Hin

29th jan 2024 soul sustenance telugu

January 29, 2024

ఆకర్షణలు ఉపశమనాన్ని ఇవ్వలేవు

మనమందరం శారీరక లేదా మానసిక బాధలకు గురవుతూంటాము – నిరాశలు, అనారోగ్యాలు, సంబంధాల సమస్యలు, వైఫల్యాలు, భయాలు, ఒత్తిడి లేదా దుఃఖం. బాధ ఆరంభంలో ఉన్నప్పుడే ఉపశమన ప్రక్రియను ప్రారంభించాలి. కానీ దానికి బదులుగా, టీవీ, షాపింగ్, చాటింగ్, ఆటలు, ధూమపానం లేదా మరేదైనా ఆకర్షణలవైపు మన మనస్సును మరల్చుకుంటూ తాత్కాలికంగా సమస్య నుండి దూరంగా ఉంటాము. మన నొప్పికి వైద్యం కావాలి, మళ్లింపు కాదు. ఆకర్షణలతో గాయాలు తగ్గవు, గమనించనప్పుడు అవి ఇంకా ఎక్కువ అవుతాయి.

 

మీ మనస్సు కలవరపడినప్పుడు, ఒత్తిడిని తగ్గించేవీ అనే పేరుతో మీరు దానిని మరల్చుతూ ఉంటారా? మీరు మీతో మాట్లాడుకుంటూ, మీకు ఇబ్బంది కలిగించే వాటిని తెలుసుకొని, మనస్సును ఓదార్చడానికి, బాధను నయం చేయడానికి సమయాన్ని వెచ్చిస్తున్నారా? కొన్ని సమయాల్లో, మీరు మానసిక గాయాలను నయం చేసుకోవడానికి ఇతరులపై లేదా కాలంపై ఆధారపడతారా? మనసు బాలేదనిపించినప్పుడు, మనం తరచుగా షాపింగ్, టెలివిజన్, సెలవులు లేదా వ్యసనాల వైపు మనస్సును మరల్చడం ద్వారా భావోద్వేగ గాయం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాము. మనసు బాధను  అనుభవించకపోవచ్చు, కానీ బాధ ఇప్పటికీ ఉంటుంది. సమయం గడిచేకొద్దీ, అది మరింత ఎక్కువ అవుతుంది ఎందుకంటే దానిని నయం చేయడానికి బదులుగా, మనం దానిని తాత్కాలికంగా తగ్గించుకోవడాన్ని ఎంచుకున్నాము. ఒత్తిడి, కోపం లేదా దెబ్బల గాయాలు మన తప్పుడు ఆలోచనల ఫలితమే. మనతో మనం సమయం గడపడం మరియు సరైన ఆలోచనలను సృష్టించడం వల్ల గాయాన్ని నయం చేయవచ్చు. మనం ఆకర్షణలను ఉపయోగించకుండా, లేదా ఇతరులపై ఆధారపడకుండా, లేదా దానిని కాలానికి వదిలేయకుండా ఉందాము. ఇతరులెవరూ మనల్ని బాధించలేరు లేదా నయం చేయలేరు. మీ భావోద్వేగాలను ఎదుర్కోండి, జ్ఞానం అనే సాధనాన్ని తెలుసుకొని దాన్ని నయం చేయండి. మీకు మీరే గుర్తు చేసుకోండి – నేను వైద్యం చేసేవాడిని. ఏ ఆకర్షణ నా గాయాన్ని మాన్పించదు. నేను ప్రేమ మరియు శ్రద్ధతో నన్ను నయం చేసుకుంటాను. నేను నా భావోద్వేగాలను ఎదుర్కొంటాను. నేను నా మనసును మరల్చుకుంటూ తప్పించుకోవడానికి ప్రయత్నించను.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

16th feb 2025 soul sustenance telugu

చక్కటి సంబంధాలను బలపరుచుకోవడానికి అహంకారాన్ని త్యాగం చేయడం (పార్ట్ 2)

మీరు మరొక వ్యక్తిని కలిసినప్పుడల్లా, మీరు మీలాగే ఉండాలి అని నిర్ధారించుకుంటూ, అదే సమయంలో ఎదుటి వ్యక్తిని కూడా వారిని వారిలానే ఉండనివ్వడం ద్వారా మీరు వారికీ ఒక స్వేచ్చని కలిపిస్తారు. దాని అర్థం

Read More »
15th feb 2025 soul sustenance telugu

చక్కటి సంబంధాలను బలపరుచుకోవడానికి అహంకారాన్ని త్యాగం చేయడం (పార్ట్ 1)

సంబంధాలు జీవితానికి ప్రాధమిక నిధి, కానీ సంబంధంలో ఏ వ్యక్తిలోనైనా అహం పెరిగినప్పుడు అవి తప్పుడు మార్గంలో వెళ్తాయి. వ్యక్తులు ఎల్లప్పుడూ వినయపూర్వకమైన వారితో సంతృప్తి చెందుతారని మీరు కనుగొంటారు. అలాగే అహంకారం లేని

Read More »
14th feb 2025 soul sustenance telugu

విశ్వసించండి. ఇక మీరు విజయం సాధిస్తారు

మీరు మీ పెద్ద లేదా చిన్న లక్ష్యాల గురించి చాలా ఉత్సాహంగా ఉంటూ వాటిని చేరుకోవడానికి చాలా కష్టపడ్డారా… కానీ ఎక్కడో ఒక చోట విజయం సందేహాస్పదంగా అనిపించిందా? అది ఫలితాన్ని ఎలా ప్రభావితం

Read More »