Hin

19th nov 2023 soul sustenance telugu

November 19, 2023

ఆధ్యాత్మిక బలంతో ప్రతికూల పరిస్థితులను దాటడం (పార్ట్ 3)

కష్టాలు మన మనసుపై ఎక్కువ ప్రభావం చూపకముందే మనం వాటిని అధిగమించాలి. పరిస్థితులను ఆనందంగా ఓర్చుకోండిగానీ బాధతో కాదు అని అందుకే అంటారు. పరిస్థితుల ఒత్తిడి మనసుపై ప్రతికూల ప్రభావాన్ని చూపి మన ఆలోచనా విధానాన్ని కూడా మారుస్తాయి, ఎంతగా అంటే ఆ పరిస్థితికి సంబంధించిన ఆలోచనల నుండి మనసును మరల్చలేకపోతాం. గత నాలుగు రోజులుగా మా ఆఫీసులో నా సహోద్యోగితో జరిగిన వాదనను నేను మర్చిపోలేకపోతున్నాను అని ఒకరు అంటారు. మరొకరు, ఈరోజు ఉదయం మా దగ్గరి బంధువు మరణ వార్త విన్నప్పటి నుండి నాకు బాధగా ఉంది అంటారు.  ఇది దాదాపు సహజ స్వభావం లాంటిది కాదా? ఒక కష్టం వచ్చినప్పుడు నాకు అదోలా ఉంది అంటాం, అదోలా ఉండటం ఎల్లప్పుడూ ప్రతికూలంగానే ఉంటుంది.

కాబట్టి సానుకూలంగా ఉండటానికి మరింత సరైన లేదా మరింత సహజమైన స్వభావం కోసం నేను ఎలా శిక్షణ పొందగలను? అది అనుభవంతో, కొంత కాల వ్యవధిలో వస్తుంది. మనం ఎదుర్కొనే ప్రతి క్లిష్ట పరిస్థితుల్లోనూ స్థిరత్వాన్ని పాటించాలి. చుక్కాని లేని ఓడ దిశను కోల్పోయి కఠినమైన సముద్రంలో మునిగిపోతుంది, ఆధ్యాత్మిక శక్తి అనే చుక్కాని ప్రతికూల పరిస్థితులను సులభంగా దాటడానికి మనకు సహాయపడుతుంది. నేను శక్తివంతుడిని అని అంటూనే ప్రతికూలంగా ఆలోచించే తప్పును పునరావృతం చేయడం కాదు. ధ్యానం యొక్క విధానం ద్వారా ఆత్మలో శక్తిని నింపకపోతే, మనం సానుకూలంగా మారాలని మరియు ప్రతికూలతకు దూరంగా ఉండాలని చాలా నిశ్చయించుకున్నప్పటికీ, మనం ఎప్పటికీ సానుకూలంగా ఆలోచించే వ్యక్తులుగా మారలేము. మనస్సులోని శక్తి విశ్వాసం, ఓర్పు, దృఢత్వం, సహనం మరియు స్థిరత్వం యొక్క సానుకూల సంస్కారాలను కూడా సృష్టిస్తుంది, ఇది ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మనకు సహాయపడుతుంది. ఫలితంగా, మనం ప్రతి ప్రతికూల పరిస్థితిని సులభంగా మరియు తేలికగా దాటగలం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

11th feb 2025 soul sustenance telugu

పునర్జన్మ అనేది వాస్తవమేనా ? 

మనమందరం ఆధ్యాత్మిక జీవులం లేదా ఆత్మలం, మన శరీరాల ద్వారా మన పాత్రలను పోషిస్తున్నాము. మన స్వభావం లేదా సంస్కారాల ఆధారంగా మన ఆధ్యాత్మిక ఆలోచనలు, మనం విజువలైజ్ చేసేది, ప్రవర్తించేది వేర్వేరుగా ఉంటాయి. 

Read More »
10th feb 2025 soul sustenance telugu

ఇతరులకు నిరంతరం ఇస్తూ ఉండండి (పార్ట్ 3)

మీ మంచితనాన్ని ఉపయోగించుకోండి లేదంటే కోల్పోతారు  వారి సానుకూల శక్తులను ఉన్నతొన్నతమైన మూలం లేదా భగవంతుడు నింపే వ్యక్తులకు ఇచ్చే వ్యక్తిత్వం సహజంగా వస్తుంది. లేకపోతే ఇవ్వడం చాలా కష్టం అవుతుంది. ఇతరులకు సేవ

Read More »
9th feb 2025 soul sustenance telugu

ఇతరులకు నిరంతరం ఇస్తూ ఉండండి (పార్ట్ 2)

సానుకూల శక్తిని ఎప్పటికీ కోల్పోవద్దు వ్యక్తులు మన జీవితాల్లోకి వేర్వేరు, కొన్నిసార్లు వ్యతిరేక సంస్కారాలతో కూడా వస్తారు. తరచుగా, మన ప్రియమైనవారిలో అలాంటి వ్యక్తులు కనిపిస్తారు – భర్త లేదా భార్య, తల్లిదండ్రులు, పిల్లలు

Read More »