Hin

22nd nov 2023 soul sustenance telugu

November 22, 2023

ఆంతరిక అందాన్ని పెంచుకోవడం

మన నిజమైన విలువ శరీరాన్ని ఆకర్షణీయంగా మార్చుకోవడంలో కాదని, మన అంతర్గత అందాన్ని పెంచుకోవడమేనని పదే పదే వింటూ ఉంటాము. ఒక వ్యక్తి యొక్క శారీరక రూపం కంటే అతని అంతర్గత అందం చాలా విలువైనదని మనందరికీ తెలుసు. అయినప్పటికీ నేడు సమాజం అందంగా కనిపించడానికి సౌందర్య సాధనాలు, అలంకరణలు మరియు శస్త్రచికిత్సలను కూడా ఉపయోగిస్తోంది.

మీ శరీరం మర్యాదపూర్వకంగా కనిపించేలా జాగ్రత్త వహించండి. కానీ మీ ఆలోచనలు, భావాలు, వైఖరి, ప్రవర్తనలు, అలవాట్లు, విలువలు మరియు సంస్కారాల సామూహిక ప్రకంపనలు అయిన అంతర్గత అందంపై ఎక్కువ దృష్టి పెట్టండి.

శక్తివంతమైన, స్వచ్ఛమైన మరియు పాజిటివ్ ఆలోచనలను చేయడానికి ప్రతి ఉదయం కనీసం 20 నిమిషాల పాటు మెడిటేషన్ చేయండి మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చదవండి. మీ ఆలోచనా క్వాలిటి మీ భావాలను సృష్టిస్తుంది, అది ఆటోమెటిక్ గా మీ రూపాన్ని ప్రతిబింబిస్తుంది.

మీ శారీరక బరువు పెరిగితే, మొదటి ఫలితం మీ శారీరక రూపాన్ని ప్రభావితం చేస్తుంది. అదే విధంగా, మీ ఆలోచనలు భారంగా, ఎక్కువగా అవ్వడంతో, మీ అంతర్గత అందం దెబ్బతింటుంది. ప్రతి గంటకు ఒకసారి ఒత్తిడి, కోపం, భయం, ఆందోళన లేదా నొప్పికి సంబంధించిన ఏవైనా ఆలోచనలు ఉన్నాయా అని పరిశీలించుకోవడానికి కాసేపు ఆగండి. వాటిని వెంటనే మార్చండి.

మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఆరోగ్యకరమైన జీవనశైలితో ఉల్లాసంగా ఉండండి, ఇతరులకు సహాయం చేస్తూ తేలికగా ఉండండి. మీ ముఖ కవళికలు, కళ్ళు, చిరునవ్వు, హావభావాలు మరియు బాడీ లాంగ్వేజ్ మీ  లోపల ఉన్న స్వచ్ఛత , శక్తిని సూచిస్తాయి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

19th sep 2024 soul sustenance telugu

కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది?

మనమందరం ఆధ్యాత్మిక శక్తులము లేదా ఆత్మలము. మనం ఈ ప్రపంచ నాటకంలో వివిధ రకాల చర్యలను చేస్తాము. మనమందరం దేహ అభిమాన ప్రభావంతో ప్రపంచ నాటకంలో చాలా మంచి చర్యలు మరియు కొన్ని ప్రతికూల

Read More »
18th sep 2024 soul sustenance telugu

మన ప్రకంపనల నాణ్యత మరియు అవి ఇతరులను ఎలా ప్రభావితం చేస్తాయి

మనం సృష్టించే ప్రతి ఆలోచన, మనం మాట్లాడే ప్రతి పదం మరియు మనం చేసే ప్రతి చర్య విశ్వంలోకి భౌతికం కాని శక్తి లేదా ప్రకంపనల రేడియేషన్కు,ఇతర వ్యక్తుల వైపు, పరిసరాల వైపు, వాతావరణానికి,

Read More »
17th sep 2024 soul sustenance telugu

ఇతరులను అనుమానించడం ఆపండి, వారిని నమ్మడం ప్రారంభించండి

మనలో కొంతమందికి మన సంబంధాలలో వ్యక్తులను అనుమానించే సూక్ష్మమైన అలవాటు ఉంటుంది. కొన్నిసార్లు ఒకరి గురించి మనకున్న సందేహాలు వారితో కంటే కూడా మన అలవాటులతో ఎక్కువ సంబంధించబడి ఉంటాయి. మన అనారోగ్యకరమైన సందేహాలు,

Read More »