Hin

28th feb 2024 soul sustenance telugu

February 28, 2024

ఆగండి – ఎంచుకోండి – స్పందించండి

బయటి నుండి మనకు వస్తున్నవి, మనం బయటకు పంపుతున్నవి కొన్ని ఉంటాయి. పరిస్థితులు మరియు వ్యక్తులు బయటి నుండి వస్తారు, కాబట్టి వారి నుండి మనం పొందేది మన నియంత్రణలో ఉండదు. కానీ ప్రతిస్పందనగా, మన నుండి ఏమి బయటకు వస్తాయో – మన ఆలోచనలు, మాటలు మరియు ప్రవర్తన ఎల్లప్పుడూ మన ఎంపిక. మనకు నిందించే అలవాటు ఉన్నందున మన సంతోషం, కోపం, బాధ లేదా భయానికి ఎవరో కారణమని అనుకుంటాము. అలాగే మన స్పందనను ఆంతరికంగా సృష్టిస్తామని  కూడా మనకు తెలియదు. ఈ రోజు శాంతి, ప్రశాంతత మరియు ఆనందంతో స్పందించాలని ఉద్దేశపూర్వకంగా ఎంచుకుందాం. ఎవ్వరూ మన భావోద్వేగాలను సృష్టించలేరు లేదా మనకు ఒక నిర్దిష్ట అనుభూతిని కలిగించలేరు. మనం వాటిని సృష్టిస్తాము కానీ మనం ఎలా భావిస్తున్నామో దానికి ఇతరులు బాధ్యులని తప్పుగా నమ్ముతాము. ఏ భావోద్వేగమూ ఖచ్చితమైనదిగా ఉండదు అలాగే ఏ ప్రతిస్పందన సహజంగా రాదు. మన ఆలోచనలు, భావాలు మరియు ప్రవర్తనకు వ్యక్తిగత బాధ్యత తీసుకుందాం. అతను నాకు అన్యాయం చేసాడు కాబట్టి నేను కలత చెందటం ఖచ్చితం, ఆమె ప్రవర్తన నాకు కోపం తెప్పించింది అనే మాటలు మన పదజాలంలో ఉండకూడదు.

 

మన పరిస్థితులు మన ఆనందాన్ని నిర్ణయించవు; పరిస్థితికి మన ప్రతిస్పందన దానిని నిర్ణయిస్తుంది. మన మనస్సు సృష్టించే ఆలోచనలతో ప్రతిస్పందన ప్రారంభమవుతుంది. రోజును ప్రారంభించడానికి మంచి ఆలోచనలతో మనస్సుకు ఆహారం ఇవ్వడం సారవంతమైన ప్రదేశంలో ఆరోగ్యకరమైన విత్తనాలను నాటడం లాంటిది. బాహ్య వాతావరణం తరచుగా మన ఆలోచనల ప్రతిబింబం. సంతోషకరమైన అనుభవాలను ఆకర్షించే సంతోషకరమైన ఆలోచనల ఫలాలను మనం పొందుతాము. రోజంతా ప్రశాంతంగా ఉండటానికి కాసేపు కూర్చుని మీ మనస్సును ప్రోగ్రామ్ చేయండి. మీ ప్రతిస్పందనలను రూపొందించడానికి భావోద్వేగ స్థిరత్వం యొక్క పునాదిని సెట్ చేయండి. పరిస్థితులు, వ్యక్తులు అసంపూర్ణంగా ఉండవచ్చు కానీ మీ మానసిక స్థితి పరిపూర్ణంగా ఉండాలి – ప్రశాంతంగా, సంతోషంగా మరియు శాంతియుతంగా. మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యలు సానుకూల ప్రకంపనలను ప్రసరింపజేయాలి, వ్యక్తులను  మరియు పరిస్థితులను ప్రభావితం చేయాలి మరియు మరింత శాంతి, ఆనందాన్ని ఆకర్షించాలి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

9th sep 2024 soul sustenance telugu

గందరగోళం కాకుండా స్పష్టత కలిగి ఉండండి

శాంతి మరియు స్థిరత్వంతో కూడిన జీవితాన్ని గడపడానికి స్పష్టత కలిగి ఉండటం కీలకం. కానీ ఎలా ఉండాలి, ఏం చేయాలి లేదా ఏ దిశలో అడుగు పెట్టాలి అని మనం తరచుగా ఆలోచిస్తూ ఉంటాము.

Read More »
8th sep 2024 soul sustenance telugu

గణేష్ చతుర్థి యొక్క దివ్యత మరియు ఆధ్యాత్మికత (పార్ట్ 2)

శ్రీ గణేషుని పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. వ్యక్తుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేషుని చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం చూపిస్తారు,

Read More »
7th sep 2024 soul sustenance telugu

గణేష్ చతుర్థి యొక్క దివ్యత మరియు ఆధ్యాత్మికత (పార్ట్ 1)

ఈ సంవత్సరం గణేష్ చతుర్థిని సెప్టెంబర్ 7 నుండి 17 వరకు జరుపుకుంటారు. శ్రీ గణేషుని జననం యొక్క నిజమైన అర్ధాన్ని మనం అర్థం చేసుకుంటాము. శ్రీ పార్వతీ దేవి స్నానం చేయాలనుకొని గేటు

Read More »