27th-Sept-2023-Soul-Sustenance-Telugu

September 27, 2023

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము.

రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత అనేది అంతర్గత స్వయం మరియు పరమాత్మతో ఉన్న కనెక్షన్ లేదా సంబంధం యొక్క అనుభవం, ప్రతి రోజు మనము ఈ రెండింటికి సమీపంగా, లోతుగా వెళ్తాము. మీరు మీ గురించి పాజిటివ్ మరియు శక్తివంతమైన ఆలోచనలను సృష్టించి మీ నిజమైన ఆధ్యాత్మిక స్వభావాన్ని కూడా విజువలైజ్ చేసినప్పుడు, మీరు మీ ప్రకాశ స్వరూపంలో ఉంటూ అన్ని ప్రభావాలకు దూరంగా ఉంటారు,  నిజమైన సద్గుణాలను అనుభూతి చెందుతారు. ఆ అనుభవం మిమ్మల్ని మీ నిజ స్వరూపంలో అనగా ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో దానికి భిన్నంగా మిమ్మల్ని మీరు చూసుకోవడానికి సహాయపడుతుంది. ఒకవేళ మీరు ఈరోజు అశాంతిగా, కలత చెంది బాధలో ఉంటే మెడిటేషన్ లో శాంతి మరియు సంతృప్తి యొక్క ఆలోచనలను సృష్టించడం ద్వారా మీ నిజమైన స్వభావం పాజిటివిటీ మరియు శక్తి  అని మీరు త్వరగా గ్రహిస్తారు. ఆ విధంగా, ఇది స్వయం పరిశీలించుకునేందుకు, చెక్  చేసుకొని మార్చుకోవడానికి అద్దం వలె పనిచేస్తుంది. మీరు మెడిటేషన్ సమయంలో పరమాత్మను అనుభూతి చెందితే, వారి సద్గుణాలను అనుభూతి చెందితే, మీకు వారికి ఉన్న వ్యత్యాసం మీరు త్వరగా గ్రహించగలుగుతారు.  మీలో అవసరమైన మార్పులు చేసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది ఎందుకంటే బిడ్డ తండ్రి గుణాలను ప్రతిబింబిస్తాడు.

కనుక ఉదయం ఒకసారి మరియు నిద్రపోయే ముందు ఒకసారి మిమ్మల్ని మీరు ఈ అద్దంలోకి నీసం 15 నిమిషాల పాటు చూసుకోవడం మంచి అభ్యాసం.  అలాగే, ఇది చాలా ముఖ్యమైన అద్దం కాబట్టి, రోజంతా ఈ అద్దాన్ని మీతో తీసుకెళ్ళి  ప్రతి గంటకు ఒక నిమిషం పాటు దానిలో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. అపరిశుభ్రత మనకు మరియు మనతో చుట్టూ ఉన్నవారికి నచ్చదని పైగా  మంచి అభిప్రాయాన్ని ఏర్పరచదని మనందరికీ తెలుసు, అదే అంతర్గత స్వభావానికి కూడా వర్తిస్తుంది. కాబట్టి ప్రతి గంటకు ఒక నిమిషం ఈ అద్దంలోకి చూసుకోవడం, మరియు కొంత ఆత్మ పరిశీలన చేసుకొని మార్చుకోవడం ద్వారా వచ్చే యాభై తొమ్మిది నిమిషాల పాటు మనం మంచిగా కనిపిస్తాము.  అలాగే ఆ యాభై తొమ్మిది నిమిషాలలో మనల్ని మనం మనసు మలిన పరుచుకుంటే దానిని తదుపరి ఒక నిమిషం విరామంలో త్వరగా సరిదిద్దుకోవచ్చు.

(రేపు కొనసాగుతుంది….)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

మెడిటేషన్ లో చేయవలసిన మరియు చేయకూడని 10 అంశాలు (పార్ట్ 2 )

ఆత్మానుభూతి పొందుతూ కర్మలలో ఆత్మానుభూతి చేసుకోవడం – మెడిటేషన్ కు ముఖ్యమైన పునాది ఆత్మ యొక్క స్పృహ ఉండడం. స్వయాన్ని ఆత్మగా అనగా జ్యోతి స్వరూపంగా భావిస్తూ, ఆత్మ యొక్క నిజగుణాలను అనుభూతి చేసుకోవడం.

Read More »
2nd Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

మెడిటేషన్ లో చేయవలసిన మరియు చేయకూడని 10 అంశాలు (పార్ట్ 1)

ఒక పాజిటివ్ ఆలోచనతో మీ మెడిటేషన్ ను ప్రారంభించండి – మెడిటేషన్ ప్రారంభించే ముందు, మీరు స్వచ్ఛమైన మరియు ప్రశాంతమైన జీవి అని మరియు సర్వ గుణాల, శక్తుల సాగరుడైన భగవంతుడు మీ తండ్రి

Read More »
1st Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

మీ ఆనందాన్ని వాయిదా వేయకండి

మనం ప్రతి క్షణం ఆనందంగా ఉండాలనుకుంటాము. అయినప్పటికీ, ఏదైనా కావాల్సినది జరిగే వరకు ఆ ఆనందాన్ని వాయిదా వేయడానికి మన మనస్సును ప్రోగ్రామింగ్ చేశాం. తద్వారా మనం మన మనుసును షరతులతో కూడినదిగా చేస్తాము.

Read More »