Hin

26th-sept-2023-soul-sustenance-telugu

September 26, 2023

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది. వారి సద్గుణాలు, పదాలు మరియు చర్యల పరంగా మీరు స్వయాన్ని వారితో పోల్చుకుంటే మీరు ఎంతలో ఉన్నారో చెక్  చేయడంలో సహాయపడి వారిని అనుసరించేలా మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. ఆ సద్గుణాలను గ్రహించడం ద్వారా, పదాలు మాట్లాడటం మరియు అదే విధమైన చర్యలు చేయడం ద్వారా ఈ అద్దం మీకు భగవంతుని వ్యక్తిత్వాన్ని వెల్లడించి వారితో మీకున్న సంబంధాన్ని మీకు గుర్తు చేసి బలోపేతం చేస్తుంది.  మీకు మరియు ఇతరులకు ప్రయోజనం చేకూర్చే వివిధ మార్గాల్లో వారితో లోతైన మరియు వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో మీకు సహాయపడుతుంది.

ప్రతిరోజూ ఉదయాన్నే చదివే జ్ఞానం, గత 24 గంటల్లో మీ ఆలోచనలో, చర్యలలో , పరమాత్మతో సంబంధాన్ని కొనసాగించడంలో చేసిన తప్పులను గ్రహించడానికి మీకు సహాయం చేస్తుంది. అద్దం మీరు రాబోయే రోజు కోసం జాగ్రత్తగా ఉండటానికి,  సరైన ఆలోచనలు, కర్మలు చేయడానికి మరియు మీరు చదివిన దాని ఆధారంగా పరమాత్మతో సంబంధాన్ని అనుభవం చేసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. ఉదయాన్నే చదివే ఆధ్యాత్మిక జ్ఞానమే క్షణానికి ఎంత అవసరమో చాలా మందికి అనుభవమే. చదివే ఆధ్యాత్మిక జ్ఞానం మీ గత 24 గంటల కార్యకలాపాలు, మానసిక స్థితి యొక్క ఖచ్చితమైన ప్రతిబింబం.  రాబోయే రోజు కోసం,  మీ కోసం, మీ సంబంధాల కోసం మరియు మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వివిధ రకాల ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవటానికి అవసరమైనది. ఇది ఆధ్యాత్మిక లా ఆఫ్ అట్రాక్షన్. మన స్పృహ మరియు అంతర్గత అవసరాల అనుగుణంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకు లభిస్తుంది. మన ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చి , మన జీవితంలోని సందేహాలన్నింటినీ నివృత్తి చేసి  భగవంతునికి దగ్గర చేస్తుంది.

(రేపు కొనసాగుతుంది….)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 2)

స్టెప్ 2 – సానుకూలమైన మరియు శక్తివంతమైన మానసిక స్థితిని సృష్టించడం – ఏదైనా ప్రతికూల పరిస్థితిని పరిష్కరించడంలో తదుపరి దశ ఆధ్యాత్మిక ధృవీకరణలు లేదా ఆంతరిక శక్తి, దృఢత్వంతో నిండిన ఆలోచనల సహాయంతో

Read More »
2nd dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 1)

మనం అనూహ్యమైన జీవితాన్ని గడుపుతున్నాము. మన జీవితంలో తరచూ ఊహించని పరిస్థితులు వస్తున్నాయి. దీనికంతటికీ కారణం ఏమిటి? ఈ రోజు మన జీవితాలలో క్లిష్ట పరిస్థితులు ఎందుకు పెరుగుతున్నాయి? భగవంతుడు వెల్లడించిన ప్రపంచ నాటకం

Read More »
1st dec 2024 soul sustenance telugu

దివ్యమైన ఆత్మ యొక్క 12 లక్షణాలు (పార్ట్  2)

స్వయంలోని బలహీనతలను, లోపాలను సులభంగా పరిశీలించుకోగలిగే అద్దం లాంటి వారు దివ్యమైన ఆత్మ. వారిలో భగవంతుని మంచితనాన్ని, శక్తులను చూడగలుగుతాము. వారు భగవంతునితో స్వచ్ఛంగా, సత్యంగా ఉంటారు. వారు ప్రతిదీ ఎలా ఆచరణలోకి తీసుకురావాలనే

Read More »