Hin

17th dec 2023 soul sustenance telugu

December 17, 2023

ఆధ్యాత్మికత సహాయంతో జీవితంలోని ప్రతి క్షేత్రంలో విజయం

జీవితంలోని ఐదు ప్రధాన రంగాలు – మనస్సు, శరీరం, సంబంధాలు, పాత్రలు మరియు సంపద. జీవితంలో ముందుకు సాగుతున్నకొద్దీ కొన్నిసార్లు ఈ ఐదు రంగాలలో మనం అలజడులను చవిచూస్తుంటాం. వ్యర్థ ఆలోచనలు మనసును ఆవరించినప్పుడు, సానుకూల సంకల్పాలు తగ్గినప్పుడు మన ఈ జీవిత ప్రయాణంలో అసంతృప్తి చోటు చేసుకుంటుంది. ఏది ఏమైనా కానీ మనం నిత్యం సంతృప్తిగా ఉండటానికి అవసరమైన 5 మార్గాలను చూద్దాం. ఇదే జీవితంలోని నిజమైన విజయం.

  1. సానుకూలత అనే ఫుల్‌స్టాపును పెట్టండి – నిజమైన విజయం అంటే మీరు వ్యవహరించే పరిస్థితి మరియు వ్యక్తికి అనుగుణంగా సానుకూల ఆలోచనలను సృష్టించగల సామర్థ్యం. మన బుద్ధిలో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానం నుండి సరైన పాయింటును ఎంచుకుని దానిని మనసులో పెట్టుకుంటే అది ఆ ప్రతికూల పరిస్థితిలో మనం సంతృప్తిగా ఉండేలా చేస్తుంది.
  2. పరిస్థితి వచ్చినప్పుడు భగవంతుడిని ఆహ్వానించి వారిని పరిష్కారం అడగండి – మనసు గందరగోళంగా ఉంటే, కొద్ది క్షణాలు భగవంతుడితో ప్రశాంతంగా మాట్లాడండి, పరిస్థితి గురించి వారికి వివరించండి, వారిని పరిష్కారం అడగండి. అందరికంటే తెలివైనవారు పరమాత్మ, అన్ని సమస్యలకు పరిష్కారాలు వారి వద్ద ఉంటాయి, వారు మనసును నిదానపరిచి సంతృప్తిగా ఉండేలా చేస్తారు.
  3. ఓర్పుతో సానుకూల భవిష్య వాస్తవాన్ని తయారు చేసుకోండి – జీవితం పరీక్ష హాలువంటిది. అక్కడ మనం ప్రతిరోజూ కూర్చుంటాం, మనకు జీవితం అనేక పరీక్ష పేపర్లను లేక పరిస్థితులను ఇస్తుంటుంది. ప్రతి పరీక్షను సంతృప్తి అనే భావనతో పాస్ అవ్వాలంటే జీవిత నాటకరంగం మనకు సానుకూల వాస్తవాన్ని సృష్టించి ఇచ్చేవరకు ఓర్పుతో ఉండాలి.
  4. మీ లోపలకు వెళ్ళి పరిస్థితిని నిర్లిప్త ప్రేక్షకుడిగా పరిశీలించండి – మన జీవితం ఎప్పుడూ ఒకేలా జరగదు, ఇందులో ఊహించనివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ప్రతి పరిస్థితిని నిర్లిప్త ప్రేక్షకుడిలా ఉండి చూడటం చాలా ముఖ్యం, ఎందుకంటే మనలోని మానసిక మరియు భావోద్వేగ శక్తిని ఎంతగానో సంరక్షిస్తూ మనల్ని తృప్తిగా, తేలికగా, చింతలు లేకుండా చేస్తుంది.
  5. రోజంతా మధ్య మధ్యలో ‘నా సమయం’ విరామాలను తీసుకోండి – జీవితంలోని అనేక రంగాలలో వచ్చే కష్టాలను అధిగమిస్తూ సంతోషంగా ఉండాలంటే రోజంతా మధ్యమధ్యలో ‘నా సమయం’ అనే విరామాలను తీసుకుంటూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి, జీవితంలో చేసే పనులలో అతిగా మునిగిపోకూడదు, అలా చేస్తే అది ఒక్కోసారి మనల్ని అలసటకు, అసంతృప్తికి గురి చేస్తుంది.  

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

8th october 2024 soul sustenance telugu

ఆలోచనలపై ప్రతికూల ప్రభావాలను అధిగమించడం (పార్ట్ 1)

మన ఆలోచనలు వివిధ రకాలు, వివిధ తీవ్రతలను కలిగి ఉంటాయి. వాటి సంఖ్య  కూడా మెలకువగా ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఆ నిర్దిష్ట సమయంలో మనం ఏ చర్య చేస్తున్నాం లేదా

Read More »
7th october 2024 soul sustenance telugu

వైఫల్యాలను సులభంగా అంగీకరించడం

మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు విఫలమవుతాము అనేది జీవితంలో ముఖ్యమైన పాఠాలలో ఒకటి. మనం వైఫల్యాలు, లోపాలను మన ప్రయాణంలో భాగంగా పరిగణించి అంగీకరించాలి. మనలో చాలా మంది జీవితంలో వైఫల్యాలకు భయపడతాము .

Read More »
6th october 2024 soul sustenance telugu

నిర్లిప్తంగా ఉండి, గమనించి మరల్చుకోండి

మన జీవితాలు ఎప్పటికప్పుడు వివిధ రకాల పరిస్థితులతో నిండి ఉంటాయి. మనం తరచుగా పరిస్థితుల వల్ల ప్రతికూలంగా ప్రభావితమవ్వడంతో మన ఆంతరిక శక్తి తగ్గుతుంది. నిర్లిప్తంగా ఉండి, గమనించి మరల్చుకోవటం అనేది ఆధ్యాత్మికత యొక్క

Read More »