విధానాన్ని నిర్దేశించాలా లేక వాటి వల్ల మన సాధారణ దినచర్యకు మరియు వ్యక్తులతో మనకున్న వ్యవహారాలకు అంతరాయం కలగకుండా చూసుకోవాలా? వాస్తవానికి, ఎవరూ తమపై భారం పడకూడదనే అనుకుంటారు, అయితే అదే సమయంలో పరిస్థితులను కూడా సానుకూలంగా ఎదుర్కోవాలి. కానీ శ్రద్ధ వహించాల్సిన ప్రధాన విషయం ఏమిటంటే, అలా చేస్తున్నప్పుడు, మీరు మీ అంతర్గత స్థిరత్వాన్ని కోల్పోకుండా, మీ చర్యలు సానుకూలంగా మరియు శాంతి, ప్రేమ, ఆనందాలతో నిండి ఉండాలి.

(రేపు కొనసాగుతుంది)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు విజయం అంటే మన జీవతపు క్వాలిటి పెరగడం. మనం ఖరీదైన కారు,  ఖరీదైన బట్టలు కొనుగోలు చేసి  గర్వపడతాము. కొన్నిసార్లు ఈ

Read More »
28th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మనకు మరియు ఇతరులకు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో ప్రయోజనం చేకూర్చే పనులు చేసే ప్రత్యేకమైన వారము. ఉద్యోగంలో, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు,

Read More »
27th april 2025 soul sustenance telugu

మీ సంతోషాల గురించి మాట్లాడండి, బాధల గురించి కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన జీవితంలో ఎన్ని మంచి విషయాలు జరిగినా, మంచి మరియు సానుకూల విషయాలకు బదులుగా మన ఆరోగ్యం, ఆర్థిక, సంబంధాలు మరియు

Read More »