Hin

8th october 2024 soul sustenance telugu

October 8, 2024

ఆలోచనలపై ప్రతికూల ప్రభావాలను అధిగమించడం (పార్ట్ 1)

మన ఆలోచనలు వివిధ రకాలు, వివిధ తీవ్రతలను కలిగి ఉంటాయి. వాటి సంఖ్య  కూడా మెలకువగా ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఆ నిర్దిష్ట సమయంలో మనం ఏ చర్య చేస్తున్నాం లేదా ఏ చర్యను చేయటం లేదు అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. అవి సానుకూలమైనా లేదా  ప్రతికూలమైనా అపారమైన సామర్థ్యాన్ని లేదా శక్తిని కలిగి ఉంటాయి. అవి మనల్ని శక్తివంతం చేయగలవు లేదా బలహీనపరచగలవు. ఇది మనం ఏమనుకుంటున్నాం, ఎంత ఆలోచిస్తున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

మనస్సు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి దూకుతుంది. మన ఆలోచనలు చాలా వరకు సందేహాలు, భయాలు, అభద్రత, చికాకు, ఆందోళన, పోల్చుకోవటం వంటివి. ఇవి అసూయ, ద్వేషం,ఆత్మన్యూనత భావాలు  , అహంకారం, కోరికలు, అసంతృప్తి, ఒత్తిడి మొదలైన భావోద్వేగాలకు దారితీసే వ్యర్థమైన ఆలోచనలు. అవి మనల్ని బలహీనపరుస్తాయి. అవి మన దృష్టిని మరల్చి, మన ఆంతరిక స్పష్టతను తగ్గిస్తాయి. కొన్నిసార్లు మన మనస్సులో కొన్ని రకాల ఆలోచనలను రిపీట్ చేసుకుంటూ ఉంటాము. చాలా సార్లు, ఈ రిపీట్ చేసుకునే ఆలోచనలు పైన పేర్కొన్న భావోద్వేగాలకు సంబంధించిన ప్రతికూల లేదా వ్యర్థమైనవి. కొన్నిసార్లు రిపీట్ అయ్యే ఆలోచనలు అవసరం కావచ్చు కూడా. అవసరమైన ఆలోచనలు కూడా, పదే పదే రిపీట్ అయినప్పుడు, అవి అనవసరమైనవి లేదా వ్యర్థమైనవే. కాబట్టి ఉన్నతమైన ఏకాగ్రతతో ఆలోచించడం చాలా ముఖ్యం అంటే తక్కువగా, శక్తివంతంగా ఆలోచించాలి. ఇటువంటి ఆలోచనలు చాలా స్పష్టత, ఏకాగ్రత మరియు ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంటాయి, అవి వాటిని మరింత విజయవంతంగా ఆచరణలో పెట్టడానికి మనకు సహాయపడతాయి. ఒక్క ప్రతికూల లేదా వ్యర్థ ఆలోచన లేదా వరుసగా వచ్చే వ్యర్థ ఆలోచనలు సంతృప్తిని అనుభవించే సామర్థ్యాన్ని అడ్డుకుంటాయి. ఆధ్యాత్మికంగా జాగృతమవ్వనివ్వకుండా మనల్ని దుఃఖపరుస్తాయి. మరోవైపు, మన ఆంతరిక స్వయం యొక్క గొప్పతనాన్ని పొందడానికి, ఆస్వాదించడానికి మరియు అనుభవం చేసుకోవడానికి ఒక్క సానుకూల ఆలోచన లేదా వరుసగా వచ్చే సానుకూల ఆలోచనలు కీలకం. కానీ అది స్వచ్ఛమైన, బలమైన, స్పష్టమైన మరియు కేంద్రీకృతమైన ఆలోచన లేదా ఆలోచనలు అయి ఉండాలి.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »