18th Nov 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

November 18, 2023

ఆధ్యాత్మిక బలంతో ప్రతికూల పరిస్థితులను దాటడం (పార్ట్ 2)

జీవితంలో వచ్చే రకరకాల పరిస్థితులు, కష్టాలు మన ఉత్సాహాన్ని తగ్గించి మనల్ని ఆంతరికంగా బలహీనపరుస్తాయి. జీవితం కష్టంగా, కఠినమైన ప్రయాణంగా మారుతుంది. ఇటువంటి సమయంలోనే అనేక లాభాలు కలిగి ఉన్న ఆధ్యాత్మికత మనకు ఎంతో అద్భుతంగా సహకరిస్తుంది.  ఆధ్యాత్మికత అనేది మాటలు మరియు కర్మల స్థాయిలో మాత్రమే కాకుండా, ఆలోచనలు, భావాలు మరియు భావోద్వేగాల యొక్క మరింత సూక్ష్మ స్థాయిలో కూడా మిమ్మల్ని మీరు ఎలా పరిపాలించుకోవాలో నేర్చుకునే పద్థతి. క్లిష్ట పరిస్థితి మన ముందు ఉన్నప్పుడు మన ప్రతికూల మరియు అనవసరమైన ఆలోచనలకు బ్రేక్ వేసే శక్తిని మరియు కళను ఇది మనలో నింపుతుంది.  ఈరోజు నుండి కోప్పడను, నేను ప్రేమ, వినయంతో వ్యవహరిస్తాను అని అంటూనే కొంత సమయం తర్వాత తిరిగి ప్రతికూలత వైపుకు వెళుతూ చెడును అణచిపెట్టుకునే ప్రక్రియ కాదు ఇది. ఇందుకు భిన్నంగా, మీ ప్రతికూల భావోద్వేగాలను సానుకూలతలోకి పరివర్తన చేసుకుంటూ, స్వయాన్ని పరమాత్మతో కనెక్ట్ చేసుకుంటూ స్వయంలో ఆధ్యాత్మిక శక్తిని నింపుకోవడము. ఈ కనెక్షన్‌ను ఆధ్యాత్మిక పరిభాషలో మెడిటేషన్ అంటారు.

ఇది కేవలం ఆలోచనల సంఖ్యను తగ్గించుకోవడం మాత్రమే కాదు, కష్టకాలంలో ప్రతికూల ఆలోచనలను సరైన మరియు సానుకూల ఆలోచనలతో భర్తీ చేయడం. కాబట్టి, ఆధ్యాత్మికత అనేది కేవలం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మాత్రమే ఇవ్వడమే కాదు, మన ఆలోచనా విధానాన్ని మరియు ప్రవర్తనను మార్చుకోగల సామర్థ్యాన్ని ఇస్తుంది. గుర్తుంచుకోండి, మారవలసినది మన వ్యక్తిత్వం. మన వ్యక్తిత్వం ద్వారా ప్రభావితమయ్యే ఆలోచనలు మరియు భావాలు కూడా ఈ మార్పు వలన ఆటోమేటిక్‌గా మారుతాయి.

(రేపు కొనసాగుతుంది)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

మెడిటేషన్ లో చేయవలసిన మరియు చేయకూడని 10 అంశాలు (పార్ట్ 2 )

ఆత్మానుభూతి పొందుతూ కర్మలలో ఆత్మానుభూతి చేసుకోవడం – మెడిటేషన్ కు ముఖ్యమైన పునాది ఆత్మ యొక్క స్పృహ ఉండడం. స్వయాన్ని ఆత్మగా అనగా జ్యోతి స్వరూపంగా భావిస్తూ, ఆత్మ యొక్క నిజగుణాలను అనుభూతి చేసుకోవడం.

Read More »
2nd Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

మెడిటేషన్ లో చేయవలసిన మరియు చేయకూడని 10 అంశాలు (పార్ట్ 1)

ఒక పాజిటివ్ ఆలోచనతో మీ మెడిటేషన్ ను ప్రారంభించండి – మెడిటేషన్ ప్రారంభించే ముందు, మీరు స్వచ్ఛమైన మరియు ప్రశాంతమైన జీవి అని మరియు సర్వ గుణాల, శక్తుల సాగరుడైన భగవంతుడు మీ తండ్రి

Read More »
1st Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

మీ ఆనందాన్ని వాయిదా వేయకండి

మనం ప్రతి క్షణం ఆనందంగా ఉండాలనుకుంటాము. అయినప్పటికీ, ఏదైనా కావాల్సినది జరిగే వరకు ఆ ఆనందాన్ని వాయిదా వేయడానికి మన మనస్సును ప్రోగ్రామింగ్ చేశాం. తద్వారా మనం మన మనుసును షరతులతో కూడినదిగా చేస్తాము.

Read More »