Hin

26th july 2024 soul sustenance telugu

July 26, 2024

ఆమోద వ్యసనం నుండి విముక్తి పొందండి

మనమందరం ఏదైనా ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాము, అలాగే మన జీవిత ప్రయాణం కూడా ఏదైనా ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది.  మనం ఎవరు అనేదానికి మరియు మనం చేసేదానికి ఆమోదం పొందడం ఖచ్చితంగా మంచి అనుభూతిని కలిగిస్తుంది, ఇది మనం ఏదైనా ఒక విషయం సరిగ్గా చేస్తున్నామని చెబుతుంది. కానీ ఇతరులను సంతోషపెట్టడం, నిరంతరం ధృవీకరణను కోరుకోవడం వల్ల మనం ఇతరుల నిబంధనల ప్రకారం బానిసత్వంతో జీవిస్తాము. మనం చివరికి మన సామర్థ్యాన్ని వృధా చేస్తాము, భావోద్వేగ పరంగా అలసిపోయినట్లు భావిస్తాము. మీ కోరికలు మరియు మీ సామర్థ్యానికి అనుగుణంగా జీవించడం ప్రారంభించండి. ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అని మీరు ఆందోళన చెందకపోతే జీవితం చాలా సులభం అవుతుంది. మీకు మీరే గుర్తు చేసుకోండి – నేను తెలివైనవాడిని. నా ఎంపికల కోసం నేను ఇతరుల ధృవీకరణ లేదా ఆమోదంపై ఆధారపడను. ఇది నా జీవితం. నాకు ఏది సరైనదో ఎంచుకోవడానికి నాకు స్వేచ్ఛ ఉంది, ఇతరులు ఏది ఆమోదిస్తారో కాదు.

మీరు ఆరాధించే ఎవరికైనా మీ ఎంపికలు, నిర్ణయాలు, లక్షణాలు లేదా అలవాట్ల విషయంలో నచ్చకపోతే  మీరు రాజీ పడతారా? మీకు సరైనది అనిపించడం కంటే ఇతరుల ఆమోదం పొందడం ఎక్కువ ప్రాధాన్యతగా ఉందా? గుర్తించడం లేదా అంగీకరించడం అంత సులభం కాకపోయినా మన ప్రవర్తనల్లో కొన్ని ఆమోద వ్యసనాన్ని ప్రతిబింబించవచ్చు. మనకు దగ్గరగా ఉన్నవారిని సంతోషపెట్టడానికి ప్రయత్నించడం మనలో చాలా మంది పడే అతిపెద్ద  వల. మనం ఎవరు, మనం ఏమి చేస్తాము లేదా మన వద్ద ఏమి ఉంది అనేది ఎల్లప్పుడూ మన నిర్ణయమే అయి ఉండాలి. వేరొకరి ఆమోదం పొందడానికి మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. మన విలువలను జీవించడంపై దృష్టి సారించి, సరైనది అనిపించేది చేద్దాం. మన లోపల అన్ని సమాధానాలు ఉన్నాయి. మనం మన అంతర్దృష్టిని సక్రియం చేసి, మన మనస్సాక్షిని అనుసరించాలి. స్వయాన్ని మరియు పనిని మనం ఆమోదించినప్పుడు, మన విలువను ధృవీకరించమని ఇతరులను అడగడం మానేస్తాము. లేకపోతే మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అప్పుడు, మనం మనల్ని  లేదా ఇతరులు మనల్ని గౌరవించరు. మీరు ఎవరినీ కాపీ చేయాల్సిన అవసరం లేదు. అన్ని సమయాల్లో మీరు మీలాగే ఉండండి. మిమ్మల్ని ఆమోదించడానికి మీకు ఇతరులు అవసరం లేదు, మీకు ప్రేమ లేదా ప్రశంసలను చూపించేవారికి కృతజ్ఞతతో ఉండండి, కానీ ఆమోదం కోరవద్దు. నిస్వార్థంగా శ్రద్ధ వహించండి, షరతులు లేకుండా సహాయం చేయండి. మీకు ఎవరి నుండి ఏమీ అవసరం లేదు. ప్రశంసలు మరియు విమర్శలలో స్థిరంగా ఉండే కళను పెంపొందించుకోండి. బాహ్య ధృవీకరణను కోరుకోవద్దని, మీ జీవితాన్ని అర్ధవంతం చేసే మీ ఉద్దేశం, లక్ష్యాలు మరియు ప్రణాళికలపై మాత్రమే దృష్టి పెట్టాలని మీ మనస్సుకు నేర్పండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

25th april 2025 soul sustenance telugu

సంతుష్టత – ధారణ చేసి రేడియేట్ చేయండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన సంతుష్టతని మరియు మన కోరికలను సమతుల్యం చేసుకోవడమే మనం నేర్చుకోవలసిన జీవిత-నైపుణ్యం. నా జీవితంలో అన్ని మెరుగుదలలు చేసిన తర్వాత,

Read More »
24th april 2025 soul sustenance telugu

వెళ్ళిపోయిన ప్రియమైన వ్యక్తికి శాంతిని, ప్రేమను ప్రసరింపజేయండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో ప్రతి ఒక్కరూ కూడా వేరు వేరు జన్మల ప్రయాణంలో ఉన్నారు, అలాగే మన చుట్టూ ఉన్న ఆత్మలు కూడా. బంధువు,

Read More »
23rd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు రెండూ ఈ సమాజంలో ఉన్నాయి. మన జీవితంలో అనేక కర్మలు చేస్తూ ఉంటాము,

Read More »