Hin

10th october 2024 soul sustenance telugu

October 10, 2024

ఆలోచనలపై ప్రతికూల ప్రభావాలను అధిగమించడం (పార్ట్ 3)

నిన్న మనం బాహ్య ప్రభావాల గురించి చర్చించుకున్నాము. మన ఆలోచనలపై కొన్ని ఆంతరిక ప్రభావాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

– ప్రశంసలు, కీర్తి, ప్రతీకారం, దురాశ, పరిస్థితి లేదా వ్యక్తి యొక్క నియంత్రణలో ఉండటం, పరిస్థితి లేదా వ్యక్తిపై ఆధిపత్యం చెలాయించడం వంటి స్వార్థపూరిత లేదా అశుద్దమైన  కోరికలు;

– అహం;

-గతం యొక్క భారం, వర్తమానం లేదా భవిష్యత్తు గురించి మన ఆందోళనలు;

-వ్యక్తులు, పరిస్థితులు, భౌతిక వస్తువులు మొదలైన వాటి పట్ల మొహం.

-ఒక నిర్దిష్ట వ్యక్తి పట్ల అసూయ లేదా ద్వేషం, ఒకరి పట్ల పక్షపాత లేదా విమర్శనాత్మక దృష్టి మొదలైనవి.

– ఇతర తాత్కాలిక ప్రతికూల సంస్కారాలు లేదా వ్యక్తిత్వ లక్షణాలు;

బాహ్యమైన లేదా ఆంతరికమైన ఈ ప్రభావాలలో కొన్ని లేదా అన్నింటికీ మనం ఎల్లప్పుడూ గురవుతూ ఉంటాము. మనం శక్తివంతంగా లేకపోతే, మన మనస్సు అనేక ప్రభావాల వల్ల బలహీనపడుతుంది. ఫలితంగా, మనస్సు అస్పష్టంగా, గందరగోళంగా మరియు ఏకాగ్రత లోపించినదిగా మారుతుంది. వీటన్నిటి కారణంగా, ఒక వైపు, మనకు అవసరమైన, ముఖ్యమైన మరియు నిజమైన వాటితో కనెక్ట్ అయ్యి ఉండటానికి మంచి నిర్ణయ శక్తి ఉండాలి. మరోవైపు, మన ఆలోచనను బలోపేతం చేయాలంటే, తక్కువ ఆలోచించాలి; మరింత నెమ్మదిగా ఆలోచించాలి; మరింత ఏకాగ్రతతో మరియు స్పష్టంగా దృష్టి పెట్టాలి, ప్రయోజనకరంగా, సానుకూలతతో ఉండాలి. ఆ ఆలోచన ఒక బాణం లాంటిది; దానికి సానుకూల శక్తి మరియు స్పష్టత ఉంటుంది. అది ఎల్లప్పుడూ శక్తివంతమైన ఫలాలను ఇస్తుంది. ఈ రకమైన ఆలోచనను కేంద్రీకృత ఆలోచన అంటారు. పగటిపూట క్రమమైన వ్యవధిలో ఒక నిమిషం లేదా కొన్ని నిమిషాలు అంతర్ముఖంగా అవ్వటం లేదా ధ్యానం చేయడం మనల్ని అన్ని ప్రభావాలకు అతీతంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది మన మనస్సును శాంతి శక్తితో నిరంతరం పోషిస్తుంది. ఇది మనకు సులభంగా ఏకాగ్రతతో కూడిన ఆలోచన యొక్క ఈ అనుభవంలో ఉండటానికి సహాయపడుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

11th november 2024 soul sustenance telugu

మానసిక అలసటను అధిగమించడానికి 5 చిట్కాలు (పార్ట్  3)

పరిస్థితుల భారం లేకుండా జీవితాన్ని ఒక అందమైన ప్రయాణంగా జీవించండి – భారం లేకుండా జీవితాన్ని జీవించడానికి చాలా ముఖ్యమైన అభ్యాసం ప్రయాణాన్ని ఆస్వాదించడం. సైడ్ సీన్లు లేని ప్రయాణాన్ని మీరు ఎప్పుడైనా చూశారా?

Read More »
Maanasika alasatanu adhigaminchdaaniki 5 chitkaalu (part 2)

మానసిక అలసటను అధిగమించడానికి 5 చిట్కాలు (పార్ట్  2)

తప్పనిసరి అయితేనే ఇతరుల గురించి ఆలోచించండి – అవసరం లేనప్పుడు, ముఖ్యమైనది కానప్పుడు కూడా ఇతరుల గురించి ఆలోచించడం అనేది మనందరికీ ఉన్న ఒక సాధారణ అలవాటు. మీ కార్యాలయంలోని ఒక వ్యక్తి తన

Read More »
Maanasika alasatanu adhigaminchdaaniki 5 chitkaalu (part 1)

మానసిక అలసటను అధిగమించడానికి 5 చిట్కాలు (పార్ట్  1)

మనం బిజీగా ఉంటూ చేయవలసిన పనులు చాలా ఉన్న వేగవంతమైన జీవనశైలి మనలో చాలా మందికి ఉంది. అయినప్పటికీ మనందరికీ క్రమం తప్పకుండా మౌనం మరియు అంతర్ముఖత అవసరం. కాబట్టి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవలసిన

Read More »