Hin

9th october 2024 soul sustenance telugu

October 9, 2024

ఆలోచనలపై ప్రతికూల ప్రభావాలను అధిగమించడం (పార్ట్ 2)

కేంద్రీకృత ఆలోచన యొక్క ఆరోగ్యకరమైన, సానుకూల అనుభవంలో ఉండనివ్వని ఒక ముఖ్యమైన అంశం మన జీవితంలో మనం ఎదుర్కొనే అనేక రకాల ప్రభావాలు. రెండు రకాలైన ప్రభావాలు ఉన్నాయి – బాహ్యమైనవి మరియు ఆంతరికమైనవి.

బాహ్య ప్రభావాలు అంటే ఇంట్లో, కార్యాలయంలో, పాఠశాలలో లేదా కళాశాలలో, మార్కెట్లో, లేదా మరెక్కడైనా వివిధ రకాల మాధ్యమాల ద్వారా మనం కలిసే వ్యక్తుల ప్రభావాలు.  ఈ వ్యక్తులు మన స్నేహితులు, తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, గురువు, వైద్యుడు,పొరుగువారు, కార్యాలయ సహచరులు, బాస్, నటులు లేదా మనం ఆరాధించే క్రీడాకారులు, రోజువారీ న్యూస్ పేపర్లలో మనం చదివే వ్యక్తులు కూడా కావచ్చు. మనం పుట్టినప్పటి నుండే ఈ ప్రభావాలకు గురయ్యాము. ఈ వ్యక్తులందరి నుండి వచ్చే ప్రభావాలు భౌతిక స్థాయిలో ఉండవలసిన అవసరం లేదు, అవి ఇతరుల నుండి వచ్చే మానసిక వైబ్రేషన్ల సూక్ష్మ స్థాయిలో కూడా ఉండవచ్చు. మనం ఈ వ్యక్తులందరితో లేదా కొంతమందితో సంభాషిస్తూ వారితో సమయాన్ని గడుపుతాము. మనం ఇలా  చేసినప్పుడల్లా వారు మనకు సలహా ఇస్తారు లేదా భౌతిక స్థాయిలో వారి అభిప్రాయాన్ని ఇస్తారు. మనం  సూక్ష్మమైన, భావోద్వేగ శక్తి స్థాయిలో కూడా వారిచే ప్రభావితమవుతాము. ఉదా. మనం ప్రతిరోజూ మన ఆఫీసులో చాలా సమయం గడుపుతాము. మనం మన ఆఫీసులో మేనేజర్ తో ఎల్లప్పుడూ  సంభాషించకపోవచ్చు, కానీ వారి వ్యక్తిత్వం మనతో సహా ఆఫీస్ లోని ప్రతి ఒక్కరినీ సూక్ష్మ స్థాయిలో నిరంతరం ప్రభావితం చేస్తోంది. ఆఫీస్ వాతావరణం ఎక్కువగా ఆఫీసులోని మేనేజర్ వ్యక్తిత్వంతో  రూపొందించబడుతుంది. అదే విధంగా, మనం మీడియా యొక్క సానుకూల ప్రభావానికి మాత్రమే లోనవ్వాలనుకొని మనం ప్రతికూల విషయాలు వినము, కానీ ప్రతి ఒక్కరూ మీడియా నుండి హింస, దుఃఖం మరియు అపరిశుభ్రత వార్తలకు గురికావడం వల్ల అన్నీ వైపులా  ఉన్న ప్రతికూల వాతావరణం, మనం గ్రహించకపోయినా, ఖచ్చితంగా సూక్ష్మ స్థాయిలో మనల్ని ప్రభావితం చేస్తుంది. పిల్లలుగా, మనం మన తల్లి గర్భంలో రూపుదిద్దుకుంటున్నప్పుడు కూడా, మన తల్లిదండ్రుల ప్రభావంలో ఉంటాము.

రేపటి సందేశంలో, వివిధ రకాల ఆంతరిక ప్రభావాలు ఏమిటో వివరిస్తాము.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

24th march 2025 soul sustenance telugu

మెడిటేషన్ అనే బ్రహ్మ ముడి (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రాక్టికల్ మెడిటేషన్ అనేది కేవలం ఉదయం రోజును ప్రారంభించే ముందు లేదా రాత్రి నిద్రురించే ముందు చేసేటువంటిది మాత్రమే కాదు, మీరు 

Read More »
23rd march 2025 soul sustenance telugu

మెడిటేషన్ అనే బ్రహ్మ ముడి (పార్ట్ 2)

మెడిటేషన్ అనే బ్రహ్మ ముడి (పార్ట్ 2) మెడిటేషన్  అనేది మనస్సులో పాజిటివిటి సృష్టించే ప్రక్రియ, తద్వారా మనస్సు రోజువారీ జీవితంలోని సాధారణ ఆలోచనలను పాజిటివ్ గా మారడం ప్రారంభమవుతుంది. ఇది మైండ్ ను

Read More »
22nd march 2025 soul sustenance telugu

మెడిటేషన్ అనే బ్రహ్మ ముడి (పార్ట్ 1)

మెడిటేషన్ అనే బ్రహ్మ ముడి (భాగం 1) మీ ప్రతిరోజును ప్రకాశవంతంగా ప్రారంభించడానికి మీ వ్యక్తిగత, వృత్తిపరమైన మరియు సామాజిక జీవితంలో దిన చర్యను సెట్ చేసుకోవాలి. దానితో పాటు, మనస్సు మరియు బుద్ధి

Read More »