Hin

Aalochanalu mariyu chitraala sukshma paatra (part 1)

November 7, 2024

ఆలోచనలు మరియు చిత్రాల సూక్ష్మ పాత్ర (పార్ట్ 1)

మానవ ఆత్మ ఒక సూక్ష్మమైన (భౌతికం కాని) స్టేజి. నిద్రిస్తున్నప్పుడు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, రోజంతా మరియు నిద్రిస్తున్నప్పుడు కూడా ఆలోచనలు, చిత్రాల సూక్ష్మ పాత్ర నిరంతరం దానిపై జరుగుతుంది. మన ఆలోచనలు 4 ప్రధాన రకాలుగా ఉంటాయి – సద్గుణాల ఆధారంగా సానుకూలమైనవి, రోజువారీ కార్యకలాపాలకు సంబంధించిన అవసరమైనవి, వ్యర్థమైనవి – ప్రధానంగా గతం, భవిష్యత్తు, ఇతరులకు సంబంధించిన అనవసరమైనవి మరియు ప్రతికూలమైనవి – దుర్గుణాలు, ఇతర బలహీనతలకు సంబంధించినవి. అదే విధంగా, మనం నిరంతరం అదే 4 రకాలైన చిత్రాలను సృష్టిస్తాము. ఆత్మ అనేది మనస్సు, బుద్ధి మరియు సంస్కారాలతో కూడిన ఆధ్యాత్మిక శక్తి. సదా మనస్సు ఆలోచిస్తుంది లేదా సూక్ష్మంగా మాట్లాడుతుంది మరియు బుద్ధి విజువలైజ్ చేస్తుంది లేదా సూక్ష్మంగా చూస్తుంది.  

ఈ రెండు ప్రక్రియలు పనిచేస్తుంటాయి, కొన్నిసార్లు ఒకదానికొకటి స్వతంత్రంగా మరియు కొన్నిసార్లు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి లేదా ఒకదానికొకటి ప్రభావితం చేస్తాయి ఉ. శాంతి గురించి ఆలోచించండి ఇక అది దానికి సంబంధించిన విజువలైజేషన్లకు దారితీస్తుంది. కోపం, ద్వేషాలతో కూడిన ఇబ్బందికరమైన దృశ్యాన్ని విజువలైజ్ చేయండి ఇక మీ ఆలోచనలు ఆ దిశలో నడుస్తాయి.  కొన్నిసార్లు ఈ రెండు ప్రక్రియలు ఒకే సమయంలో పనిచేస్తాయి, మరి కొన్నిసార్లు ఒక సమయంలో ఒకటే పనిచేస్తాయి. కొన్నిసార్లు రెండూ అస్సలు పనిచేయవు, ఇది మనం మెలకువగా ఉన్నప్పుడు కంటే నిద్రపోతున్నప్పుడు చాలా తరచుగా జరుగుతుంది. ఈ సూక్ష్మమైన, భౌతికంగా కనిపించని పాత్ర అనేది స్వయానికి, చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ కనిపించే మాటలు మరియు చర్యల యొక్క భౌతిక పాత్రకు పునాది.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

5th dec 2024 soul sustenance telugu

ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ

Read More »
4th dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 3)

స్టెప్ 3 – పరిష్కారానికి సానుకూల చర్యలు తీసుకోవడం – మూడవ దశ మరియు చాలా ముఖ్యమైనది పరిస్థితిని సరిచేయడానికి భౌతిక స్థాయిలో సానుకూలంగా ఏదైనా చేయడం. కొన్నిసార్లు, మనం సానుకూలంగా ఆలోచించి భగవంతుడిని

Read More »
3rd dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 2)

స్టెప్ 2 – సానుకూలమైన మరియు శక్తివంతమైన మానసిక స్థితిని సృష్టించడం – ఏదైనా ప్రతికూల పరిస్థితిని పరిష్కరించడంలో తదుపరి దశ ఆధ్యాత్మిక ధృవీకరణలు లేదా ఆంతరిక శక్తి, దృఢత్వంతో నిండిన ఆలోచనల సహాయంతో

Read More »