HI

14th may 2024 soul sustenance telugu

May 14, 2024

ఆనందాన్ని వెతకకండి, సృష్టించండి

మనలో చాలా మంది ఆనందాన్ని కఠినతరం చేస్తారు, కాబట్టి ఇది తాత్కాలిక భావోద్వేగంగా కనిపిస్తుంది. భౌతికమైనవి సంపాదించడానికి, మనం ఏదైనా చేయవలసుంటుంది. అలాగే ఆనందాన్ని సంపాదించడానికి కూడా ఏదో ఒకటి చేయాలి అనే అనుకుంటాము. కాబట్టి, మనం దాని కోసం అయితే వేచి ఉంటాము లేదా  వెతుకుతాం లేదా వెంబడిస్తాం.  దానిని కొనాలని చూస్తాము లేదా  డిమాండ్ చేస్తాము లేదా వాయిదా వేస్తాం. లేదా ఏదైనా  సాధించడంతో ముడిపెడతాము. కాబట్టి సామాజికంగా మనం ఈరోజు ధనవంతులుగా, విజయవంతమయ్యాము కానీ సంతోషంగా లేము. నిజం ఏమిటంటే మనం ఉన్న చోటే సంతోషాన్ని  కలగించుకోవచ్చు. ఇది మనతో మరియు మనలో ఉంటుంది. చేయడానికి ఏమి లేదు కేవలం ప్రతి క్షణం సంతోషంగా ఉండటమే.

మనం ఎప్పుడూ సంతోషంగా ఉండగలమా? ఇది మన ఎంపిక. ఆనందం అంటే మన సంబంధాల నుండి మనకు వచ్చే ప్రతికూలత ఉనికిని మనం తిరస్కరించడం కాదు. అదే సమయంలో మన జీవితంలోని పరిస్థితులు లేదా వ్యక్తులు మన ఆనందాన్ని దొంగిలించడానికే ఇక్కడ లేరని గుర్తుంచుకోండి. వారు తమ పాత్రను పోషిస్తున్నారు. వారు కొన్ని సమయాల్లో మనకు సవాలు చేస్తారు, కానీ ఇతర సమయాల్లో మనం సంతోషంగా ఉండకుండా మనల్ని మనం అడ్డుకుంటాము. ఆనందం అనేది కేవలం మానసిక స్థితి లేదా అనుభూతికి సంబంధించినది కాదు, అది మన మార్గంలో వచ్చే ఎలాంటి సవాలునైనా అధిగమించే శక్తిని మనకు అందిస్తుంది. ఇది మన మనస్సు, బుద్ధి మరియు శరీరం ప్రశాంతంగా, వివేకం మరియు ఆశావాదంతో పనిచేయడానికి కారణమవుతుంది. కాబట్టి, సమస్యలు మనకు బాధ కలిగించవు. మనం  అనుభవాల నుండి నేర్చుకుంటాము మరియు ఎదుగుతాము.

సంతోషంగా ఉన్న వ్యక్తులు ఇతరులను సంతోషపరుస్తారు. కానీ తరచుగా మనం మన లక్ష్యాలపై ఎంత దృష్టి సారిస్తామంటే  అక్కడికి చేరుకునే ప్రక్రియను ఆస్వాదించడం మర్చిపోతాము. మనం తప్పు చేయకపోయినా, సంతృప్తి లేదా తేలికతనం వంటి మన ప్రధాన సుగుణాలతో మనం సంబంధాన్ని కోల్పోతాము కాబట్టి మన ఆనందం తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది మన పని, ఆరోగ్యం మరియు సంబంధాలపై ప్రభావం చూపుతుంది. మన ప్రాధాన్యత జాబితాలో సంతోషాన్ని ఉంచుదాం, అంటే దానికి బాధ్యత వహిస్తామని హామీ ఇవ్వటం. మనం సంతోషంగా ఉన్నప్పుడు, మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ దానిలో కొంత భాగం లభిస్తుంది –  మనం ప్రపంచానికి ఈ కానుకను ఇస్తాము దానితో ప్రపంచం అందంగా మారుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

23rd may 2024 soul sustenance telugu

మీకు భగవంతునితో బలమైన సన్నిహిత సంబంధం ఉందా?

భగవంతుడు శాంతి, ప్రేమ మరియు ఆనంద సాగరులు. ఈ అసలైన సుగుణాలు కలిగి ఉన్న ఆత్మలమైన మనం వారి పిల్లలం. మనం భగవంతునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, వారి నుండి ఈ సుగుణాలతో

Read More »
22nd may 2024 soul sustenance telugu

భిన్నంగా ఉన్న వారి పట్ల దయకలిగి ఉండటం

మీరు ప్రపంచాన్ని ఇతరులకు భిన్నంగా ఎలా చూస్తున్నారో గుర్తించడం ద్వారా మాత్రమే మీకు భిన్నంగా ఉన్న వారి పట్ల దయ కలిగి ఉండాలనే అవగాహనను పెంపొందించుకోవచ్చు. భిన్నంగా ఉన్న వారు అంటే మీరు కలిసే

Read More »
21st may 2024 soul sustenance telugu

మిమ్మల్ని మీరు మార్చుకోవాలని లోతుగా అనుకుంటున్నారా?

చాలా సార్లు, మనం మన స్వపరివర్తన లక్ష్యాలపై ముందుకు వెనుకకు ఊగిసలాడుతూ ఉంటాము . ఏదైనా తప్పు జరిగినప్పుడు మనం పైపై మార్పులు చేస్తూ ఉత్సాహంగా మొదలుపెడతాము. చాలా వరకు మన దృష్టి ఏమి

Read More »