Hin

Aalochanalu mariyu chitraala sukshma paatra (part 2)

November 8, 2024

ఆలోచనలు మరియు చిత్రాల సూక్ష్మమైన పాత్ర (పార్ట్ 2)

ఆత్మ సృష్టించే ఆలోచనలు, చిత్రాల నాణ్యత అనేది ఆత్మ యొక్క సంస్కారాలపై ఆధారపడి ఉంటుంది. నాణ్యతను బట్టి, ఆత్మ సానుకూలమైన లేదా ప్రతికూలమైన వివిధ భావోద్వేగాలను అనుభవం చేసుకుంటుంది. పరంధామం నుండి భౌతిక ప్రపంచ స్టేజీపై  ఆత్మ మొదట అవతరించినప్పుడు, దాని సంస్కారాలు ఆ సమయంలో ఉన్నతమైనవిగా  ఉన్నందున, ఆలోచనలు మరియు చిత్రాల ఈ పాత్ర యొక్క నాణ్యత స్వచ్ఛంగా సానుకూలమైనదిగా ఉంటుంది. అందువల్ల అది శాంతి, ప్రేమ మరియు ఆనందం వంటి సానుకూల భావోద్వేగాలను మాత్రమే అనుభవం చేసుకుంటుంది. వివిధ భౌతిక శరీరాల ద్వారా ఆత్మ విభిన్న పాత్రలను పోషిస్తూ, జనన-మరణ చక్రం లోకి రావటంతో ఈ నాణ్యత తగ్గుతుంది. ఇది అశాంతి, ద్వేషం మరియు దుఃఖం వంటి భావోద్వేగాల అనుభవానికి  దారితీస్తుంది.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఏ సానుకూల లేక ప్రతికూలమైన లోతైన భావోద్వేగ అనుభవానికైనా, ఆ నిర్ణీత భావోద్వేగానికి సంబంధించిన ఆలోచనలు, చిత్రాలు ఒకే సమయంలో సృష్టించడమే కీలకం. ఉ. పది సంవత్సరాల క్రితం జరిగిన దగ్గరి బంధువు మరణం గురించి ఆలోచించటం, విజువలైజ్ చేయటం ఒకే సమయంలో చేయండి. అప్పుడు వెంటనే మీకు లోతైన దుఃఖపు అనుభవం కలుగుతుంది. బాల్యంలో, అమ్మని ప్రేమ పూర్వకమైన ఆలింగనం చేసుకున్నది ఒకే సారి ఆలోచించడం, విజువలైజ్ చేసినట్లయితే లోతైన సంతోషపు అనుభవం కలుగుతుంది. ఈ రెండు సూక్ష్మ ప్రక్రియల మధ్య ఈ రకమైన సమన్వయమే నిజమైన ఏకాగ్రత. ఏ రకమైన ఆధ్యాత్మిక అనుభవానికి అయినా కీలకం ఈ రెండు ప్రక్రియలను ఆధ్యాత్మికంగా సానుకూలంగా మార్చడం. బ్రహ్మ కుమారీల వద్ద బోధించబడే రాజయోగ మెడిటేషన్, బుద్ధిలో ఆధ్యాత్మిక విజువలైజేషన్  ప్రక్రియతో పాటు మనస్సులో ఒక ఆధ్యాత్మిక ఆలోచనా ప్రక్రియ. ఇందులో ఆధ్యాత్మిక స్వయం  (లేదా ఆత్మ) మరియు పరమాత్మ (లేదా పరమాత్మ) గురించి ఆలోచనలు, చిత్రాలను ఒకే సారి సృష్టించడం.  దీని వలన ఆత్మ యొక్క అసలైన గుణాలు మరియు పరమాత్మ యొక్క అనాది గుణాలను – శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం, స్వచ్ఛత, శక్తి మరియు సత్యాన్ని అనుభవం చేసుకుంటాము. 

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

30th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ లక్ష్యాలను సాధించేటప్పుడు మనం ఎంత వినయంగా మరియు నిజాయితీగా ఉన్నాము అనేదే మన విజయం. నమ్రత అన్నింటికంటే గొప్ప

Read More »
29th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు విజయం అంటే మన జీవతపు క్వాలిటి పెరగడం. మనం ఖరీదైన కారు,  ఖరీదైన బట్టలు కొనుగోలు చేసి  గర్వపడతాము. కొన్నిసార్లు ఈ

Read More »
28th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మనకు మరియు ఇతరులకు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో ప్రయోజనం చేకూర్చే పనులు చేసే ప్రత్యేకమైన వారము. ఉద్యోగంలో, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు,

Read More »