Hin

28th-sept-2023-soul-sustenance-telugu

September 28, 2023

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది. కానీ మీరు ఇతరులతో వ్యవహరించేటప్పుడు మీ ముఖ కవళికలు, కళ్ళు,  పదాలు, మీ బాడీ లాంగ్వేజ్ మరియు మీ చర్యల ద్వారా మీ ఆలోచనలు, భావాలు, ఎమోషన్స్ మరియు వైఖరులను ప్రసరింపజేస్తారు. ఆ విధంగా మీ మాటలు, చర్యలు మిమ్మల్ని మీరు చూసుకునే అద్దంలా పని చేస్తాయి. మీరు సాక్షిగా మిమల్ని పరిశీలించుకుంటేనే మీలో ఉత్పన్నమయ్యే రియాక్షన్ లు, వాటిని మీరు ఎలా వ్యక్తపరుస్తారు అనే దాని గురించి మీరు తెలుసుకోగలుగుతారు. ఒక పరిశీలకుడిగా ఉండాలనే ఈ అవగాహన రోజంతా ఉండాలి, మీకు నచ్చిన ఏదైనా మూడు వ్యక్తిత్వ లక్షణాలపై నిద్రపోయే ముందు రోజువారీ చార్ట్‌ను నింపాలి. మీరు వదిలేయాలనుకుంటున్న మీ ప్రధాన బలహీనతలు మరియు మెరుగుపరచాలనుకుంటున్న బలాలు చార్ట్‌లో చేర్చవచ్చు. మీరు ఈ వ్యక్తిత్వ లక్షణాలను అవును (బలహీనత లేకుండా ఉండిపోయారు లేదా బలాన్ని పెంచుకున్నారు) లేదా కాదు (బలహీనత నుండి విముక్తి పొందలేదు లేదా బలాన్ని పెంచుకోలేదు) లేదా శాతాల వారీగా 50% లేదా 80% వంటి లెక్క వేయవచ్చు. కాబట్టి రాత్రి పడుకునే ముందు ఒకసారి ఈ అద్దంలోకి చూసుకోవడం మంచిది. ఈ అద్దం మీకు గడిచిన రోజు యొక్క లెక్క అందిస్తుంది, అలాగే మరుసటి రోజు కోసం మిమ్మల్ని జాగ్రత్తగా ఉంచుతుంది. ఈ లక్ష్యం కోసం రోజువారీ చార్ట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజువారీ చార్ట్‌ను నింపడానికి ఎక్కువ సమయం పట్టదు మరియు సులభంగా పెట్టుకోవచ్చు. 

చివరగా మరియు ముఖ్యంగా, ఈ మూడు అద్దాలను ఎక్కువగా ఉపయోగించేవారు, తమ అంతర్గత స్వయం ఎల్లప్పుడూ అందంగా కనిపించేలా చూసుకోవడానికి వాటిని మంచిగా ఉపయోగించుకునే వారు ఇతరులకు సజీవ అద్దాలుగా మారతారని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. వారికి పరిచయం అయిన వ్యక్తులు తమ అంతర్గత స్వభావాన్ని ఖచ్చితంగా చూడగలుగుతారు. వారి స్వచ్చత మరియు పరిపూర్ణత ద్వారా ఇతరులు తమ బలహీనతలను త్వరగా తెలుసుకుంటారు మరియు వారిలాగే అందంగా, స్వచ్చంగా మరియు సద్గుణవంతులుగా మారడానికి ప్రేరణ పొందుతారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

15th dec 2024 soul sustenance telugu

వ్యక్తులను నిజాయితీగా, ఉదారంగా మెచ్చుకోవడం

మన చుట్టూ ఉన్న వ్యక్తులు వారు ఎవరో, వారు ఏమి చేస్తున్నారో అనే దానికి ఇప్పటికే పొందిన దానికంటే కొంచెం ఎక్కువ ప్రశంసలు కోరుకుంటారు. గుర్తింపు అనేది వ్యక్తి యొక్క స్ఫూర్తిని మరియు సమర్థతను

Read More »
14th dec 2024 soul sustenance telugu

ప్రపంచ పరివర్తనలో మహిళల పాత్ర

ప్రపంచంలో ప్రత్యేకమైనవారిగా చేసే అనేక మంచి సుగుణాలు మరియు శక్తులతో మహిళలు ఆశీర్వదించబడ్డారు. భగవంతుడు వారి ప్రత్యేకతలను చాలా ప్రేమిస్తారు. స్వచ్ఛత, శాంతి, ప్రేమ మరియు ఆనందాల కొత్త ప్రపంచాన్ని సృష్టించడంలో వారిని ముందుంచుతారు.

Read More »
13th dec 2024 soul sustenance telugu

గెలుపు, ఓటములపై మీ ఆత్మగౌరవం ఆధారపడుతుందా (పార్ట్ 2)

మిమ్మల్ని మీరు ఆత్మిక దృష్టితో చూడటం ప్రారంభించండి, అప్పుడు మీరు సదా విజయవంతమయ్యారని మీకు అనిపిస్తుంది – ఆధ్యాత్మిక జ్ఞానం మనల్ని మనం ఆత్మిక దృష్టితో లేదా జ్ఞాన నేత్రాలతో చూసుకోవాలని బోధిస్తుంది. మన

Read More »