Hin

25th-sept-2023-soul-sustenance-telugu

September 25, 2023

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 1)

మన బాహ్య రూపాన్ని లేదా పరిశుభ్రతను చెక్ చేయడానికి, మనం ప్రతిరోజూ అద్దంలోకి చూస్తాము. కానీ మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థాయిలో, మీ అంతర్గత ముఖం లేదా ఆధ్యాత్మిక స్వయంలో ఏదైనా తప్పు ఉందా అని చూసుకోవటానికి లేదా మీ లోపల ఏమి జరుగుతుందో మరియు మీ ఆంతరిక అందాన్ని కాపాడుకోవడానికి మీరు ఏమి చేయాలో తెలుసుకోవడానికి మీకు సహాయపడే అద్దం ఏది?

ఆంతరిక స్వయాన్ని చూసుకోవటానికి లేదా చెక్ చేసుకోవటానికి మూడు రకాల అద్దాలు ఉన్నాయి. 

మొదటి అద్దం ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఆధ్యాత్మిక స్వీయ-అభివృద్ధికి సంబంధించిన జ్ఞానం, అంటే ఆత్మ, పరమాత్మ మరియు ప్రపంచ నాటకం. ప్రతి రోజు, ఉదయం, మీరు కనీసం 15 నిమిషాల పాటు ఈ అద్దంలోకి చూడవచ్చు. ఈ అద్దంలోకి చూడటం అంటే కనీసం 15 నిమిషాల పాటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వినడం లేదా చదవడం అంటే మిమ్మల్ని మీ అంతరంగానికి మరియు భగవంతునికి కనెక్ట్ చేసి, మీ భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది, మంచి చర్యలను ఎలా చేయాలో మీకు మార్గనిర్దేశం చేస్తుంది అలాగే మీ జీవితం యొక్క నిజమైన ఉద్దేశ్యాన్ని మీకు గుర్తు చేస్తుంది. 

మిమ్మల్ని మీరు ఈ అద్దంలో చాలా స్పష్టంగా చూకుంటారు ఎందుకంటే ఈ అద్దం మీకు ఇవి చూపిస్తుంది:

  1. శాంతి, ఆనందం, ప్రేమ, సంతోషం, స్వచ్ఛత, శక్తి మరియు జ్ఞానం వంటి ఆత్మ యొక్క అసలైన సద్గుణాల జ్ఞానం;
  2. స్వయానికి మరియు ఇతరులకు ప్రయోజనం చేకూర్చడానికి ఈ సద్గుణాలను స్వయం ఎలా ధారణ చేయవచ్చు;
  3. ఆత్మలో కామం, క్రోధం, దురాశ, అహంకారం, ద్వేషం, భయం, మొహం, అసూయ, దుఃఖం మొదలైన వివిధ రకాల బలహీనతల గురించిన జ్ఞానం, వాటి మూలాలు ఆధ్యాత్మిక స్వయాన్ని మరచిపోయి  భౌతికమైన స్వయాన్ని అసత్యంగా గుర్తించడంలో ఉంటాయి. అవి స్వయానికి మరియు ఇతరులకు ఎలా హాని కలిగిస్తాయి;
  4. ఈ బలహీనతలను అధిగమించే జ్ఞానం.

సరైన ఆలోచనలు చేయటం, భావాలు, వైఖరులు, ఉద్వేగాలు, మాటలు మాట్లాడటం మరియు చర్యలు చేయడంతో పోల్చుకుంటే మీరు ఎక్కడ ఉన్నారు అనేది అద్దంలో కనిపించే పై 4 విషయాలు మీరు చెక్ చేసుకోవటానికి సహాయపడతాయి. అంతే కాకుండా, మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు మళ్ళి దానిని ఎలా సరిదిద్దుకోవాలి అనేది కూడా తెలుస్తుంది. ఈ అద్దంలోకి చూసినట్లైతే కర్మ నియమాన్ని (చర్య మరియు ప్రతిచర్యల నియమం) గుర్తు చేస్తుంది, అది  మిమ్మల్ని సరిదిద్దుకోవటానికి ప్రేరేపిస్తుంది. 

(రేపు కొనసాగుతుంది….)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

5th dec 2024 soul sustenance telugu

ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ

Read More »
4th dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 3)

స్టెప్ 3 – పరిష్కారానికి సానుకూల చర్యలు తీసుకోవడం – మూడవ దశ మరియు చాలా ముఖ్యమైనది పరిస్థితిని సరిచేయడానికి భౌతిక స్థాయిలో సానుకూలంగా ఏదైనా చేయడం. కొన్నిసార్లు, మనం సానుకూలంగా ఆలోచించి భగవంతుడిని

Read More »
3rd dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 2)

స్టెప్ 2 – సానుకూలమైన మరియు శక్తివంతమైన మానసిక స్థితిని సృష్టించడం – ఏదైనా ప్రతికూల పరిస్థితిని పరిష్కరించడంలో తదుపరి దశ ఆధ్యాత్మిక ధృవీకరణలు లేదా ఆంతరిక శక్తి, దృఢత్వంతో నిండిన ఆలోచనల సహాయంతో

Read More »